బాల్కనైజేషన్ అఫ్ సిరియా, బాల్కనైజేషన్ అఫ్ టర్కీ, బాల్కనైజేషన్ అఫ్ సోవియట్ యూనియన్ , బాల్కనైజేషన్ అఫ్ ఇండియా, బాల్కనైజేషన్ బర్మా, బాల్కనైజేషన్ అఫ్ చైనా, బాల్కనైజేషన్ అఫ్ పాకిస్తాన్.
“భారత్ తేరే తుకడే తుకడే కరెంగే.. భారత్ ని ముక్కలు ముక్కలు చేస్తాం”. ఇదేమి కోపంతోనో, చేతకాని తనంతోనో చేస్తున్న నినాదాలు కావు. దీని వెనుక పెద్ద అజెండా ఉంది. అది ఇప్పటికిప్పుడు అమలు కాకపోవచ్చు! కానీ ముందుస్తుగా ఒక నినాదాన్ని వెలుగులోకి తెస్తారు! అవకాశన్ని బట్టి ఒక పదేళ్లకో లేదా 20 ఏళ్ళకో అది కాకపొతే 30 ఏళ్ళకో అమలవుతుంది!
ముందు బాల్కనైజేషన్ అంటే ఏంటో తెలిస్తే ఆయాదేశాల్లో బాల్కనైజేషన్ ఎలా అమలవుతున్నది అర్థం అవుతుంది. బాల్కన్ దేశంగా పిలిచే యుగోస్లేవియా ఒకప్పుడు ఓట్టోమాన్ సామ్రాజ్యం లో భాగంగా ఉండేది. బాల్కన్ అనేది ఫార్శి పదం అయిన బాల్కనే నుండి వచ్చింది. కానీ తుర్కి (Turkish ) పదంగా చెలామణిలో ఉంది . బాల్కన్ అంటే ఎత్తయిన పర్వతం అని అర్ధం. బాల్కన్ పర్వతాలు చుట్టూ ఉన్న ప్రాంతాలని బాల్కన్ రీజియన్ అని పిలిచేవారు. యుగొస్లోవియా ని బాల్కన్ దేశం అని పిలిచేవారు.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఓట్టొమాన్ సామ్రాజ్య పతనం తరువాత యుగోస్లావియ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. రెండవ ప్రపంచ యుద్ధం సందర్బంగా యుగోస్లావియా జర్మన్ల అధీనంలోకి వెళ్ళిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జోసిప్ బ్రోజ్ టిటో తన సైన్యంతో జెర్మన్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కున్నాడు యూరోపులో! రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1945 నుండి 1963 వరకూ యుగొస్లోవియా ప్రధాన మంత్రిగా పని చేశాడు. 1963 నుండి 1980 వరకూ అంటే టిటో చనిపోయేవరకు అధ్యక్షుడిగా పనిచేశాడు!
యుగోస్లావియా మన దేశం లాగానే భిన్నమైన జాతులు, భాషలు, సంస్కృతులతో కూడి ఉండేది. జోసిప్ బ్రోజ్ టిటో తన జాతీయ వాదంతో దేశ ప్రజలందరిని ఒక్క తాటిపై పాలించాడు. 1980 లో టిటో మరణించిన తరువాత యుగొస్లోవయ దేశం ముక్కలు చెక్కలయింది! టిటో ఉన్నంత వరకూ అందరూ కలిసిమెలసి ఉన్న వాళ్ళు కాస్తా టిటో లాంటి జాతీయవాద నాయకుడు ఎవరూ లేకపోవడం వలన జాతుల మధ్య వైరం ప్రబలి దేశం ముక్కలయ్యింది! ప్రస్తుతం బాల్కన్ కంట్రీస్ గా పిలవబడుతున్న దేశాలు 1980 వరకూ యుగొస్లావయ గా పిలవబడ్డ దేశంలోనివే!
1.స్లోవేనియా ( Slovenia )
2.క్రోయేషియా ( Croatia )
3.బోస్నియా మరియు హెర్జెగోవినా ( Bosnia and Herzegovina )
4.మంటేనేగ్రో ( Montenegro )
5.సెర్బియా ( Serbia )
6.కోసావో (kosovo)
7.అల్బేనియా(Albania)
8.నార్త్ మెసేడోనియా (North Macedonia)
9.గ్రీస్ (Greece)
10.బల్గేరియా(Bulgaria)
1981 లో ఎవరికి వారు తమకి స్వంతంత్ర దేశం కావాలని పట్టుపట్టడంతో మొదలైన చిన్న చిన్న ఉద్యమాలు చివరికి భీకర యుద్ధాల తరువాత చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది యుగొస్లావియా. కొన్ని గ్రూపులకి అమెరికా, జెర్మనీ ఆయుధాలు అందిస్తే కొన్ని గ్రూపులకి సోవియట్ యూనియన్, చైనా లు ఆయుధాలు ఇచ్చాయి. అక్కడ కమ్యూనిజం ఉండకూడదు అని అమెరికా కుట్రలు పన్నింది.అమెరికన్ డీప్ స్టేట్ ప్రభావం తో అక్కడి జాతుల మధ్య జరిగిన యుద్దాల మీద తప్పుడు వార్తలు ప్రచురించాయి ప్రింట్ మీడియా!
నిజంగా జాతుల మధ్య పోరాటమేనా?
ఒక సారి యుగొస్లావియా ని పరిశీలిస్తే అక్కడ మూడు మతాలు ఉన్నాయి. ఆర్ధడాక్స్ క్రైస్తవులు ( సోవియట్ యూనియన్ తరువాత రష్యా లో ఇప్పటికి ఆర్ధడాక్స్ క్రైస్తవం ని పాటిస్తారు ప్రజలు ), కాథలిక్ క్రైస్తవం, ఇస్లాం మతాలు ఉన్నాయి. ఒక్క రొమేనియా లో మాత్రమే జిప్సీ ప్రజలు ఎక్కువగా ఉన్నారు, వీళ్ళు దేశ దిమ్మరురులు కానీ 10 వ శతాబ్దంలో భారత్ నుండి యూరోపు కి వలస వెళ్లిన హిందువులు. కొందరి జిప్సీ లు ఇప్పటికి హైందవాన్ని పాటిస్తున్నారు అక్కడ. కానీ జిప్సీలని యూరోపు ఇప్పటికి స్వీకరించలేదు.
సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం ప్రస్థావించాల్సిన అవసరం ఉంది. ప్రతి నాలుగేళ్ళకి ఒక సారి మహారాష్ట్ర లోని నాగపూర్ దగ్గర ప్రపంచం లోఉన్న అన్ని దేశాలనుండి జీప్సీ లు వచ్చి అయిదు రోజుల పాటు సమావేశం అవుతారు! జీప్సీ ఫెస్టివల్ పేరుతో ప్రతీ సంవత్సరం స్లోవేకీయ లోని బ్రటిస్లావా ( Bratislava ) లో పండుగ చేసుకుంటారు. మన దేశం నుండి కూడా ప్రతినిధులు వెళతారు.అంటే ఘర్షణ పడడానికి మతం కారణం కాదు. అక్కడ చిచ్చుపెట్టడానికి పనికి వచ్చింది భాష,సంస్కృతి!. టిటో బ్రతికి ఉన్నంత కాలం ఎవరి కుట్రలు, వ్యూహాలు పనిచేయలేదు. టిటో మరణం తరువాత 10 ఏళ్ళకి ఆ దేశం పూర్తిగా ముక్కలు చెక్కలు అయిపొయింది!
ఎవరికి లాభం?
టిటో మరణించే వరకూ యుగోస్లావియా 6.7%వృద్ధి రేటు తో యూరోపు లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం గా ఉండేది.జెర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సరసన ఉండేది. కానీ యుగొస్లోవయ కమ్యూనిస్ట్ దేశం. టిటో చిన్న తనంలో అస్ట్రీయ – హంగరి దేశ సైన్యం లో సార్జెంట్ మేజర్ గా పనిచేసేవాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో సోవియట్ సైన్యానికి చిక్కి మాస్కో కి తరలించబడి అక్కడ కమ్యూనిజం కి ఆకర్షంచబడి తరువాత యువోస్లోవియా చేరుకొని 1918 లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యుగోస్లావియా లో చేరాడు. 1980 లో మరణించే వరకూ తన కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి కట్టుబడి పాలన చేశాడు.
