మేక్ ఇన్ ఇండియా నినాదంతో, ఆత్మనిర్భర భారత్ లక్ష్యంతో దేశం పరుగుపెడుతోంది. అందులో భాగంగా యుద్ధ ట్యాంకుల తయారీలో దూసుకెళ్తోంది తెలంగాణలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. తాజాగా రక్షణరంగం కోసం ఇక్కడ తయారైన యుద్ధ ట్యాంకుల ట్రయల్ రన్ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో బీఎంపీ, బీఎంపీ 2 కె యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ జరిగింది.
ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఏటా 120 యుద్ధట్యాంకులు తయారవుతున్నాయి. రష్యాసాంకేతికతో వీటిని తయారుచేస్తున్నారు. ఇప్పటివరకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ …3వేలకు పైగాయుద్ధ ట్యాంకులను ఆర్మీకి అందించింది. ఓడీఎఫ్‌లో సిద్ధమైన తరువాత వాటిని 15నుంచి 20 సార్లు పరీక్షించి…ఫైనల్ ట్రయల్ రన్ తో ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ధారించుకుని తరువాత భారత మిలిటరీకి పంపిస్తారు. ఒక్కోవాహనం బరువు దాదాపు 14 టన్నులు ఉంటుంది. రోడ్డుమీద 65 కిలోమీటర్ల వేగంతో…నీటిలో 8 కిలోమీటర్ల వేగంతో నౌకలాగా వెళ్తాయి.ఒక్కో ట్యాంకర్ తయారీకి 8నుంచి 10 కోట్ల వరకు ఖర్చవుతుంది. యుద్ధ సమయంలో సైనికులను, ఆయుధాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు వీటిని వినియోగిస్తారు. రష్యా సాంకేతికతో వీటిని తయారుచేస్తున్నారు. భారత ఆర్మీకి అందించడమే కాక ఇతర దేశాలకూ వీటిని ఎగుమతిచేస్తున్నారు. 14.5 టన్నుల బరువున్న ఈ యుద్ధ ట్యాంక్ పైదాదాపు 10మంది ప్రయాణం చేయవచ్చు. మల్కాపూర్ పెద్ద చెరువులో నిర్వహించిన యుద్ధట్యాంకుల ట్రయల్ రన్ చూసేందుకు పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు.