“భారత్ మాకు ప్రయోగశాల వంటిది. దేనిమీదైనా అక్కడే ప్రయోగాలు చేయగలం”
ఓ ఇంటర్య్యూలో బిల్ గేట్స్ చెప్పిన మాటఇది. అయితే ఈమాటకు ఆయన చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందనుకోండి. సరే! ఇంతకీ బిల్ గేట్స్ ఈ మాట యాదృచ్ఛికంగా అన్నాడా? లేక నిజంగా గతంలో అలా చేసి ఈ మాట అన్నాడా ఒకసారి చూద్దాం.
2009లో ఖమ్మం జిల్లాలో ఓ ఘటన జరిగింది.
స్త్రీలలో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ అనగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా ఒక వ్యాక్సిన్ క్లినికల్ ట్రైల్స్ కోసం ఖమ్మం జిల్లాలోని ట్రైబల్ ప్రాంతంలో గల 9 మరియు 15 సంవత్సరాల మధ్య వయసుగల ఆడపిల్లలపై హెచ్.పి.వి కి సంబంధించిన వ్యాక్సిన్ మూడు దఫాలుగా ఇచ్చారు ఆరోగ్యశాఖ అధికారులు.ప్రభుత్వఅనుమతి లేకుండా.. ఆ వ్యాక్సిన్ పేరు ‘గడ్డర్సిల్’. అది తయారు చేసిన కంపెనీ పేరు మెర్క్. ప్రభుత్వ ట్రైబల్ హాస్టల్స్ లో ఉంటున్న 16,000 మంది ఆడపిల్లలపై ఈ పరీక్షలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణలో కాకుండా గుజరాత్ లో కూడా ఇలాగే ప్రభుత్వ నడుపుతున్న ట్రైబల్ గర్ల్స్ హాస్టల్ లో 14,000 మంది ఆడపిల్లలపై GSK కంపెనీ తయారుచేసిన ‘సెర్వారిక్స్’ అనే వ్యాక్సిన్ ప్రయోగించారు. ఈ వ్యాక్సిన్ వేసిన కొన్ని నెలల తర్వాత ఆ పిల్లలకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి తెలంగాణలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా…గుజరాత్ వడోదరలో మరో ఇద్దరు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. మనదేశంలోనే కాకుండా కొలబియా ఉత్తర ప్రాంతంలో కూడా ఈ గడ్డర్సిల్ వ్యాక్సిన్ వల్ల అక్కడ ఆడపిల్లలు అనారోగ్యం బారినపడినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.
దీని మీద గొడవ చెలరేగడంతో కుటుంబ ఆరోగ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ … విచారణ చేపట్టి 2013లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ప్రకారం రూల్స్ కు వ్యతిరేకంగా చాలా కేసుల్లో హాస్టల్లో వార్డెన్ దగ్గరే పెర్మిషన్ తీసుకున్నారు అని, తల్లిదండ్రులకు దేని కోసమో చెప్పకుండా అనుమతి పత్రాలపై వారి చేత వేలిముద్రలు తీసుకున్నారని, ఆడపిల్లలకు దేనికోసం ఎందుకు ఆ మందు ఇస్తున్నారు కూడా చెప్పలేదని బయటపడింది.
ఏడుగురు గిరిజన పిల్లలు చనిపోవడం పట్ల సుప్రీంకోర్టు సీరియస్ అయి అసలు ఈ ప్రయోగాలు చేయటానికి ఎవరు అనుమతులు ఇచ్చారని డ్రగ్ కంట్రోలర్ డైరెక్టర్ జనరల్ ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ నిలదీసింది.
అసలు ఏడుగురు ఆడపిల్లలు చావులకి వ్యాక్సిన్ కి సంబంధం లేదని వారిలో కొందరు సూసైడ్ వల్ల కొందరు మలేరియా వల్ల లేక ఇతర కారణాల వల్ల చనిపోయినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడంపైనా స్టాండింగ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 2010లో ఒక NGO ట్రైబల్ ఏరియా లోని ఇటువంటి ఆడపిల్లలను పరిశీలించి వారిలో 120 మంది వరకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే మూర్ఛ రావడం, తొందరగా రజస్వల కావడం, విపరీతమైన బ్లీడింగ్ జరగడం వంటి లక్షణాలు వారిలో కనిపించాయి అని చెప్పింది.
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కనుక్కున్న దాని ప్రకారం:
*అమెరికాకు చెందిన పాత్(PATH) అనే ఎన్జీవో ఈ ప్రయోగాలు నిర్వహించినట్లు తెలిసింది.
- మైనర్ల మీద ఈ ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహించి డేటా కలెక్ట్ చేయడం, వాటి ఆధారంగా భారత్ సార్వజనీన టీకా ప్రోగ్రాం లో దీనిని కూడా చేర్చే అవకాశం ఉందేమో పరిశీలించడం.
- జూన్ 1, 2006లో USFDA గర్దాసీల్ వ్యాక్సిన్ పై ప్రయోగాలకు అనుమతించింది
- PATH అనే ఎన్జీవో 5 సంవత్సరాల ప్రణాళికల్లో భాగంగా పెరూ, ఉగాండా, వియత్నాం మరియు భారత్ లో కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు నిర్వహించారు.
- 16, నవంబర్ 2006లో ఈ PATH ఎన్జీవో కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) మధ్య ఈ ప్రయోగాలపై ఒక MOU కుదిరింది. దాని ప్రకారం ప్రయోగాలు నిర్వహించడం దాని డేటా ఆధారంగా భారతీయ వ్యాక్సిన్ ప్రోగ్రాంలో ఈ వ్యాక్సిన్ ని కూడా కలపడం. ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మరో విషయం కూడా కనుక్కుంది. అదేమిటంటే ఈ మొత్తం స్టడీకి PATH కి ఆర్థిక సహాయం చేసింది ‘బిల్ గేట్స్ ఫౌండేషన్.’
ఇటువంటి వివాదాస్పద ప్రయోగాలకు ఆర్థిక సాయం చేయడంపై బిల్ గేట్స్ విమర్శలు పాలయ్యారు. అంతేకాకుండా ఒకవైపు ప్రజల ఆరోగ్యం కోసం వ్యాక్సిన్లు కావాలి అంటూ అని వాటి గురించి ప్రజలపై ప్రయోగాలు చేస్తూ మరోవైపు ఆ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న కంపెనీలలో ఇదే బిల్ గేట్స్ వంటి వారు పెట్టుబడులు పెట్టడం అనైతికమని మండిపడ్డారు.
మనదేశంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ వ్యాక్సిన్ పై ప్రయోగాలకు మరో రెండు సంస్థలకు ఆర్థిక సహాయం అందించింది అందులో ఒకటి GAVI( గ్లోబల్ ఎలియన్స్ ఫర్ వాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్), రెండోది PHFI( పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా). ఈ PHFI సంస్థకి బిల్ గేట్స్ తో పాటు యూపీఏ ప్రభుత్వం కూడా నిధులు సమకూర్చింది.అయితే ఈ రెండు సంస్థలకి కూడా ఫార్మా కంపెనీలతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకని ” మాకు ఒక ప్రయోగశాల వంటిది” అని బిల్ గేట్స్ ఈ మధ్య ఊరికే అనలేదన్నమాట.ఇదే పని అదానీ వంటి మరే పారిశ్రామికవేత్త చేసి ఉంటే కాంగ్రెస్, లెఫ్ట్ లిబరల్స్ కలిసి ఎంత హంగామా చేసేవో కదా.
-చాడా శాస్త్రి