గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.సల్మాన్ ఖాన్ ఇంటిముందు రెక్కీ, కాల్పుల ఘటన సహా పలుకేసుల్లో నిందితుడిగా ఉన్న అన్మోల్ అమెరికాలో పోలీసుల చిక్కినట్టు తెలిసింది. ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖి హత్యలోనూ అన్మోల్ కు ప్రమేయం ఉంది. అతను చెప్పినందునే సిద్దిఖిని కాల్చి చంపినట్టు నిందుతులు పోలీసులకు తెలిపారు.2022లో పంజాబీ గాయకులు మూసేవాలా హత్య కేసులోనూ అన్మోల్ అనుమానితుడు. అన్మోల్ ను భారత్ తీసుకొచ్చేందుకు అనుమతివ్వాలంటూ ముంబై పోలీసులు స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు. జైల్లో ఉన్న లారెన్స్ తమ్ముడితో నేరాలు చేయించినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. బాబా సిద్ధిఖి హత్య నేపథ్యంలో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీఅయింది.కాలిఫోర్నియా పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే ముంబై పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు.