• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Friday, March 6, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home అంతర్జాతీయం

బాల్కనైజేషన్ ఆఫ్ మియన్మార్ -2

Devika by Devika
December 27, 2024
in అంతర్జాతీయం, జాతీయం, రాజకీయాలు
0
బాల్కనైజేషన్ ఆఫ్ మియన్మార్ -2
0
SHARES
3
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

1948 లో బ్రిటీష్ నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి మియాన్మార్ ( బర్మా ) లో ప్రశాంతత అనేదే లేదు! మియాన్మార్ లో వివిధ జాతుల మధ్య ఎప్పుడూ ఎక్కడో ఒక చోట అంతర్గత ఘర్షణలు జరుగుతూనే ఉంటున్నై. జాతుల మధ్య ఘర్షణ సద్దుమణిగితే …అక్కడి మిలిటరీ ప్రభుత్వం తో ఏదో ఒక వర్గం ఘర్షణ పడుతూ వస్తున్నది!స్వాతంత్య్రం వచ్చాక అంటే 1948 నుండి 1962 వరకూ పౌర ప్రభుత్వం ఉంది.1964లో మిలిటరీ కుట్ర చేసి ప్రజా ప్రభుత్వాన్ని దించేసి సైనిక పాలన మొదలుపెట్టింది!

1962 లో సైనిక కుట్ర జరిగింది ఆంగ్ శాన్ ( Aung San ) మీద. ఆంగ్ సాన్ ఎవరో కాదు… సుదీర్ఘ కాలం బర్మా లో ప్రజాస్వామ్యం కోసం నిరాహార దీక్ష చేసి నోబుల్ శాంతి బహుమతి పొందిన మహిళ ఆంగ్ సాన్ సూక్యి తండ్రి!1962 వరకూ బర్మా లో పరిస్థితులు మరీ ఘోరంగా లేకపోయినా ప్రశాంతంగా ఉండేవి. బర్మా నుండి టేకు కలప భారత్ లోకి దిగుమతి అయ్యేది. బర్మా టేకు కలప వ్యాపారం తో లక్షాధికారులు అయిన భారతీయులు ఉన్నారు.1962 లో సైనిక కుట్ర చేసి ప్రజా ప్రభుత్వాన్ని దించేసి మిలిటరీ పాలన వచ్చాక భారతీయుల మీద దాడులు జరిగాయి.దాంతో అప్పటి వరకూ రంగూన్ ( ఇప్పుడు యాంగూన్ ) లో ఉన్న భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు!

రోహింగ్యాల మీద దాడులు మొదలయ్యింది కూడా 1962 లోనే. రోహింగ్యాలు 1962 లో భారత్ లో ఆశ్రయం పొందారు వెస్ట్ బెంగాల్, తమిళనాడు లో.శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాలకి మద్రాస్ హార్బర్ దగ్గర షాపులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం.మద్రాస్ పారీస్ సెంటర్ కి దగ్గరలో ఉన్న ‘ బర్మా బజార్ ‘ బర్మా కాందిశీకులు ఏర్పాటు చేసుకున్నదే!1970 నుండి 1995 వరకూ స్మగుల్డ్ వస్తువులకి కేర్ ఆఫ్ అడ్రస్ బర్మా బజార్. కెమెరాలు, టీవీ లు, VCR లతో పాటు అన్ని స్మగుల్డ్ వస్తువులు అమ్మేవారు. వాళ్లకి లైసెన్స్ ఇచ్చింది విదేశీ వస్తువులు అమ్మడానికి కాదు, కానీ 25 ఏళ్ళ పాటు యదేచ్చగా వ్యాపారం చేసుకోగాలిగారు!

1962 లో సైనిక కుట్ర జరిగి ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలన మొదలవడంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బర్మా (CPB ), కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ (KIA ) లాంటి తిరుగుబాటు గ్రూపులు సైన్యం తో ఘర్షణ కి దిగాయి. మిలిటరీ కఠినంగా అణిచివేసింది. కానీ బర్మాలో లోని వివిధ వర్గాలలో మిలిటరీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అలానే ఉండిపోయింది.అభివృద్ధి లేక.. నిరుద్యోగం పెరగి ఎక్కడికక్కడ ప్రాంతీయ, జాతుల మధ్య ఘర్షణలు జరగడం, ఎవరికి వారు తమ ప్రాంతానికి, జాతికి స్వయం ప్రతిపత్తి కావాలంటూ ఉద్యమాలు మొదలుపెట్టి సైనిక ప్రభుత్వo మీద తిరుగుబాటు మొదలుపెట్టారు.

ఇక మిలిటరీ ప్రభుత్వాన్ని నడిపేది బర్మన్ (బమర్ ) జాతి!
మియాన్మార్ లో బమర్ తో పాటు ఇంకా అనేక జాతున్నాయ్..

A.బర్మన్ (బమర్ ) జాతి జనాభా 68%
B.షాన్ (Shan ) జాతి జనాభా 9%
C. కరేన్ (Karen ) జాతి జనాభా 7%
D.రఖైన్ (Rakhain ) జాతి 4%
E.చైనీయులు 3%
F. భారతీయులు 2%
G. మాంగోలియన్లు 2%
H. ఇతరులు 5%

ఇక మతాల వారీగా అయితే బౌద్ధులు 88%, క్రైస్తవులు 6%, ముస్లిమ్స్ 4%, అనిమిస్ట్ 0.08%, హిందువులు 0.05%, ఇతరులు 0.02% గా ఉన్నారు.జాతుల మధ్య పోరాటానికి కారణంశ తాము మెజారిటీ గా ఉన్న ప్రాంతాలకి ఆటానమస్ (స్వయం ప్రతిపత్తి ) కావాలి అనే డిమాండ్, తమ జాతులకి సైన్యం లో ఉద్యోగాలు ఇవ్వాలని మరో డిమాండ్! బర్మా లో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆర్మీ నే! ఇతర ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు పెద్దగా ఉండవు. ఒక వేళ ఉన్నా అవి బర్మన్ జాతి (బమర్ ) ప్రజలకే సింహ భాగం దక్కుతాయి. అంతెందుకు అక్కడి మిలిటరీ (ఝాంటా ) ప్రభుత్వాన్ని బమర్ ప్రభుత్వం అనే పిలుస్తారు!

నిరుద్యోగం, అవినీతి, ద్రవ్యోల్బణం అనేవి బర్మా ని పట్టి పీడిస్తున్నాయి గత అయిదు దశబ్దాలుగా.

సైనిక నియంత ప్రభుత్వం ఉన్న అన్ని దేశాలలో అవినీతి ఎక్కువగా ఉండడం సహజం!

ఇక బర్మా కి ఒకప్పుడు సోవియట్ యూనియన్ తరువాత ఇప్పుడు రష్యా అండగా నిలిచింది! మరో వైపు చైనా కూడ అక్కడి సైనిక ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ వస్తున్నది. So! భారత ప్రభుత్వ పరపతి పెద్దగా ఉండదు. బోడోలాండ్ ఉగ్రవాదులు బర్మా లో దాక్కున్నప్పుడు అజిత్ దోవల్ గారు ఫార్మల్ గా విషయం తెలిపి భారత బలగాలని బర్మా లోకి పంపించి ఏరివేసిన ఘటనలు ఉన్నాయి గతంలో. అంతే కాని బర్మా అనుమతి కోసం వేచి చూడలేదు. ఇంత వరకే భారత్ పరపతి!ప్రస్తుత బర్మా పరిస్థితికి అంకురార్పణ జరిగింది 1962 లోనే అయినా 2021 లో సైనిక ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం అనేది తాడో పేడో తేల్చుకునే స్థితికి వచ్చింది!

2021 లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూక్యి ని అవినీతి ఆరోపణలతో పదవి నుండి దించి సైన్యం మళ్ళీ అధికారం చేపట్టినప్పటి నుండి అప్పటి దాకా ఏ గ్రూపు కి ఆ గ్రూపు విడివిడిగా చేస్తున్న పోరాటన్ని ఆపివేసి అన్నీ గ్రూపులు కలిసి సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించాయి.రెబెల్ గ్రూపులకి బర్మా ప్రజల నుండి గతంలో ఎప్పుడూ లేనంతగా మద్దతు వచ్చింది. ఉపాధ్యాయ వర్గం, ప్రభుత్వ ఉద్యోగ వర్గం, సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వర్గం, పోలీసు వ్యవస్థ కూడా తిరుగుబాటు లో పాల్గొన్నది!
ఆ స్థాయిలో తిరుగుబాటు వస్తుందని మిలిటరీ నాయకత్వం ఊహించలేదు.
గతేడాది చివరి నాటికి బర్మా లోని చాలా ప్రాంతాలు రెబెల్స్ చేతిలోకి వెళ్లిపోయాయి!

ఒక దశలో రెబెల్స్ ధాటికి తట్టుకోలేక బర్మా సైనికులు సరిహద్దు దాటి భారత్ లోని ఈశాన్య రాష్ట్రలలోకి పారిపోయారు! అక్కడ సైన్యానికి చేతకాక కాదు. బ్యారక్స్ కి పరిమితం అవ్వాల్సిన సైన్యం స్వంత ప్రజలని చంపడానికి మనసురాక పూర్తిగా పనిచేయట్లేదు! బర్మా సైన్యం యుద్ధం చేస్తున్నది పరిసరాల మీద పూర్తిగా అవగాహన ఉన్న స్థానిక ప్రజల మీద! గెరిల్లా తరహా దాడులు చేసి పరిసర ప్రాంతాలలో కలిసిపోతున్నారు రెబెల్స్. స్థానికుల సహాయ సహకారం వాళ్లకి ఉన్నది. సైన్యం అంటే వ్యతిరేక భావం ఉన్నది!


బర్మా లో తిరుగుబాటు దళాలు అన్నీ కలిసి పోయి ఒకే ఛత్రం కిందకి వచ్చి సైన్యం మీద దాడులు చేస్తూ వస్తున్నాయి.
ఎత్నిక్ ఆర్మర్డ్ ఆర్గనైజషన్స్ ( Ethnic Armed Organisations – EAOs గా వ్యవహారిస్తున్నారు అన్నిటిని కలిపి.
ఆ గ్రూప్స్ వివరాలు చూస్తే…

1.పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ – People’s Defence Forces- PDF
2.అర్కాన్ ఆర్మీ – ARAKAN ARMY
3.ది మియాన్మార్ నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్ ఆర్మీ – The Myanmar Democratic Alliance Army
4.తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ – Taa’ng National Liberation Army.
5.కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ – Kachin Independence Army.

ఇవి ప్రధాన తిరుగుబాటు గ్రూపులు కాగా కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ గత జులై నాటికే బర్మా కి ఆనుకుని ఉన్న రాష్ట్రం లో ఉన్న అన్ని మిలిటరీ చెక్ పోస్ట్ లని తన అదీనంలోకి తీసుకుంది.చైనా తూర్పు ఆసియా దేశాలతో జరిపే అన్ని రకాల వర్తక, వాణిజ్యలు కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ చెక్ పోస్టుల ద్వారా జరుగుతున్నాయి గత ఆరునెలలుగా.


అన్ని తిరుగుబాటు గ్రూపులలో అరకాన్ ఆర్మీ ప్రత్యేకం!Dominance of the Arakan Army!అరకాన్ ఆర్మీ బర్మా లోని రఖైన్ ప్రావిన్స్ కి చెందిన బౌద్ధ సన్యాసుల సైన్యం!ఈ రఖైన్ ప్రావిన్స్ లోనే రోహింగ్య ముస్లిమ్స్ అధిక సంఖ్య లో ఉన్నారు!

అరకాన్ ఆర్మీ కి పొలిటికల్ వింగ్ ఒకటి ఉంది, అది యునైటెడ్ లీగ్ అఫ్ అరకాన్ ( ULA ). బర్మా లో అత్యంత ప్రభావం కలిగిన గ్రూపు ఏదైనా ఉంది అంటే అరకాన్ ఆర్మీ మరియు ULA.
చాలా మంది అరకాన్ ఆర్మీ ని రోహింగ్యా లది అనుకుంటున్నారు. అరకాన్ ఆర్మీ – భౌద్ధ సన్యాసులది. అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ – Arakan Rohingya Salvation Army – ARSA అనేది రోహింగ్యా ముస్లిమ్స్ ది.

2017 లో రోహింగ్యా లు బౌద్ధ సన్యాసులని తక్కువ అంచనా వేసి ఒంటరిగా ఉన్న సన్యాసులని చంపి పూడ్చిపెట్టడం మొదలుపెట్టారు.
క్రమంగా ఒక్కక్కరు మాయం అవడం మీద బౌద్ధులు నిఘా పెట్టడంతో అసలు విషయం బయటపడ్డది.దాంతో బౌద్ధులు రోహింగ్యాల మీద విరుచుకు పడ్డారు. సైన్యం కూడా ఒక చేయి వేయడం తో దిక్కుతోచని రోహింగ్యాలు బాంగ్లాదేశ్, థాయిలాండ్, మలేషియాలకి పారిపోయారు!

ప్రస్తుతం బాంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ ( Cox’s Bazar district )లో పునరావాస శిబిరాలలో 10 లక్షల మంది రోహింగ్యా లు ఉన్నారు.ప్రపంచంలోని ఏ దేశం కూడా రోహింగ్యా లని శరణార్థులుగా స్వీకరించడానికి సిద్ధంగా లేవు!

అరకాన్ ఆర్మీ, దాని పొలిటికల్ వింగ్ అయిన యునైటెడ్ లీగ్ ఆఫ్ అరకాన్ తో పాటు బర్మా మిలిటరీ లు ఐక్యరాజ్య సమితి ని కానీ, అమెరికా ని కానీ లెక్కచేయకుండా రోహింగ్యా లని రఖైన్ ప్రావిన్స్ నుండి తరిమివేసాయి!బర్మా లోని రఖైన్ ప్రావిన్స్ లో ఉన్న రోహింగ్యా లని 1962 లో మిలిటరీ అధికారంలోకి వచ్చాక బర్మా పౌరులుగా గుర్తించం అని తెగేసి చెప్పింది.

