మనదేశంవాడే.బాగా పలుకుబడి ఉన్నవాడు. కానీ మనకు అంతగా తెలియనివాడు. ఈమధ్య ఆయన గురించిన సమాచారం బయటకొచ్చింది. అతనే విజయ్ మహాజన్. రాహుల్ గాంధీ ముఖ్య సలహాదారుల్లో ఒకడు. గాంధీ కుటుంబానికి చెందిన ‘రాజీవ్ గాంధీ ఫౌండేషన్’ అనే NGO యొక్క CEO.
2024లో రాహుల్ ను ఈ దేశ ప్రధానిని చేసే లక్ష్యంతో ఆ ఎన్నికలకు ఆయనను సిద్ధం చేయడానికి, ఆయనకు ప్రచారం కల్పించడానికి ఉద్దేశించి మొదలుపెట్టిన “భారత్ జోడో యాత్ర” సూత్రధారి ఈ విజయ్ మహాజన్. యోగేంద్ర యాదవ్ ఈయనకు కుడిభుజం. ఈ భారత్ జోడో అభియాన్ యాత్ర జనరల్ సెక్రటరీ నదీమ్ ఖాన్.ఈ నదీమ్ ఖాన్ పౌర హక్కుల సంఘాల జాతీయ అధ్యక్షుడు, ఇస్లామిస్ట్, కమ్యూనిస్ట్ ఎకో సిస్టమ్స్ తో ఆ చాలా సన్నిహితంగా పనిచేస్తాడు.
మీకు అనుమానం ఉంటే, బంగ్లాదేశ్‌లో యూనస్ పాలన మారిన తర్వాత భారత్ జోడో అభియాన్ జనరల్ సెక్రటరీ నదీమ్ ఖాన్ పోస్ట్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ చదవండి. దాన్లో ‘బంగ్లాదేశ్ లో అవామీ పని అయిపోయింది. దొంగదారుల్లో ఎన్నికల్లో గెలిచే వారికి ఇలాగే అవుతుంది. ఇక్కడ కూడా తొందరలో అదే జరుగుతుంది’ ఆ పోస్ట్ సారాంశం.
ఇక్కడో విచిత్రం చూడండి. బిజెపి ప్రతిపక్షం లో ఉన్నా లేదా అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి పౌర హక్కులు, నక్సల్స్, వామపక్ష భావజాల సంస్థలు, వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోదు. అయితే, కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఈ పౌర హక్కుల నేతల మీద, నక్సల్స్ మీద కేసులు పెట్టి జైళ్లలో పెడుతుంది కానీ … ప్రతిపక్షంలోకి రాగానే…వాళ్లు, వీళ్లు కూడా పాత పగలు మరిచిపోయి సిగ్గుఎగ్గు వదిలి ఒకరికొకరు మద్దతుగా ఉంటారు. అలాగే ఖాన్ రాహుల్ కోసం పనిచేశాడన్నమాట.
ఇప్పుడు, విజయ్ మహాజన్ మరో లింక్ చూడండి. ఇతను కూడా బంగ్లాదేశ్ మొహమోద్ యునుస్ లాగే ఫౌండేషన్ ఉత్పత్తి. గతంలో ఈ యునుస్ బంగ్లాదేశ్ లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్నప్పుడు ఫోర్డ్ ఫౌండేషన్ మాజీ ట్రస్టీ, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తి మద్దతుగా లేఖ రాసాడు.
ఈ విజయ్ మహాజన్ కి ఇన్ఫోసిస్ కి ఇంకో లింక్ చూడండి. ఈ విజయ్ మోహన్, ఇన్ఫోసిస్ మొదటి చైర్మన్ అయిన డాక్టర్ జి.కె. జయరామ్ కలసి ఏప్రిల్ 2010లో కాంగ్రెస్ లో నాయకత్వం అభివృద్ధి చేయడం కోసం అని జవహర్‌లాల్ నెహ్రూ లీడర్‌షిప్ ఇన్‌స్టిట్యూట్ (JNLI) అనే శిక్షణా సంస్థను ప్రారంభించారు.
IPSMF అంటే INDEPENDENT AND PUBLIC-SPIRITED MEDIA FOUNDATION దీనికి నిధులు ఇన్ఫోసిస్, విప్రో, బయోకాన్, అమీర్ ఖాన్ ఇలా చాలా మంది ఇస్తున్నారు. ఈ IPSMF ఫాక్ట్ చెకర్ జు బైర్ నుంచి అర్ఫా షేర్వాణి వరకు, ది వైర్, ది కారవాన్ నుంచి ఆర్టికల్ 14 అనే వామపక్ష బిజెపి వ్యతిరేక న్యూస్ వెబ్ పోర్టల్స్ అన్నిటికీ నిధులు సమకూరుస్తుంది.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, IPSMF వ్యవస్థాపక ట్రస్టీస్ లో ఒకరైన రుక్మిణి బెనర్జీ…పైన చెప్పుకున్న విజయ్ మహాజన్ కి చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ నిధులతో ప్రారంభం ఆయిన ‘ప్రదాన్’ అనే NGO కి కూడా వైస్ చైర్‌పర్సన్ ! ఫోర్డ్ ఫౌండేషన్ అధికారి దీప్ జోషి, మరొక సహ వ్యవస్థాపకుడు అయిన విజయ్ మహాజన్‌తో కలిసి ఈ శిక్షణా NGO, PRADANను స్థాపించారు. ఫోర్డ్ ఫౌండేషన్, ఇతర అమెరికన్ కంపెనీలు వారి NGOల ద్వారా నిరంతరం దీనికి నిధులు కోట్లలో అందజేస్తున్నాయి.
ఈ విజయ్ మహాజన్ BASIX అనే మరో కంపెనీని స్థాపించారు, ఇది కేవలం ఫోర్డ్ ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చడమే కాకుండా దానితో భాగస్వామిగా ఉంది.
విజయ్ మహాజన్, యోగేంద్ర యాదవ్ అత్యంత సన్నిహితులు. తమ NGOల ద్వారా రైతుల కోసం పని చేస్తున్నాం అని చెప్పుకుంటారు. 2024 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే అజెండాగా ప్రారంభమైన రైతు నిరసనల ప్రణాళిక వెనుక ప్రధానంగాఉన్నది ఈ ఇద్దరే.
భారతీయ రైతులకు అన్యాయం చేసే జన్యుపరంగా మార్చిన విత్తనాలను, పురుగు మందులను మాంశాంటో , బేయర్ వంటి సంస్థలు అమ్ముతున్నాయని విజయ్ మహాజన్ లాంటి వ్యక్తులు రైతులను ఉసిగొల్పుతారు, కానీ మరోవైపున వీరే బేయర్ వంటి విదేశీ వ్యవసాయ రసాయన కంపెనీల కోసం పనిచేస్తున్న సంగతి రైతుల దగ్గర దాచిపెడతారు. అగ్రి కెమికల్, సీడ్స్ దిగ్గజం మోన్‌శాంటో కూడా విజయ్ మహాజన్ స్వచ్ఛంద సంస్థకు నిధులు సమకూరుస్తుందని రైతులకు తెలీదుపాపం. అంటే మా NGO లకు నిధులు ఇవ్వకపోతే రైతులను రెచ్చగొడతాం అని ఆ కంపెనీలను బ్లాక్ మెయిల్ చేస్తూ తమ NGO లకు నిధులు పొందుతున్నారేమో.. అంతే అయిఉంటుంది కచ్చితంగా.
ఫోర్డ్ ఫౌండేషన్ అనేది CIA యొక్క పరోక్ష విభాగం. వివిధ దేశాల్లో అమెరికా వారి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. తమ వైపు లేని ప్రభుత్వాలను ఆ దేశ నాయకులను, రాజకీయ పార్టీలపై నిఘా పెట్టి వారి/వాటి రకరకాల వ్యతిరేకంగా సమాచారాలు లీక్ చేయడం ఆ ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ఇబ్బందులు సృష్టించడం ఈ CIA ప్రణాళికల్లో ఒక ముఖ్యమైన ప్రణాళిక.
CIA యొక్క లీకైన అత్యంత రహస్య పత్రం ఒకటి బయటకు వచ్చింది. దాని ప్రకారం 2010 నుంచి బీజేపీ …అమెరికా రహస్య సంస్థ CIA నిఘాలో ఉంది. కాంగ్రెస్ పార్టీ లేదా మరే ఇతర రాజకీయ పార్టీల మీద ఈ నిఘా ఎందుకు పెట్టలేదు? ఫోర్డ్ ఫౌండేషన్ తో సంబంధం ఉన్న వారిని ఉపేక్షిస్తారేమో?
మీకు తెలుసా? ఎటువంటి ప్రభుత్వ అనుమతులు కూడా పొందకుండానే కేవలం నెహ్రూ ఆహ్వానం మేరకు ఈ ఫోర్డ్ ఫౌండేషన్ నెహ్రు కాలం నుండి దశాబ్దాలు గా మన దేశంలో తనకు నచ్చిన విధంగా కార్యకలాపాలు నిర్వహించుకుంటూ వస్తోంది. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో మోడీ కి వ్యతిరేకంగా పని చేయడానికి ఏర్పడిన తీస్తా తీసెల్వాద్ వంటి వారు ఏర్పాటు చేసిన NGO లకు ఈ ఫోర్డ్ ఫౌండేషన్ నిధులు సమకూర్చింది.
ఇలా ఎటువంటి అనుమతులు లేకుండానే దేశంలో ఫోర్డ్ ఫౌండేషన్ పని చేస్తోంది అని 2014 లో మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత మాత్రమే ఈ సంగతి బయట పడింది. దాంతో ఇక్కడ పనిచేయకుండా బాన్ విధిస్తారేమో అనే భయంతో మోడీ ప్రభుత్వం తో చర్చలు జరిపి ఇక్కడ భారతీయ చట్టాలు ప్రకారం తీసుకోవాల్సిన అన్ని అనుమతులు తీసుకుంది.
మీరు మొత్తం ఈ సమాచారాన్ని పరిశీలిస్తే లింకులు చూడండి.
- విజయ్ మహాజన్ కి CIA-అనుబంధ ఫోర్డ్ ఫౌండేషన్ కి లింక్
- ఇదే విజయ్ మహాజన్ గాంధీ కుటుంబ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ముఖ్య అధికారిగా ఉన్న లింక్3. ఇదే రాజీవ్ మహాజన్ కి చెందిన NGO ఫోర్డ్ ఫౌండేషన్ మాజీ ట్రస్ట్ నారాయణ మూర్తి కి చెందిన ఇన్ఫోసిస్ తో కలసి కాంగ్రెస్ నాయకుల కోసం శిక్షణా కేంద్రాన్ని నిర్వహించడం…
- ఇదే మహాజన్ రైతు ఉద్యమం వెనకాల, భారత్ జోడో యాత్ర వెనకాల ఉండడం
- ఇదే ఫోర్డ్ ఫౌండేషన్ మోడీకి వ్యతిరేకంగా పని చేస్తున్న NGO లకు మీడియా సంస్థలకు నిధులు సమకూర్చడం.
ఇదంతా ఏదో దీర్ఘకాలిక ప్రణాళిక కోసం ఏర్పడిన సాలెగూడులా అనిపించడం లేదూ?
-చాడాశాస్త్రి