గౌతమ్ అదానీ, సాగర్ అదానీ,సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినిత్ జైన్ US ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (FCPA) కింద అభియోగాలు ఎదుర్కోవడం లేదని స్పష్టం చేస్తూ అదానీ గ్రీన్ ఎనర్జీ నిన్న స్టాక్ ఎక్స్చేంజి కి అధికారికంగా తెలియచేసింది.
“US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) నేరారోపణలలో లేదా US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) యొక్క సివిల్ ఫిర్యాదులో పేర్కొన్న ఛార్జిస్ లో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ మరియు మిస్టర్ వినీత్ జైన్‌లు ‘ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (FCPA)’ ఉల్లంఘనకు పాల్పడ్డారని అభియోగాలు మోపబడలేదు. వారిపై ఆరోపించిన ఆరోపణలలో వైర్ మోసం కుట్ర మరియు సెక్యూరిటీల మోసం ఆరోపణలుమాత్రమే ఉన్నాయి, ”అని కంపెనీ తన ఫైలింగ్‌లో తెలిపింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ US లంచం ఆరోపణలకు సంబంధించిన వివరణను స్టాక్ ఎక్స్చేంజి కి ఇచ్చిన తర్వాత అదానీ గ్రూప్ షేర్లు బుధవారం 20% వరకు పెరిగాయి.
ఆదానీ విషయంపై భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీతో పాటు రాజ్యసభ ఎంపీ, మరియు సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోపణలకు విశ్వసనీయమైన ఆధారాలు లేవని అన్నారు. “నేను US కోర్టు ద్వారా వచ్చిన నేరారోపణలు పూర్తిగా చదివాను. దానిలో ఐదు ఛార్జీలు ఉన్నాయని నా భావన. ఒకటి మరియు ఐదు చార్జీలు మిగతా వాటి కంటే చాలా ముఖ్యమైనవని గమనించాలి. అయితే 1వ లేదా 5వ ఆరోపణలో అదానీ మీదా లేదా అతని మేనల్లుడు సాగర్ ఆదాని మీద ఆరోపణలు చేయలేదు” అని ముకుల్ రోహత్గి అన్నారు.
అదానీ ఎగ్జిక్యూటివ్‌లపై కాకుండా వేరే కొంతమంది ఇతర వ్యక్తులపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయని ముకుల్ రోహత్గీ చెప్పారు “ఇలాంటి అస్పష్టమైన ఆరోపణలపై అర్థవంతంగా స్పందించడం అసాధ్యం,” అన్నారాయన.
“ఇద్దరు అదానీలను మినహాయించి ఇతర వ్యక్తులపై నేరారోపణ నంబర్ 1లో ఉంది. అందులో వేరే కొంతమంది అధికారులు మరియు ఒక విదేశీ వ్యక్తి ఉన్నారు. అమెరికా రూపొందించిన విదేశీ అవినీతి పద్ధతుల చట్టాన్ని ఉల్లంఘించే కుట్ర ఉందనేది మొదటి ఆరోపణ. అందులో అదానీల పేరు లేదు” అని భారత మాజీ అటార్నీ జనరల్ చెప్పారు.
ఇక మిగతా 3 ఆరోపణల ఛార్జ్ షీట్ పరిశీలిస్తే…
విద్యుత్ సరఫరా మరియు కొనుగోలుకు సంబంధించి భారతీయ సంస్థలలో అదానీలతో సహా ఈ వ్యక్తులు భారతీయ అధికారులకు లంచం ఇచ్చారని ఆరోపిస్తున్న ఛార్జ్ షీట్ ఇది. కానీ ఈ ఛార్జ్ షీట్‌లో ఎవరికి లంచం ఇవ్వబడింది, అతను ఏ పద్ధతిలో లంచం పొందాడు మరియు అధికారి లేదా అటువంటి వాడు ఏ విభాగానికి చెందినవాడు అనే విషయంలో నాకు ఒక్క పేరు లేదా వివరాలు కనిపించలేదు అని ముకుల్ చెప్పారు. చాలా వివరాలు పై ఈ చార్జిషీటు పూర్తిగా సైలెంట్‌గా ఉంది కాబట్టి ఇలాంటి ఛార్జ్‌షీట్‌లపై ఎలా స్పందిస్తారో తెలియడం లేదు…’’ అని ముకుల్ అన్నారు.
ఇవి నా వ్యక్తిగత న్యాయపరమైన అభిప్రాయాలని ఆయన స్పష్టం చేశారు. “నేను అదానీ గ్రూప్‌కి ప్రతినిధిని కాదు. నేను న్యాయవాదిని మరియు అనేక కేసుల్లో అదానీ గ్రూప్ తరపున హాజరవుతున్నాను, ”అని అతను చెప్పారు.
