కాంగ్రెస్ ఠాక్రేను స్మరించుకోగలదా…ప్రశంసించగలదా అనిప్రధాని మోదీ ఉద్ధవ్ ఠాక్రేను సవాల్ చేసిన నేపథ్యంలో మూడురోజులకు ఆయన వర్దంతి సందర్భంగా ట్వీట్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.
‘బాల్ ఠాక్రే 12వ వర్దంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటున్నా. ఉద్దవ్, ఆదిత్య ఠాక్రే, శివసేన కుటుంబం ఆలోచనల్లో ఠాక్రే ఉన్నారు” అని రాహుల్ ట్వీట్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ కూటమిలోనే ఉన్నప్పటికీ రాహుల్ మాత్రం బాల్ ఠాక్రే పేరు తీసిన సందర్భాలుచాలా తక్కువ. సోషల్మీడియాలో ఆయన ప్రస్తావనైతే ఇదే మొదటిసారి. బాల్ ఠాక్రే బతికి ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీని, ఆపార్టీ సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ మోదీ ఉద్ధవ్ ను, కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే తన పార్టీ రిమోట్ కంట్రోల్ ను పూర్తిగా కాంగ్రెస్ చేతిలో పెట్టారని ఆరోపించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా శివాజీ పార్క్ లోజరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. మహా వికాస్ అఘాడీలోని ఓ పార్టీ తన రిమోట్ కంట్రోల్ ను బాలాసాహెబ్ ఠాక్రేను అవమానించిన వారికి అప్పగించారని వ్యాఖ్యానించారు. బాల్ ఠాక్రే పేరునైనా కాంగ్రెస్ తీయగలదా అని ప్రశ్నించారు. బాలాసాహెబ్ ఠాక్రేను కాంగ్రెస్ పొగిడేలా ఉద్ధవ్ చేయగలరా అనిసవాలు చేశారు. దీంతో ఆయన వర్దంతి సందర్భంగా రాహుల్ గాంధీ నుంటి ట్వీట్ వచ్చింది.
అయితే రాహుల్ ఠాక్రే వర్దంతి సందర్భంగా చేసిన ట్వీట్లో స్మరణ తప్ప…ప్రశంసలేంలేవు. ఎన్నికలవేళ కేవలం హిందువుల ఓట్ల కోసమే రాహుల్ ఆట్వీట్ చేశారని బీజేపీ అంటోంది..