బర్మా ప్రజల దృష్టిలో రోహింగ్యా లు బెంగాల్ నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్లకి పౌరసత్వం ఇవ్వకూడదు! ఓటు హక్కు లేదు. ఒక దశలో ఒక్కో రోహింగ్యా రెండు పెళ్లిళ్లు కంటే ఎక్కువ చేసుకోకూడదు అనే నిబంధన విధించారు. ఎవరైనా వాళ్ళు ఉంటున్న గ్రామం విడిచి పక్కన ఉన్న గ్రామానికో లేదా పట్టణానికో వెళ్ళాలి అంటే స్థానిక మిలిటరీ చెక్ పోస్ట్ నుండి అనుమతి తీసుకోవాలి! రోహింగ్యా లకి రఖైన్ ప్రావిన్స్ లో ఉండడానికి మాత్రమే అనుమతి ఇస్తూ తెల్ల కార్డు (white card ) ఇస్తుంది మిలిటరీ! ఇప్పటికి రోహింగ్యా లకి వాళ్ళు ఫలాన దేశ పౌరులు అనే గుర్తింపు కార్డు అంటూ ఏమీ లేదు.

దీనంతటికి కారణం రోహింగ్యా లు ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లల్ని కనడం వలన రఖైన్ ప్రావిన్స్ లో వీళ్ళ జనాభా పెరిగిపోయి మెజారిటీ బౌద్దులు కాస్త మైనారిటి లోకి వెళ్లిపోవడమే!బౌద్ధ ఆరామాలు, బౌద్ధ మత ఆచారాలు మాకు ఇష్టం లేదు అంటూ బౌద్దులతో ఘర్షణకి దిగడం అనేది వాళ్ళని దేశం వదిలి వెళ్లేలా చేసింది!బర్మా లో పేదరిక శాతం 37% అయితే రఖైన్ ప్రావిన్స్ లో అది 67% గా ఉంది. అంటే దేశ యావరేజ్ శాతం కంటే రెండిoతలుగా ఉంది రఖైన్ ప్రావిన్స్ లో. బర్మా లో అత్యంత పేదరికం లో ఉన్న ప్రావిన్స్ రఖైన్! రోహింగ్యా జనాభా ఎక్కువగా ఉండడమే రఖైన్ పేదరికంలో ఉండడానికి ప్రధాన కారణం అని అరకాన్ ఆర్మీ నమ్ముతోంది.

Tags: arakan armyarakan violencebangladesh borderbangladesh myanmar borderlatest newslive newsmaungdawmaungdaw siegemyanmar juntamyanmar rebelsmyanmar rohingyarakhinerakhine staterohingya

Related Posts

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..
అంతర్జాతీయం

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

January 17, 2025
పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?
అంతర్జాతీయం

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

January 31, 2025
బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ
జాతీయం

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

January 6, 2025
భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం
జాతీయం

సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం

January 4, 2025
180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
జాతీయం

180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..

January 4, 2025
Next Post
పాకిస్తాన్ ముక్కలు కాబోతోందా?  | Devika Journalist

పాకిస్తాన్ ముక్కలు కాబోతోందా? | Devika Journalist

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

రాయబరేలీ సంగతేంది మరి…| Devika Journalist

రాయబరేలీ సంగతేంది మరి…| Devika Journalist

August 13, 2025
భగవత్ చెప్పేదేంటి? వీళ్ల బుర్రలకెక్కిందేంటి? | RSS | Mohan Bhagwat | 3 Children | Devika Journalist

భగవత్ చెప్పేదేంటి? వీళ్ల బుర్రలకెక్కిందేంటి? | RSS | Mohan Bhagwat | 3 Children | Devika Journalist

December 3, 2024
వీళ్లకు అల్లుళ్లు వాళ్లు-దొరికిపోతున్నరు, దొంగలు బయటపడ్తున్నరు|| Devika Journalist ||

వీళ్లకు అల్లుళ్లు వాళ్లు-దొరికిపోతున్నరు, దొంగలు బయటపడ్తున్నరు|| Devika Journalist ||

July 27, 2025
బుద్ధుందా సిద్ధరామయ్యా | | Devika Journalist | |

బుద్ధుందా సిద్ధరామయ్యా | | Devika Journalist | |

October 16, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • ఎంత కమీనే గాడు ! || Devika Journalist ||
  • జాతీయవాదులతో మావోయిస్టులు కలిసి పనిచేయాలి | | Devika Journalist | |
  • పిచ్చివేషాల మధ్య సిద్ధాంతం ముసుగేసుకుంది || Devika Journalist ||
  • ది కేరళ స్టోరీ-2 వచ్చేస్తోంది || Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.