మైనారిటీ విశ్వవిద్యాలయం జామియా మిలియా ఇస్లామియాలో మత పరమైన వివక్షతో పాటు బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతోందని తేలింది.ఢిల్లీకి చెందిన ఎన్జీవో కాల్ ఫర్ జస్టిస్ ప్యాక్ట్ ఫైండింగ్ కమిటీ విచారణలో తేలింది. యూనివర్సిటీలో ముస్లిమేతరులపై వరుస వేధింపులు కొనసాగుతున్నాయట. వారిలో విద్యార్థులే కాక అధ్యాపకులూ ఉన్నారు. పలువురు విద్యార్థులు, సిబ్బందినుంచి ఫిర్యాదుల నేపథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇప్పుడు చదువుతున్న విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థుల వరకు మొత్తం 27 మంది వాంగ్మూలాలను కమిటీ నమోదు చేసింది.ఇస్లాంలోకి రావాలని తమనూ బలవంతపెట్టినట్టు వారు అంగీకరించారు.అయితే వారి వివరాలను కమిటీ గోప్యంగా ఉంచింది.
ముస్లిమేతర సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో పాటు విద్యార్థులనూ పలు విధాలుగా వేధించారట. 2011లో యూనివర్సిటీ మైనారిటీ హోదా పొందిననుంచీ పరిస్థితి మరీ దిగజారి వేధింపులు ఎక్కువైనట్టు తేలింది. నాటినుంచి ముస్లిమేతరుల సంఖ్య నాటినుంచి ఏటికేడు గణనీయంగా తగ్గుతూ వస్తోంది.
వరుస ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో వివక్ష, బలవంతపు మార్పిళ్లపై కీలక అంశాలను పరిశోధించే బాధ్యతనుకమిటీకి అప్పగించింది. ముస్లిమేతరులపై వేధింపులు, 2011 నుంచి ముస్లిమేతర విద్యార్థులు, సిబ్బంది తగ్గడం వెనక కారణాలు తెలుసుకోవడం, ప్రతికూలవాతావరణాన్నిపెంపొందించడంలో యూనివర్సిటీ అధికారుల పాత్రను గుర్తించడం వంటివిఉన్నాయి. ఇక దేశ వ్యతిరేక కార్యకలాపాలకూ యూనివర్సిటీ నిలయంగా మారుతోందన్న విమర్శల నేపథ్యంలో దర్యాప్తు చేయాలని, విచారణ సమయంలో వెలుగుచూసే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం కమిటీ పనులు.
తాను ఎంతో వివక్షను ఎదుర్కొన్నానని, వేధింపులు భరించానని ఓ విద్యార్థిని కమిటీకి తెలిపింది. అలాగే ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్,ఆమె ముస్లిం సహోద్యోగులు తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించింది. పీహెచ్డీ చేసే సమయంలో చాలావిధాలా ఇబ్బందిపెట్టారని…సెలవులనూ ఇచ్చేవాళ్లుకాదని తెలిపింది.పీహెచ్డీ పూర్తిచేసి అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి కోసం దరఖాస్తు చేసుకుంటే ఓ క్లర్ సైతం తనను అపహాస్యం చేశారని పేర్కొంది. అయితే రిజిస్ట్రార్ కు కంప్లైంట్ చేసి వీసీ అపాయింట్మెంట్ కోరింది. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తన కన్నా తక్కువ అర్హతలు ఉన్న ముస్లిం జూనియర్లకు మాత్రం అపాయింట్మెంట్లు, ప్రమోషన్లు వచ్చేవని వాపోయింది.
ఇక ఇస్లాంలోకి మారాలని నిరంతరం ఒత్తిడి చేసేవారని మరో విద్యార్థి తెలిపింది. హిందూవిశ్వాసాలు,ఆచార సంస్కృతులను అపహాస్యం చేస్తూ భద్రత, గౌరవం కావాలంటే ఇస్లాంలోకి రావాలని భయపెట్టేవారని మందికొందరు తెలిపారు. పనిభారం, వృత్తిపరమైన ఒత్తిళ్లు, గౌరవం లేకపోవడం వంటి వాటితో స్టాఫ్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని తేలింది. దాదాపు అందరు ముస్లిమేతర విద్యార్థులు, ప్యాకల్టీపై వేధింపులు ఉండేవని చాలామంది కమిటీకి విన్నవించారు.
ఎస్సీనైన తాను తీవ్ర వివక్షకు గురైనట్టు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ కమిటీ ముందు చెప్పాడు. కూర్చోవడానికి కేబిన్లో సరైన కుర్చీ కూడా ఉండేది కాదని…మినిమం వసతులుకూడా తనకు యూనివర్సిటీ కల్పించలేదని తనతో పాటే చేరిన ముస్లిమేతరులకు మాత్రం అన్ని సౌకర్యాలు, మర్యాదలూ ఉండేవని చెప్పుకుని వాపోయారు. వివక్ష, వేధింపులపై డిపార్ట్ మెంట్ హెడ్ కు, వీసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని… తనకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు అధికారులు వీసీకి తప్పుడు నివేదికలు సమర్పించినట్టు చెప్పుకున్నారు.
కాల్ ఫర్ జస్టిస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి జస్టిస్ శివనారాయణ్ ధింగ్రా అధ్యక్షుడిగా…న్యాయవాది రాజీవ్ కుమారి కార్యదర్శి కాగా..ఢిల్లీ ప్రభుత్వ మాజీ కార్యదర్శి IAS నరేంద్ర కుమార్, ఢిల్లీ పోలీసు మాజీ కమిషనర్ SN శ్రీవాస్తవ, కిరోరి మాల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ నదీమ్ అహ్మద్, ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ పూర్ణిమ సభ్యులుగా ఉన్నారు.