మహారాష్ట్ర ఎన్నికల వేళ కాంగ్రెస్ పై మండిపడ్డారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ వన్నీ బూటకపు వాగ్దానాలేనన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం అసాధ్యం అని ఆపార్టీకీ అర్థమైందన్నారు. కాంగ్రెస్ పాలిస్తున్న ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడంలేదంటూ #FakePromisessOfCongress అంటూ ఎక్స్ వేదిగ్గావరుస ట్వీట్లు చేశారు మోదీ. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణల్లో ఇచ్చిన ఏ హామీని ఆపార్టీ ప్రభుత్వాలు నిలుపుకోవడం లేదంటూ ఆయా రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఆయన ఉదహరించారు.కాంగ్రెస్ ప్రజలను నిలువునా మోసం చేస్తోందని మండిపడ్డారు. మహిళలు, రైతులు, యువత సహా అన్ని వర్గాలకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోకపోవడమే కాక…అమలవుతున్న హామీలనూ అమలు చేయడంలేదన్నారు. కర్నాటక కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు ఎక్కువయ్యాయని, దోపిడీచేయడంలో బిజీగా ఉందని…హిమాచల్ ప్రదేశ్ లో ఉద్యోగులకు సకాలంలో జీతాలే ఇవ్వడంలేదని…ఇక తెలంగాణలో ఎన్నికలప్పుడు ఇచ్చిన రుణమాఫీ అమలు ఊసే లేదని…రైతులు నెలలనుంచీఆశగాఎదురుచూస్తున్నారనీ అన్నారు. గతంలో చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను ఏలిన ఆపార్టీ ఉద్యోగులకు అలవెన్సులు ఇస్తామని చెప్పి ఐదేళ్లు అధికారంలో ఉండీ అమలుచేయలేదన్నారు.