కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. మరోసారి హిందూఆలయాన్నిటార్గెట్ చేశారు. చేతిలో కర్రలతో బ్రాంప్టన్ లోని హిందూసభ ఆలయంలోకి ఖలిస్తాన్ మద్దతుదారులు ఒక్కసారిగా చొరబడ్డారు. అక్కడున్నహిందుభక్తులపై మెరుపుదాడికి దిగారు. ఏం జరుగుతున్నదో అర్థంకాక భక్తులు భయంతో పరుగుతు తీశారు. వారి వెంటబడి తరుముతూ విచక్షణారహితంగా కొట్టారు. ఆ సమయంలో అక్కడే ఉండి వీడియో తీసిన ఓవ్యక్తి సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. కెనడా పోలీసులను, ప్రధాని ట్రూడోను టాగ్ చేస్తూప్రశ్నించాడు. దీంతో వెంటనేపోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కెనడాలో హిందువుల ఆలయాలపై దాడులు ఇదేం మొదటిసారి కాదు. చాలాసార్లు ఖలిస్తాన్ మద్దతుదారులు ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆలయం గోడలపై భారత వ్యతిరేక నినాదాలు, ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాశారు.ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమనాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం తర్వాత వాళ్లు మరింత రెచ్చిపోయారు. నాటినుంచి ఏదో ఒక ఆలయంపై దాడులకు తెగబడుతున్నారు. గతేడాది జూన్ లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో నిజ్జర్ హత్యజరిగింది.
నాటినుంచి ఆలయాల ధ్వంసం ఘటనలపై అనేక కేసులు నమోదయ్యాయి. గతేడాది సర్రేలోని పురాతన లక్ష్మీనారాయణ ఆలయాన్నిఉగ్రవాదులు ధ్వంసం చేశారు. ఈ ఏడాది జులైలో ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయద్వారాలు, గోడలపైభారత వ్యతిరేకపోస్టర్లు, ఖలిస్తాన్ అనుకూల పోస్టర్లు అతికించారు.
ఈఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. ఇలాంటి హింస ఆమోదయోగ్యం కాదన్నారు. దర్యాప్తునకు ఆదేశించారు. హిందుభక్తులపై దాడిని భారత సంతతి ఎంపీ ఎంపీ చంద్రఆర్య ఖండించారు. ఖలిస్తానీ మద్దతుదారులు గీత దాటారని… కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదం ఏ స్థాయిలో ఉందో ఈఘటన తెలియజేస్తోందని అన్నారు. హిందూ కెనడియన్లు ఐక్యంగా, ధైర్యంగా ఉండి ఇలాంటివాటిని తిప్పికొట్టాలని అన్నారు.
జస్టిన్ ట్రూడో భారత్ పై విమర్శలు మొదలు పెట్టిననాటినుంచి ఖలిస్తాన్ ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతున్నారు. గతంలో పలుమార్లు అక్కడి హిందూ ఆలయాలను లక్ష్యం చేసుకున్నప్పటికీ భక్తులపై ఈ స్థాయిలో దాడులకు దిగడం మొదటిసారనే చెప్పవచ్చు. ఖలిస్తాన్ తీవ్రవాదుల ఈ హింసతో అక్కడి హిందువుల్లో ఆందోళన ఎక్కువైంది. స్థానిక హిందూసంఘాలు ఘటనను ఖండించాయి. ఇది కేవలం కెనడాలోని హిందువులపై జరిగినదాడిగా మాత్రమే తాము చూడడం లేదని… భారత్ లోని, ప్రపంచంలోని హిందువులందరిపై జరిగిన దాడిగా భావిస్తున్నామని అన్నారు. ఘటన జరిగిన కాసేపటికే పెద్దఎత్తునహిందువులు హిందూ సభ ఆలయానికి చేరుకున్నారు. తాము ఎవరినీ వ్యతిరేకించబోం, హాని చేయబోమని…కానీ తమ జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఐక్యంగా తిప్పికొడతామని వార్నింగ్ ఇచ్చారు.