డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE)కి భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి నాయకత్వం వహిస్తారని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయనతో పాటు ఎలన్ మస్క్ కూడా ఉంటారు. అమెరికన్ పేట్రియాట్ వివేక్ రామస్వామి, ఎలన్ మస్క్ డోగ్ విభాగానికి నాయకత్వం వహిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నానని ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు.ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు కలిసి ప్రభుత్వ బ్యూరోక్రసీని అవకతవకలపై, అదనపు నిబంధనలను తగ్గించడానికి, వృధా ఖర్చులను తగ్గించడానికి, ఫెడరల్ ఏజెన్సీలను పునర్నిర్మించడానికి సేవ్ అమెరికాకోసం పనిచేస్తారని తెలిపారు.DOGE వైట్ హౌస్,ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో భాగస్వామిగా ఉండి నిర్మాణాత్మక వ్యూహాలు,సంస్కరణలను ప్రభుత్వానికి అందిస్తుంది.తాజా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ 2025లో తన అధికారిక ప్రారంభోత్సవానికి ముందే తన టీంను సిద్ధం చేసుకుంటున్నాడు.అటు గవర్నమెంట్ ఆఫ్ ఎఫిషియెన్సీ హెడ్‌గా వివేక్ రామస్వామిగా ఎంపికైన సందర్భంగా వివేక్ రామస్వామి హైస్కూల్ వీడియో వైరల్ అవుతోంది. 2003లో 18 ఏళ్ల వయసులో సెయింట్ జేవియర్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ డేలో వివేక్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గమ్యం కంటే ప్రయాణమే ముఖ్యమని అప్పుడాయన అన్న మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ‘నేను నా హైస్కూల్ కెరీర్ మొత్తం పరుగెడుతూనే ఉన్నాను. అయితే కాస్తముందుగానే ఆగిపోయి… స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలనుకుంటున్నాను’ అని నాడు ఆయన అన్నారు. ఈ మాటలు అప్పట్లోనే అతని పరిణతికి, ముందుచూపునకు నిదర్శనమని అందరూ ప్రశంసిస్తున్నారు.కేరళకు చెందిన వివేక్ రామస్వామి తల్లిదండ్రులు అమెరికావెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సిన్సినాటీలోని సెయింట్ జేవియర్ హైస్కూల్ నుంచి 2003లో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం వివేక్ కూడా పోటీలో ఉన్నారు. అయితే ట్రంప్ కు మద్దతిస్తూ తప్పుకున్నారు. విజయం సాధించిన ట్రంప్ ఇప్పుడు తన టీంలో కీలక బాధ్యత అప్పగించారు. ఎలన్ మస్త్ తో కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఎఫిషియెన్స్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు.