సాధారణంగా కాన్పులు నిర్వహించే అన్ని పెద్ద ఆస్పత్రులలోనూ తల్లి పాలు సేకరించి నిల్వచేసే బ్యాంక్ లు ఉంటూ ఉంటాయి. పసి బిడ్డలకు వారి తల్లులు పాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు, అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది అని ఆరోగ్య వంతులైన తల్లుల వద్ద ఉచితంగా చనుబాలు సేకరించి నిల్వ చేస్తారు.బెంగళూరులో 2016లో నియో లాక్టా లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ డైరీ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి అని చెప్పి ఫుడ్ సేఫ్టీ ఆధారిటీ వద్ద లైసెన్స్ తీసుకుని ప్రారంభం అయింది.
అయితే, ఈ కంపెనీ తల్లి చనుపాలు కూడా సేకరించి వాటిని ప్రాసెస్ చేసి శుద్ధి చేసి అమ్ముతామని ఆయుష్ మినిస్ట్రీ నుండి ఆయుర్వేదిక్ ఉత్పత్తి క్రింద లైసెన్స్ తీసుకుంది. అయితే ఇలా చనుబాలుతో వ్యాపారం చేయడం పై దుమారం రేగడంతో ఫుడ్ సేఫ్టీ అథారిటీ దీని ఈ కంపనీ 2021 లో తనిఖీ చేస్తే వారి దగ్గర ఫ్రీజ్ చేయబడ్డ చనుబాలు, ప్రాసెస్ చేయబడ్డ చనుబాలు, పౌడర్ గా మార్చబడ్డ చనుబాలు ప్యాకెట్ల వారికి లభించాయి. దాంతో ఫుడ్ సేఫ్టీ ఈ అన్ని మిగతా కంపెనీల లైసెన్స్ లతో పాటు ఈ కంపనీ లైసెన్స్ రద్దు చేసింది.
లైసెన్స్ రద్దుపై ఈ కంపనీ కర్ణాటక హై కోర్ట్ కి వెళ్తే కంపనీ కు అనుకూలంగా రద్దు పై సెప్టెంబర్ 2022లో హై కోర్ట్ తాత్కాలిక స్టే మంజూరు చేసింది. అయితే, ఈ స్టే రద్దు చేయమని కర్ణాటక ప్రభుత్వం కానీ, ఆయుష్ మినిస్ట్రీ గానీ, ఫుడ్ సేఫ్టీ ఆధారిటీ కానీ వెంటనే ఏ చర్యలు తీసుకోలేదు. మళ్ళీ జూన్ 2023లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ హై కోర్ట్ స్టే పై అభ్యంతరాలు తెలియచేసింది. ఈ
స్టే పూర్తిగా ఎత్తివేయమని ఒక పిల్ కూడా దాఖలు కాగా, ఈ సం. మార్చి నెలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ స్టే ఎత్తి వేయాలి అని మళ్ళీ హై కోర్ట్ ని కోరింది.2021లో ఫుడ్ సేఫ్టీ అథారిటీ మిగతా కంపెనీల లైసెన్సులు రద్దు చేయడం మరియు ఈ ఒక్క కంపనీ కి హై కోర్ట్ స్టే లభించడం తో ఈ మూడు సం. లుగా ఈ కంపనీ భారీ వ్యాపారం చేసింది.
ఆ కంపనీ ఇలా సేకరించిన చనుబాలు ప్రాసెస్ చేసి, అవసరమైన పోషకాలు అవి కలిపి ఒక 50 మిల్లి గ్రాముల చనుబాలు గల పేకేట్ ఒకటి ₹1213 రు.లకు అదే పౌడర్ గా మార్చిన చనుబాలు 10గ్రాముల పౌడర్ పేకేట్ ₹319 కి మార్కెట్ లో అమ్ముతోంది.
ఆ కంపనీ ఎండి ప్రకారం వాళ్ళు ఆస్ట్రేలియా లో ఇదే వ్యాపారం చేస్తున్నామని భారత్ లో గత కొద్ది సం. లలో సుమారు 51వేల మంది ముందుగానే పుట్టేసిన పసిబిడ్డలకు 450 ఆసుపత్రుల ద్వారా చనుబాలు సరఫరా చేసాం అని, దీనికి సంబంధించిన అత్యాధునిక టెక్నాలజీ మా వద్ద ఉంది అని చెప్పారు.
హై కోర్ట్ లో పిల్ దాఖలు అయిన వెంటనేకేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇటువంటి లైసెన్స్ లను అన్నింటినీ రద్దు చేయమని ఆదేశాలు ఇచ్చింది.కేసు మళ్ళీ డిసెంబర్ 5న విచారణకు వస్తుంది.
…చాడా శాస్త్రి….