నటి, ఫెమినిస్ట్ స్వరభాస్కర్ వేషంమార్చింది. హిజాబ్ ధరించి భర్త ఫహద్అహ్మద్ తో కలిసి ఇస్లామిక్ మతగురువు సజ్జాద్ నోమానిని కలిసింది. అనుశక్తినగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహా వికాస్ అఘాడీ కూటమి అభ్యర్థిగా ఫహద్ పోటీచేస్తున్నాడు. తన భర్త గెలుపుకోసం ఆ ఇస్లామిక్ తమ గురువు మద్దతు కోరుతూ పూర్తిగా ముస్లిం యువతిలా మారి అతన్ని కలిసింది స్వరా. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్ర ఓటర్లు ఎన్సీపీ-కాంగ్రెస్-సేన కూటిమికే ఓటేయాలని ముస్లిం సమాజానికి నోమాని పిలుపునిచ్చాడు.
స్త్రీవాదం, మహిళాసాధికారత గురించి వేదికలెక్కి ప్రసంగాలిస్తూ ఉంటుంది స్వరా. అలాంటిది ఆడపిల్లలను పాఠశాలలు,కళాశాలలకు పంపడాన్నివ్యతిరేకించే మౌల్వీని భర్తకోసం వెళ్లి కలిసింది. అదీ హిజాబ్ ధరించి. ఆడపిల్లలను బడికి పంపడం ఇస్లాంకు విరుద్ధమని పలుసందర్భాల్లో చెప్పాడు నోమాని. అంతేకాదు ఒంటరిగా తమ కుమార్తెలను విద్యాసంస్థలకు పంపే తల్లిదండ్రులు నరకానికీ వెళ్తారనీ ప్రకటించాడు. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించినా సరే తోడులేకుండాఎక్కడికీ పంపవద్దని ముస్లిం సమాజానికి ఆదేశించారు. ఇంట్లోనే ఆడపిల్లలను చదివించుకోండి తప్ప ఎక్కడికీ పంపవద్దనీ, ముస్లిం మహిళలను ఇళ్లకు పరిమితం చేస్తేనేమంచిదని పలు సందర్భాల్లో సూచించాడు. ఆడపిల్లలను బడికి పంపేబదులు నిరక్షరాస్యులుగా ఇంట్లో పెట్టుకోవడం మంచిదని చెప్పిన వీడియోలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ల ఇస్లామిస్ట్ పాలనకు నోమాని అభిమాని. తాలిబన్ లు కాబూల్ ను స్వాధీనం చేసుకున్నతరువాత అభినందనలు పంపించాడు.
“అధికారం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సమాజాన్ని ఎవరూ ఓడించలేరు. తాలిబాన్‌లకు అభినందనలు! నేనొక ముస్లింగా, మీ ధైర్యానికి, దృఢ సంకల్పానికి నమస్కరిస్తున్నాను . ఈ చరిత్రాత్మక ఘట్టానికి ప్రపంచం సాక్షిగా నిలించింది. ఆఫ్ఘనిస్తాన్ లోని మతపెద్దలకు నా హృదయ పూర్వక అభినందనలు” అంటూ సందేశం పంపాడు. ఇక ఆర్ఎస్ఎస్ పై తరచూ విమర్శలు చేసే నోమాని ముస్లిం అమ్మాయిలను లొంగదీసుకోవడానికి ఇస్లామిక్ బోధనలు, ఉర్దూలో శిక్షణపొందిన యువకులను ఆర్ఎస్ఎస్ ముస్లిం సమాజంమీదకు పంపుతోందని నిరాధార ఆరోపణలు చేశాడు.
అలాంటివాడిని ఫెమినిస్ట్ ను అని చెప్పుకునే స్వరాభాస్కర్ కలిసింది. కేవలం భర్త కోసం, ముస్లింల ఓట్ల కోసం వేషం మార్చి మరీ కలిసింది. దీంతో నటిగా కురచ దుస్తులు వేసుకున్న స్వరా ఫొటోల్ని, హిజాబ్ ధరించి ఉన్న ప్రస్తుత ఫొటోల్ని కలిపి ట్రోల్ చేస్తున్నారు.గతంలో కశ్మీర్ ఫైల్స్ ,కేరళస్టోరీ సినిమాలను స్వరా తప్పుబట్టింది. కశ్మీర్లో హిందువులపై ముస్లింలదాడులు అసత్యమని, కేరళలో లవ్ జిహాద్ లే లేవనీవాదించింది. తాజాగా ఎంతో లిబరల్ గా ఉంటే తాను మాత్రం నిండైన చుడీదార్ ధరించి, హిజాబ్ తో మహిళా స్వేచ్ఛను, స్త్రీవిద్యను వ్యతిరేకించే మతపెద్దను కలిసింది.