ఉత్తరప్రదేశ్ మదర్సా విద్యా చట్టంపై సుప్రీం ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. ఆ చట్టం రాజ్యాంగబద్దమైనదేనని సమర్థించింది. గతంలో అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. యూపీ మదర్సా చట్టం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం అంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు దాన్ని రద్దు చేసింది. లౌకిక భావనకు పూర్తి విరుద్ధమైన చట్టంగా దాన్ని అభివర్ణించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు పలువురు.
దీంతో హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం ధర్మాసనం యూపీ మదర్సా చట్టం రాజ్యాంగ బద్దమైనదేనని స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చిలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జేబీ పార్తీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కొట్టేసింది. హైకోర్టు తీర్పుతో 17 లక్షలమంది విద్యార్థులు 10వేల మంది మదర్సా టీచర్లు ఇబ్బంది పడతారనీ పేర్కొంది. సుప్రీం తీర్పుతో యూపీలోని 16వేల మదర్సా కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి.