బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆగడంలేదు. ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణప్రభు అరెస్ట్ నేపథ్యంలో చెలరేగిన అల్లర్లు దేశమంతటా వ్యాపిస్తున్నాయి. ఇక శుక్రవారం సాయంత్రం చిట్టోగ్రామ్ లో రెచ్చిపోయిన మతోన్మాదమూక మూడు హిందూ ఆలయాలను ధ్వంసం చేసింది. శాంతనేశ్వరిమాత ఆలయం దాని సమీపంలోని షోనీ ఆలయం, కాళీబారీ ఆలయాలను ఈసారి లక్ష్యంగా చేసుకున్నారు. వందలాదిమంది ఇటుకలు,రాళ్లతో ఆలయాలవైపు వచ్చిదాడి చేసిన దృశ్యాలు బయటకువచ్చాయి. ఆలయాలధ్వంసం జరిగింది నిజమేనని పోలీసుఉన్నతాధికారులు ధ్రువీకరించారు.
రెండు రోజులుగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దారుణాలకు సంబంధించిన మరికొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటితో పాటు ఓ ఫొటో కూడా. ఢాకాలోని బంగ్లాదేశ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కేంపస్ ఎంట్రన్స్ గేట్ దగ్గర మన జాతీయ జెండాను పెట్టారు. లోపలికి వెళ్తున్న వారంతా ఆజెండాను తొక్కుకుంటూ వెళ్లాలన్నమాట.అంటే ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నపని అదని అర్థం అవుతూనే ఉంది. భారత్ పట్ల వ్యతిరేకతను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారన్నమాట. అసలైతే భారత్ లేనిది వాళ్లకు ఉనికి లేదు. వాళ్లకు స్వాతంత్ర్యమే మనం పెట్టిన భిక్ష. కన్నూమిన్నూ గానక కొందరు మతోన్మాదులు అక్కడి హిందువులను, హిందూఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశాన్ని ఏలుతున్న పాలకుల అండతో.
హిందూసంస్థ ఇస్కాన్ ను టార్గెట్ చేశారు. దేశద్రోహం కేసు పెట్టి సంస్థ బంగ్లాదేశ్ బాధ్యుడు చిన్మయ కృష్ణదాస్ ప్రభును అరెస్ట్ చేశారు. హిందువుల హక్కుల కోసం పోరాడుతున్నారు కనుక దేశద్రోహి అన్నమాట. ఆయన అరెస్ట్ ను భారత విదేశాంగ ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన కొన్ని గంటల్లోనే బంగ్లాదేశ్ ప్రభుత్వమూ ఓ నోట్ పంపింది భారత్ కు.
బంగ్లాదేశ్ సర్వసత్తాక దేశం! మా చట్టాలు మాకు ఉన్నాయి వాటి ప్రకారం చర్యలు తీసుకునే హక్కు మాకు ఉంటుంది. ఉంది…ఇదీ దాని సారాంశం.
భారత వ్యతిరేకతతో, అక్కడి హిందువులపై దాడితో ఆ దేశం మూటగట్టుకోబోతున్నదేంటి? ఏమీ లేదు. వినాశనమే. మరో పాకిస్తాన్ కాబోతోందంతే. విద్యుత్, ఇంధనం ధరలు సహా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటబోతున్నాయి. షేక్ హసీనా చేతికి మళ్లీ పగ్గాలు అప్పజెప్పినా కోలుకోవడం కష్టమే. వినాశనాన్ని కోరి తెచ్చుకుంటోంది ఆ పొరుగువలెనే ఈ పొరుగు దేశం …
ఇప్పటికే ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లను బహిష్కరించారు ! ఇక మిగిలింది ఎగుమతులను ఆపివేయడమే! యూపీలో అధునాతన టెక్ట్ టైల్ పార్క్ ను నిర్మిస్తున్నారు ఆదిత్యనాథ్ యోగీ. ఆపనులైతే శరవేగంగా జరుగుతున్నాయి.రెండు నెలల్లో పూర్తికానుంది. ఆర్డర్స్ తీసేసుకుంటున్నారు కూడా. బంగ్లాదేశ్ మొత్తం చేసే పనికి రెట్టింపుగా… రెడీమేడ్ దుస్తులు కుట్టగలిగే సామర్థ్యం, నైపుణ్యాలతో అది రెడీ అవుతోంది. చిత్రంగా మాకూ వాటా ఇవ్వమని అడుగుతున్నారు బంగ్లాదేశ్ టెక్స్ట్ టైల్ ట్రేడర్స్.
-పార్థసారధి పోట్లూరి