నటి కస్తూరి అరెస్ట్-తమిళనాడులోని తెలుగువాళ్లను అవమానించిందంటూ ఆమెపై కేసులు
తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిందనే ఆరోపణలపై సినీనటి కస్తూరిని చెన్నై పోలీసులుఅరెస్ట్ చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 300 ఏళ్ల కిందట తమిళనాడు రాజుల అంతపురాల్లో ఆడవారికి సేవ చేసేందుకు తెలుగు వారు ఇక్కడికి వచ్చారని కస్తూరి అన్నారు. అలాంటివాళ్లు ఇప్పుడు తమది తమిళజాతి అని చెప్పుకుంటున్నారని కస్తూరి అన్నారు.దాంతో కస్తూరిపై తమిళనాడులోని తెలుగువాళ్లు ఫిర్యాదు చేశారు. పలుచోట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. కస్తూరి క్షమాపణలు చెప్పినప్పటికీ ఆమెపై నిరసనలు, విమర్శలు ఆగలేదు. అటు కస్తూరి ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
ఈనేపథ్యంలో పోలీసులు చెన్నైలోని ఆమె ఇంటికి వెళ్లగా అక్కడ లేదు. ఆమె హైదరాబాద్ లో ఉన్నారన్న సమాచారంతో చెన్నై నుంచి ప్రత్యేక పోలీస్ బృందం ఇక్కడికి వచ్చి నార్సింగి లోఆమెను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై తరలించారు.