ఇక మరో సీనియర్ న్యాయవాది మహేష్ జీత్ మలానీ మాట్లాడుతూ అమెరికా న్యాయవ్యవస్థ(DOJ) అత్యంత తొందరపాటుగా వ్యవహరిస్తోంది. ఇదే విషయం పై డోనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడారు. అభియోగపత్రం హడావిడిగా తయారు చేసినట్లుకనిపిస్తోంది మరియు దానిలో వాస్తవం లేదు, ఇది రాజకీయ చర్య లాగా ఉంది అని, డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల విజయంపై గౌతమ్ అదానీ బహిరంగ అభినందనలు చెప్పడం అనవసరమైన ఈ వివాదానికి దారితీసి ఉండవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక నార్వే మాజీ మంత్రి, అంతర్జాతీయ పర్యావరణ నిపుణుడు మరియు దౌత్యవేత్త అయిన ఎరిక్ సోల్హీమ్ ఆదాని పై వచ్చిన తాజా ఆరోపణలపై స్పందిస్తూ…
మిగతా దేశాల విషయంలో అమెరికన్ ఓవర్ రీచ్ ఎప్పుడు ఆగుతుంది?? అని ప్రశ్నించారు.గత వారం గ్లోబల్ మీడియా అదానీ గ్రూప్‌పై అమెరికన్ ప్రాసిక్యూటర్ చేసిన నేరారోపణ గురించి కథనాలతో నింపేసింది.అమెరికా ఈ ఓవర్ రీచ్ ఎప్పుడు ఆగిపోతుందని ప్రపంచం అడగడం ప్రారంభించే సమయమా ఇది అని ఆయన ప్రశ్నించారు?
ఒక సెకను పాటు టేబుల్‌ను అటువైపు తిప్పి చూడండి అంటూ USలో జరిగిన నేరాలకు సంబంధించి భారతీయ న్యాయస్థానం ఒక అగ్ర అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లపై అభియోగాలు మోపిందని అనుకుందాం. ఇది అమెరికాకు ఆమోదయోగ్యంగా ఉంటుందా? అమెరికన్ మీడియా దీన్ని సముచితంగానే భావిస్తుందా? అని ఎరిక్ ప్రశ్నించారు.
అదానీ గ్రూప్ అగ్రనేతలు గౌతమ్ మరియు సాగర్ అదానీలపై ఆరోపణలు లేవని ఇప్పుడు స్పష్టమైంది.
అలాగే భారత ప్రభుత్వ అధికారులకు అదానీ అధికారులు లంచాలు ఇచ్చినట్లు కూడా ఆధారాలు లేవు. నేరారోపణ కేవలం లంచాలు వాగ్దానం చేయబడిన లేదా చర్చించబడిన అనే వాదనలపై మాత్రమే ఆధారపడి ఉంది అని ఎరిక్ చెప్పారు.
అమెరికన్ ఈ ఓవర్ రీచ్ ప్రజల జీవితాలకు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది అని, ఇది భారతదేశ ఆర్థిక శక్తి కేంద్రాలలో(అంటే ఆదాని గ్రూప్) ఒకదానికి తన కార్యకలాపాలకు ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కష్టతరం చేస్తుంది. అమెరికా పెట్టిన ఈ ఇబ్బంది ఆదాని గ్రూప్ కి సోలార్ మరియు విండ్ ప్లాంట్‌లను నిర్మించడం కంటే కోర్టులో దాని సమయం మరియు దాని వనరులను వెచ్చించేలా అదానీ గ్రూప్‌ను ఫోర్స్ చేస్తుంది. ఇది భారతదేశం యొక్క గ్రీన్ ఉద్యమం ని నెమ్మదిస్తుంది అని ఏరిక్ అభిప్రాయ పడ్డారు.
నా మాట:
ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఆ దేశ ప్రధాన ప్రతిపక్షం ఆ దేశ పెద్ద వ్యాపార సంస్థలు మీద ఇలా అలుపులేకుండా దాడి చేసినట్లు వార్తలు ఎప్పుడైనా విన్నామా? మరి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అలా చేస్తోంది?
బహుశా కాంగ్రేస్ పార్టీ చైనాతో చేసుకున్న రహస్య ఒప్పందం అదే MOUలో భాగంగా చైనాకు సహాయం చేయడానికి ఆ దేశానికి విదేశాల్లో దక్కవలసిన పోర్ట్స్, గనులు, పవర్ ప్లాంట్స్ మొదలగు ప్రాజెక్టుల టెండర్ల సమయంలో వాటిని ఆదాని గ్రూప్ తన్నుకుపోకుండా ఆదాని గ్రూప్ ని ఆర్థికంగా బలహీన పరిచే కుట్ర లాగే ఇది కనిపిస్తోంది. అందుకే దేశంలో మరే సమస్యా లేదు అన్నట్లుగా గత పది సం. లుగా రాహుల్ పదే పదే పదే పదే ఆదాని గ్రూప్ పేరు వివాదాస్పదం చేస్తూ అగ్రూప్ ని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నాడు అనే అనుమానం బలపడుతోంది.
కొస మెరుపు:
ఒక వైపు కాంగ్రెస్ ఈ హడావిడి చేస్తూ ఉంటే మరో వైపు ఆదాని గ్రూప్ తో లావాదేవీలు మేం జరపం అని మేం చెప్పలేం అని కర్ణాటక ఉపముఖ్యమంత్రి DK శివకుమార్ చెప్పారు.
…..చాడా శాస్త్రి….