అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. స్వింగ్ స్టేట్ విస్కాన్సిస్ లో గెలుపుతో ట్రంప్ మాజిక్ ఫిగర్ కూడా దాటారు. కావాల్సిన 271 ఎలక్ట్రోరల్ ఓట్ల కన్నా ఎక్కువే ట్రంప్ ఖాతాలో పడ్డాయి. కీలకంగా భావించే స్వింగ్ స్టేట్స్ గా చెప్పే జార్జియా, నార్త్ కరోలినా, విస్కాన్సిస్, పెన్సిల్వేనియా, నెవడా, మిషిగాన్, ఆరిజోనాలను ట్రంపే స్వీప్ చేస్తున్నారు. ఇప్పటికే నాలుగురాష్ట్రాలను గెలుచుకుని , మిగిలిన మూడు స్టేట్స్ లోనూ ఆధిక్యం చూపుతున్నారు. పూర్తి ఫలితాలు వెల్లడయ్యేసరికి 315 ఎలక్టోరల్ ఓట్లు రిపబ్లికన్ పార్టీకి వస్తాయని ట్రంప్ ధీమాగా చెబుతున్నారు. ట్రంప్ ఫ్లోరిడా, జార్జియా, సౌత్ కరోలినా,పెన్సిల్వేనియా, ఐడహో, నార్త్ కరోలినా, కాన్సస్,విస్కాన్సిస్, అయోవా, వెస్ట్ వర్దీనియా,మోంటానా, ఒహాయో, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, మిస్సోరి,సౌత్ డకోటా, నెబ్రాస్కా, టెన్నెసీ, ఓక్లహోమా, టెక్సాస్, కెంటకీ, ఆర్కాన్సాస్, ఇండియానా,లూసియానా, రాష్ట్రాలను దక్కించుకున్నారు.
ఇక ముందునుంచి ట్రంప్ కు టఫ్ ఫైట్ అనుకున్న డెమొక్రటిక్ అభ్యర్ధి, వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ ఓట్ల సమయానికి బాగా వెనకబడ్డారు. కేవలం 224 ఎలక్టోరల్ ఓట్లను మాత్రమే దక్కించుకున్నారు. కాలిఫోర్నియా,మిన్నెసోటా, ఓరెగన్, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినోయీ, న్యూజెర్సీ, వాషింగ్టన్, కొలరాడో, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్,డెలవేర్, హవాయి, న్యూహ్యాంప్‌షైర్,మేరీల్యాండ్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలు ఆమె ఖాతాలో పడ్డాయి.
గెలుపు ఖాయమని తేలడంతో ట్రంప్ ఫ్లోరిడాలో మాట్లాడారు. ఇది తనకు చరిత్రాత్మక, అపురూప విజయమని అన్నారు.అమెరికా తనకు శక్తిమంతమైన విక్టరీని అందించిందనీ అన్నారు. అంతేకాదు అమెరికాకు ఇది గోల్డెన్ ఏజ్ అని అభివర్ణించారు.
నాలుగేళ్ల క్రితం హిల్లరీ క్లింటన్ పై ఓడిపోయిన ట్రంప్ నాలుగేళ్ల తరువాత అదే పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ను ఓడించి మరోసారి శ్వేతసౌధంలో అడుగుపెడుతున్నారు. గతంలో ప్రత్యర్థి పార్టీ నుంచే కాక సొంతపార్టీ నేతలనుంచీ విమర్శలు ఎదుర్కొన్నారు. నాలుగేళ్ల తరువాత అదే అమెరికా ఆయనకు రికార్డ్ విజయం అందించింది. ఈ విజయం ట్రంప్ కు ఆషామాషీ ఏం కాదు. ఈ గెలుపుకోసం ట్రంప్ ఎంతో కష్టపడ్డారు. అమెరికాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. ట్రంప్ ఇచ్చిన హామీలు కూడా అమెరికన్లలో ఆసక్తిని కలిగించాయి. అయితే నమ్మకాన్ని కూడా పెంచాయని ఫలితాలతో తేలింది.
ఇక రెండోసారి దేశ ప్రథమ పౌరుడిగా వైట్ హౌస్ లో అడుగుపెట్టబోతున్న ట్రంప్ కు పలు దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. “ఆత్మీయ మిత్రుడికి అభినందనలు. మీ చొరవ సహకారంతో భారత్ – అమెరికా సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం కావాలి. ఇరుదేశాల పురోగతి, ప్రపంచశాంతి, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దాం” అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు సహా పలువురు ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ గెలిచిన రాష్ట్రాల్లో వచ్చిన ఎలక్టోరల్ ఓట్లు,,,
టెక్సాస్ 40, ఫ్లోరిడా 30, పెన్సిల్వేనియా 19, ఒహాయో 17, నార్త్ కరోలినా 16, జార్జియా 16, టెన్నెసీ 11, ఇండియానా 11, విస్కాన్సిన్ 10, మిస్సోరి 10, అలబామా 9, సౌత్ కరోలినా 9, కెంటకీ 8, లూసియానా 8, ఓక్లహోమా 7, ఆర్కాన్సాస్ 6, అయోవా 6, కాన్సస్ 6, మిసిసిపి 6, యుటా 6, వెస్ట్ వర్జీనియా 4, మోంటానా 4, ఐడహో 4, నెబ్రాస్కా 4, వయోమింగ్ 3, నార్త్ డకోటా 3, సౌత్ డకోటా 3, మైన్ 1
కమలా హారిస్ గెలిచిన రాష్ట్రాల్లో వచ్చిన ఎలక్టోరల్ ఓట్లు…
కాలిఫోర్నియా 54, న్యూయార్క్ 28, ఇల్లినోయీ 19, న్యూజెర్సీ 14, వర్జినియా 13, వాషింగ్టన్ 12, మసాచుసెట్స్ 11, మేరీల్యాండ్ 10, కొలరాడో 10, మిన్నెసోటా 10, ఓరెగాన్ 8, కనెక్టికట్ 7, న్యూమెక్సికో 5, హవాయి 4, న్యూహ్యాంప్‌షైర్ 4, రోడ్ ఐల్యాండ్ 4, డీసీ 3, డెలవేర్ 3, వెర్మాంట్ 3, మైన్ 1, నెబ్రస్కా 1. ఇంకా నెవడా 6, మిషిగన్ 15, మైన్ 2, ఆరిజోనా 11, అలస్కా రాష్ట్రాల్లో 3 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. వాటి ఫలితాలు వెల్లడించాల్సి ఉంది.