కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామం ఘర్షణల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అన్ని ఆధారాలతోనే నరేందర్ రెడ్డి ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు పోలీసుఅధికారులు తెలిపారు. అయితే, ఈ కేసుకు సంబంధించి రిమార్డ్ రిమాండ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు చేర్చారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్ కి భాగస్వామ్యం ఉందని…మరికొందరి ఆదేశాలతోనే దాడి జరిగిందని పోలీసులు అందులో పేర్కొన్నారు. రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు. అందుకోసం కొందరికి డబ్బు కూడా ఇచ్చారని.. అధికారులను చంపినా పర్లేదని రైతులను నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్టు అందులో ప్రస్తావించారు. దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే…ప్రధాన కుట్ర దారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిగా తేలిందని పోలీసు అధికారులుతెలిపారు.
పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం 07:02 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని అతని ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నేరపూరిత కుట్రతోనే దాడికి పాల్పడినట్లు నరేందర్ రెడ్డి అంగీకరించారని పోలీసులు తెలిపారు. అలాగే తమ పార్టీ ప్రముఖ నాయకుడు కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ కుట్రలకు పాల్పడినట్లు నరేందర్ రెడ్డి అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అనుచరుడు సురేష్ కు ఫోన్ ద్వారా ఆదేశాలు అందచేసినట్టు నరేందర్ రెడ్డి అంగీకరించినట్టు పోలీసులంటున్నారు. మరో నిందితుడు బి సురేష్ సీడీఆర్ డేటాలో కూడా ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు.
ఇక ఉదయం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వికారాబాద్ డిటిసి సెంటర్‌కు తరలించారు. డిటిసి సెంటర్‌కు వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం డిటిసి సెంటర్ నుంచి నేరుగా పరిగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. IG సత్యనారాయణ, ఎస్పీ నారాయణ రెడ్డి విడివిడిగా విచారించారు. దాడికి ముందు సురేష్ తో ఏం మాట్లాడారు ? దాడి జరిగిన తర్వాత సురేష్ కాల్ చేశారా ? వంటి ప్రశ్నలు అడిగి సమాచారం రాబట్టారు. అయితే ముందు అన్ని ప్రశ్నలకు ముందు తెలియదు అనే సమాధానం చెప్పినట్టు తెలిపింది. దాదాపు నాలుగున్నరగంటలపాటు ఆయన్నివిచారించారు.
ఇక లగచర్ల ఘటనలో గాయపడ్డ కొడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారి వెంకట్ రెడ్డిని రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు పరామర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి.. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను.. ఎస్పీ నారాయణ రెడ్డిని కలిశారు. లగచర్లలో ఫార్మా కంపనీ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు లగచర్ల ఘటనలో 47 మంది నిందితుల జాబితాను పోలీసులు విడుదల చేశారు. ఇంకా చాలామందినిగుర్తించాల్సి ఉందని… ఇప్పటికి 21 మంది జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించామని ఐజీ సత్యనారాయణతెలిపారు. మిగతా వాళ్ల కోసం నాలుగు టీములతో గాలిస్తున్నామని వారిలో
విట్టల్, దేవదాస్ .గోపాల్ నాయక్,సురేష్ ,రాజు, విజయ్ ప్రధాన సూత్రధారులని తేలిందన్నారు. 42 మందిని విచారిస్తే వారిలో 19మందికి భూమి లేదని తేలింది. వారికి డబ్బాశ చూపి దాడికి ఉసిగొల్పి ఉండవచ్చని, కుట్రలో భాగంగా ముందస్తు ప్రణాళికతో కలెక్టర్ మరియు అధికారులపై దాడి చేశారని భావిస్తున్నట్టు తెలిపారు.
అటు బీజేపీ స్థానిక ఎంపీ డీకే అరుణ.. లగచర్ల వెళ్ళే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మన్నెగూడ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో డీకే అరుణ, కార్యకర్తలతో అక్కడే బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వికారాబాద్ కలెక్టరేట్ చేరుకొని కలెక్టర్ ప్రతీక్ జైన్ తో.. మాట్లాడి డీకే తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పటికైనా రైతులకు ఫార్మా భూ సేకరణ పై అవగాహన కల్పించి.. ఒప్పించాలని సూచించారు ఎంపీ డీకే అరుణ.