నిండా మునిగాక చలి ఎక్కడుంటుంది? ఉంటుంది! కింద నీళ్లు ఎక్కువగా చల్లగా ఉంటే మునిగి లేవాలి లేకపోతె అంతే సంగతులు!
ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాల కరెన్సీలకంటే ఏ దేశ కరెన్సీ డాలర్ తో మారకం చేస్తే తక్కువగా ఉంది?
2015 లో $1 = 32,000 రియాల్స్.
2024, జూన్ 30 న ఇరాన్ కి కొత్త అధ్యక్షుడు గా ప్రమాణస్వీకారం చేసిన మసౌద్ పెజెక్షిన్ ( Masoud Pezekshian ) రోజుకి…
$1= 5,84,000 రియాల్స్
ఇక ట్రంప్ ఎన్నికలలో గెలుస్తున్నాడు అని తెలియగానే మరింత దారుణంగా $1 = 7,03,000 రియాల్స్ కి పడిపోయింది!చమురు, సహజవాయువు పుష్కలంగా ఉన్న ఇతర గల్ఫ్ దేశాలు ఎలా ఉన్నాయి? ఇరాన్ ఇలా ఎందుకు ఉంది?
అలీ ఖోమేని మత పిచ్చి!కేవలం ఇజ్రాయేల్ ని నాశనం చేయాలనే ఒకే ఒక లక్ష్యం తో ఆయుతోల్లా ఖోమేని తరువాత అతని కొడుకు అలీ ఖోమేని ఇప్పటివరకూ వందల కోట్ల డాలర్లు ఖర్చుపెట్టారు.
ఎవరు బాగు పడ్డారు?లెబనాన్ లో హెజ్బొల్లా నాయకులు, హమాస్ నాయకులు, హుతీ నాయకులు బాగుపడ్డారుమహమ్మద్ ప్రవక్త వారసులు రాజుగా ఉన్న జోర్దాన్ దేశమే ఇజ్రాయల్ కి సహకరిస్తున్నది!
మక్కా, మాదీనాలు ఉన్న సౌదీ అరేబియా ఇజ్రాయేల్ తో సత్సంబంధాలు పెట్టుకొని తమ పౌరుల భవిష్యత్ కోసం తాపత్రయపడుతున్నది!ఆ వందల కోట్లు ఏవో తమ పౌరుల కోసం ఖర్చు పెట్టివుంటే బాగుండేది!
అందుకే ఇరాన్ ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ మత ఛాందస ఖోమేని పీడ వదులుతుందా అని ఎదురు చూస్తూ అమెరికా, ఇజ్రాయేల్ కి సహకరిస్తున్నారు!అలీ ఖోమేని కి 82 ఏళ్ళు! పక్షవాతం వచ్చి కుడి చేయి పడిపోయినా అధికారం నుండీ తప్పుకోలేదు!
అలీ ఖోమేని మరణించిన మరుక్షణం ఇరాన్ మరింత సంక్షోభం లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇరాన్ లో కనీసం మూడు గ్రూపులు అలీ ఖోమేని తరువాత అధికారం కోసం సిద్ధంగా ఉన్నాయి. అలీ ఖోమేని రెండవ కొడుకు మిగతా రెండు గ్రూపులకి ప్రధాన ప్రత్యర్థి గా ఉన్నాడు!
ఇక ఉగ్ర గ్రూపులు కాక చైనా ప్రధానంగా లాభపడుతూ వస్తున్నది గత దశాబ్దకాలంగా! చైనా వస్తు మార్పిడి పద్దతిలో ఇరాన్ నుండీ ముడి చమురు కొంటున్నది. అందుకే చైనా డాలర్ రిజర్వ్ అనేది తగ్గకుండా పెరుగుతూ వస్తున్నది!
-పోట్లూరి పార్థసారధి