మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత కన్హయ్యకుమార్. రాష్ట్రముఖ్యమంత్రి భార్య ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ లో బిజీగా ఉంటే ధర్మ రక్షణ బాధ్యత ప్రజలే ఎందుకు భరించాలని అన్నారు.నాగ్పూర్ నైరుతి నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా కన్హయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.అక్కడినుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రఫుల్ల గూడాఢేతో బీజేపీ నుంచి ఫడ్నవిస్ తలపడుతున్నారు. అయితే ప్రత్యేకంగా అమృతాపేరు ప్రస్తావించలేదు.’ఇది ధర్మయుద్ధంఅయితే మతాన్ని రక్షించే విషయంలో మీకు నీతులు చెప్పే నాయకుడిని ప్రశ్నించండి. ఆపనిని వారి సొంత పిల్లలు చేస్తారా అని. నాయకుల పిల్లలువిదేశాల్లో చదువుతుంటే ధర్మాన్ని కాపాడడం ఎలా సాధ్యం? ఇక్కడ ఉపముఖ్యమంత్రిగారి భార్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటే ప్రజలెందుకు ధర్మరక్షణలో ఉంటారు’
కన్నయ్యకుమార్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఒకవైపు ‘లడ్కీ హు లడ్ సక్తీ హూ అని చెప్తూ మరోవైపు మహిళలను కాంగ్రెస్ పార్టీ ఆవమానిస్తోందని ఆపార్టీ నాయకులు మండిపడ్డారు. అఫ్జల్ గురు వంటి ఉగ్రవాదులను సపోర్ట్ చేసిన కన్హయ్య కుమార్ మాజీ సీఎం సతీమణిని అవమానించారని…దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని నేతలు నిలదీశారు.
అయితే కన్హయ్య కుమార్ మాటల్లో తప్పేంలేదని కాంగ్రెస్అంటోంది. ఇక అమృతానే కాక… ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నఅమిత్ షా కుమారుడు జైషాను కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. ధర్మరక్షణ చేయాల్సిన జైషా బీసీసీఐలో ఐపీఎల్ టీంలను ఏర్పాటుచేస్తున్నాడని, క్రికెటర్ కావాలని కలలుకని జాదగాళ్లుగా మిగిలిపోయాడని వ్యాఖ్యానించారు.
జేఎన్యూ విద్యార్థినాయకుడిగా ఉన్నప్పటినుంచే కన్హయ్య చుట్టూ అనేక వివాదాలున్నాయి. అతనిస్నేహితులే అతన్ని కులవాది అని, అబద్దాల కోరు అని విమర్శించారు. ఇక 2016లో దేశద్రోహం కేసులో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పార్లమెంటు దాడికేసులో దోషి అయిన ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరితీసి రెండేళ్లు అయిన సందర్భంగా జేఎన్యూ కేంపస్ లో సంస్మరణ సభ నిర్వహించాడు.