విదేశీ నిధులు అందుకుంటూ వాటిని అభివృద్ధి-వ్యతిరేక కార్యకలాపాలు మరియు బలవంతపు మత మార్పిడులకు ఉపయోగిస్తున్న NGOలు పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఈ నెల నవంబర్ 8న జారీ చేసిన చేయబడ్డ తాజా నోటిఫికేషన్ ప్రకారం ఈ క్రింది కార్యకలాపాలకు పాల్పడే NGO ల FCRA లైసెన్స్ అంటే విదేశీ నిధులు స్వీకరించే వెసులుబాటు ఉండే లైసెన్స్ రద్దు చేస్తారు.
1. NGO స్థాపించిన లక్ష్యాలు మరియు వాటి సాధన కోసం, వాటి ప్రాజెక్ట్‌ల కోసం సేకరించిన విదేశీ విరాళాలను వాటికి ఉపయోగించకపోవడం.
2. దేశంలో అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం లేదా హానికరమైన నిరసనలను ప్రేరేపించడం, ప్రోత్సహించడం వంటి పనుల కోసం ఒక NGO తన విదేశీ విరాళాలను మళ్లించినట్లు క్షేత్రస్థాయి విచారణలో రుజువు కావడం. (అంటే పరిశ్రమలు ఏర్పాటు, విద్యుత్ పరిశ్రమలు, రైల్వే ప్రాజెక్టులు, హై వేలు,పోర్టులు వంటి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్న శక్తులకు మద్దతు ఇవ్వడం వంటి పనులు)
3. సేకరించిన విదేశీ విరాళాలతో సామాజిక లేదా మత సామరస్యాన్ని ప్రభావితం చేసే ఏదైనా కార్యకలాపాలు అంటే చట్ట విరుద్ధంగా లేదా ప్రలోభాలు ద్వారా మతమార్పిడి వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు రుజువు కావడం.
4. NGO కి సంబంధించిన ఆఫీస్ బేరర్లు వ్యక్తిగత లాభం పొందే విధంగా విదేశీ విరాళాలను ఉపయోగించడం.
5. NGO లు ఈ విదేశీ విరాళాలతో అవాంఛనీయ కార్యకలాపాలకు, తీవ్రవాద సంస్థల కార్యకలాపాలకు ఉపయోగించడం లేదా ఈ NGO ల కీలక వ్యక్తులు దేశ వ్యతిరేక సంస్థలతో, తీవ్రవాద లేదా రాడికల్ సంస్థలతో సంబంధాలు కలిగి ఉండడం.
ఎవరైనా ప్రజలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఫలానా NGO లో ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయి అని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు రుజువులతో ఫిర్యాదు చేయవచ్చు.
….చాడా శాస్త్రి..