మొన్నటికి మొన్న లక్ష చెట్లు ఒకేరోజు నేలకూలినై…నిన్నదశాబ్దాల తరువాత దక్కన్ పీఠభూమిని ఆనుకుని ములుగు కేంద్రంగా భూకంపం..అసలు ఏజెన్సీ ప్రాంతం ములుగు జిల్లాలో ఏం జరుగుతోంది..? ఈ మధ్య కాలంలో ములుగు కేంద్రంగా జరుగుతున్న వింత సంఘటనలు, విపత్తులతో అక్కడి ప్రజలు భయాందోళనలో ఉంటే..ఇప్పుడు తెలంగాణ మొత్తం ములుగు గురించే మాట్లాడుతోంది.
ఆగస్టు 31 న అంటే మూడు నెలలక్రితమే…ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో లక్షలాది చెట్లు ఒకేసారి నేలకొరిగినై..ఆ ప్రాంతం లోతట్టులో ఉంటుంది. వర్షాకాలం అవడం వల్ల…నీరు ఇంకి నేలంతా నాని ఉన్న సమయంలో ఈదురుగాలు వీచి అన్నిచెట్లు ఒకేసారి పడిపోయాయని అక్కడి జియాజిస్టులు, నిఫుణులు చెప్పినమాట. ఇప్పుడు భూకంపం. దాదాపు జిల్లా వ్యాప్తంగా భూప్రకంపనలు…నదీ పరీవాహక ప్రాంతంలో ఇలాంటి స్వల్ప ప్రకంపనలు సహజమేనని ఇప్పుడు నిపుణులు చెప్పినమాట.మరి తెలంగాణలో గోదావరి పరీవాహక ప్రాంతం అంటే ఒక్క ములుగేనా..కాదుకదా..అసలు ములుగు కేంద్రంగా ఎందుకీ వరుస వైపరీత్యాలు..
అసలు ఈ విపత్తులకు కారణాలేంటి…
అంటే ప్రధానంగా నాలుగు కారణాలుచెప్పవచ్చు..
1.ఇసుక తవ్వకాలు..
ములుగు జిల్లాలో ఇసుక తవ్వకాలు భారీగా జరుగుతున్నై.. అక్రమ తవ్వకాలు అనవచ్చు.. పట్టాభూమిలో అనుమతి పేరులో అక్రమంగా నడివాగు, ఏటూరునాగారం శివారు దయ్యాలవాగులో అయితే వ్యాపారులు క్వారీ ఏర్పాటు చేసుకున్నారు. గ్రామరక్షణ కోసం ఏర్పాటు చేసిన కరకట్టను తవ్వి గుంతలు తీస్తున్నారని గ్రామస్థులు ఆందోళన చేసిన ఘటనలు మనం చూశాం. నిత్యం ములుగు నుంచి వందలాదిగా లారీల్లో ఇసుక తరలిపోతూ ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్తే రోడ్డుపక్కన ఇసుక డంప్ చేసి వెహికిల్సే ఉంటే… 5 నుంచి 10 కిలోమీటర్ల మేర బారులు తీరికనిపిస్తై…విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉంటే… డీఎస్ఎండీసీ, రెవెన్యూ అధికారులు అటువైపే చూడరు. మామూళ్ల మత్తులో చూసీ చూడనట్టుంటారనే ఆరోపణలు అనేకం. వాల్టా చట్టం ప్రకారం జిల్లాలో ఇసుక తవ్వకాలే కూడదు, కానీ అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపం కొన్నిచోట్ల, అవినీతి వల్ల మరికొన్నిచోట్ల తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నై. ముఖ్యంగా గోదావరీపరివాహక ప్రాంతాల్లో అత్యధికంగా అక్రమ కార్యకలాపాలు, ఇసుక నిల్వలస్థలాలనుగుర్తించారు. అయినాఎలాంటి చర్యలుఉండవు.
2.అడవుల నరికివేత
ములుగు కేంద్రంగా వరుస విలయాలకు మరో కారణం..అడవుల నరికివేత. విచ్చలవిడిగా ఇసుక తోడడంతో పాటు అక్రమార్కుల కన్ను ఎప్పుడూ అడవులమీదనే. ఏజెన్సీ ఏరియా ములుగు జిల్లాలో అటవీవిస్తీర్ణం ఎక్కువ. దీంతో అక్కడ ఇష్టారీతిన చెట్లు నరుకుతున్నారు. స్థానికులతో పాటు… చత్తీస్ గడ్ నుంచి వచ్చిన వేలాదిమందికి అడవుల నరికివేత ఆధారమైందని చెప్పవచ్చు. గోదావరీ పరివాహక ప్రాంతానికి చత్తీస్ గఢ్ నుంచి వచ్చి ఉంటున్నవారి సంఖ్య 50 వేల మంది అయితే కేవలం ములుగు జిల్లాలోనే 20 వేలమంది ఉన్నట్టు అంచనా. వారంతా పోడు సేద్యం పేరుతో పచ్చటి అడవుల్ని నరికేస్తున్నారు. రాష్ట్రస్థాయి, స్థానిక రాజకీయ నాయకుల అండతో వారు రెచ్చిపోతుంటే.. అటవీయంత్రాంగం ఏమీ చేయలేని పరిస్థితి. కేవలం ములుగు జిల్లాలోనేకాక… ఆదిలాబాద్, భూపాలపల్లి,ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఇదే పరిస్థితి.
ఇక కోల్ మైనింగ్…
3.కోల్ మైనింగ్
ములుగులో బొగ్గుగనులు లేకున్నా… సింగరేణి గనుల తవ్వకాలు జరిగే రామగుండం, భూపాలపల్లి, మణుగూరు మధ్యలో ములుగు ఉంటుంది. అంటే ములుగు నలువైపులా బొగ్గు తవ్వకాలు సాగుతూ ఉన్నై. ఆ ప్రభావం కూడా ములుగుపైపడుతోందని చెప్పవచ్చు. ములుగు జిల్లాలోనే ఉన్న రామప్పసమీపం వరకు నేలలో బొగ్గు తవ్వకాలు జరిగినై. ఇంకా ముందుకు సాగితే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప గుడికే ముప్పు అని అప్పట్లేనే జియాలజిస్టులు హెచ్చరించారు.
4.కాళేశ్వరం ప్రాజెక్ట్
ఇక ములుగులో వరుస విపత్తులకు కారణాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒకటి. విపత్తులకు అవకాశంగా,అనుకూలంగా ఉన్న ఆప్రాంతంలో భారీప్రాజెక్ట్ వద్దని కేంద్రం సైతం చెప్పినా నాటి సీఎం కేసీఆర్ వినకుండా అక్కడే నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్ట్ కారణంగా భూమిలో నీరు బాగా నిల్వనిలిచిపోయింది. దీంతో నేలలోని ఫలకాల కదలికలు తేలికైపోయి తాజాగా అక్కడ భూకంపం సంభవించిందని నిపుణులు చెబుతున్నారు. చట్టూ బొగ్గుబావులున్న ఆప్రాంతంలో భారీ ప్రాజెక్టు నిర్మాణం కూడా విలయాలకు కారణంగా చెప్పవచ్చు.
ఇలా చుట్టూ బోగ్గు గనులు,ఇష్టారీతిన అడవుల నరికివేత,విచ్చలవిడి ఇసుకతవ్వకాలే ములుగుజిల్లాలో ప్రకృతి విపత్తులకు కారణం. దీంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నడూ లేనిది భూకంపం రావడంతో వణికిపోతున్నారు. అడవుల నరికివేతను ఆపాలని..ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలనికోరుతున్నారు.