అయితే యూరోపు లో కమ్యూనిస్ట్ దేశం 6.7% వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతూ పొతే ఎలా! ముక్కలు చెక్కలు చేశారు! మరి ఎవరికి లాభం? ఒక దేశం 10 దేశాలుగా విడిపోతే బ్యాంకింగ్, మిలిటరీ లు విడిగా కావాలి. బ్యాంకింగ్ వ్యవస్థ రోత్స్చైల్డ్ కుటుంబం చేతిలో ఉంది ప్రపంచవ్యాప్తంగా! మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ ల ద్వారా లాభపడేది వీళ్ళే! మన డబ్బులు బాంకులో దాచుకుంటే సేవలు అందిస్తున్నందుకు మన దగ్గర ఫీజు రూపంలో వసూలు చేసే విధానం మొదలు పెట్టింది వీళ్ళే!
అప్పు కావాలి అంటే సిబిల్ స్కోర్ ఉండాలి. సిబిల్ స్కోర్ కావాలి అంటే ముందు అప్పు చేసి సక్రమంగా వడ్డీ కట్టి మంచి మార్కులు తెచ్చుకోవాలి!నువ్వు అసలు అప్పు చేయకపోతే సిబిల్ స్కోర్ ఉండదు కాబట్టి అప్పు ఇవ్వరు!
ఇక అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ కూడా లాభపడుతుంది. ఒక్కో దేశానికి వేరు వేరుగా ఆయుధాలు కావాలి అవి అమెరికా అమ్ముతుంది!ఇవన్నీ కాక సోవియట్, చైనా ఆయుధాల సామర్ధ్యం ఎలాంటిదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ప్రతీ 20 ఏళ్ళకి ఒక సారి ఆయుధాల జెనరేషన్ మారుతూ ఉంటుంది. పరీక్షించాలి అంటే రియల్ టైం రియల్ టార్గెట్ కావాలి.
నాటో దళాలు యుగోస్స్లెవియా మీద దాడులు చేశాయి. ముఖ్యంగా సెర్భియా మీద!
F – 117 నైట్ హాక్ అనేది అమెరికన్ స్టెల్త్ బాంబార్! F-117 కి కాల్ సైన్ వేగా 31. కాల్ సైన్ అంటే F117 పైలట్ కంట్రోల్ కమాండ్ సెంటర్ తో మాట్లాడేటప్పుడు వేగా 31 అని చెప్తాడు కానీ F 117 అని చెప్పడు.
మార్చి 27,1999 రోజున సెర్బీయా రాజధాని బెల్గ్రేడ్ కి సమీపంలో బాంబింగ్ చేయడానికి వచ్చిన F 117 నైట్ హాక్ స్టెల్త్ బాంబర్ ని సెర్బీయన్ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసింది! అప్పట్లో సెర్బీయా దగ్గర సోవియట్ తయారీ అయిన S-125 నెవ (Neva ) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, అది 1961 లో తయారైనది. అత్యంత ఆధునికమైన స్టెల్త్ బాంబర్ ని ఎలా కూల్చగలిగింది అనేది ఇప్పటివరకు అసలు నిజం ఏమిటో బయటికి రాలేదు.
2008 వరకూ అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ పరిశో దనలు చేసి చివరికి F 117 నైట్ హాక్ ని సర్వీస్ నుండి తొలగించింది!
విచిత్రం ఏమిటంటే సోవియట్ S-125 ఎయిర్ డిఫెన్స్ అనేది మొదటి జెనరేషన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ అమెరికా దాడులలో దాని రాడార్ దెబ్బతిoటే చైనా రాడార్ ని మార్పులు చేసి S-125 తో అనుసంధానం చేశారు సెర్బీయన్లు. అంటే S-125 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో అనుసంధానం చేసిన రాడార్ ఒరిజినల్ కాదు!
యుగొస్లావియా విషయంలో అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ చాలా విలువైన విషయాలు నేర్చుకుంది!
డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుందో చూడండి! 1981 నుండి మొదలయ్యి 1991 కి వచ్చే సరికి యుగొస్లావియా దేశం ముక్కలు చెక్కలయింది యూరోపు లో! 1991 లో సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయిపొయింది!
యుగొస్లావియా ఆర్ధికంగా, సైనిక పరంగా బలంగా ఉంది కాబట్టి భాష, సంస్కృతి అనేవి ట్రిగ్గర్ పాయింట్ లు పనిచేసాయి. అదే సోవియట్ యూనియన్ కి వచ్చే సరికి ఆర్ధికంగా బలహీన పడడం, మతం ట్రిగ్గర్ పాయింట్స్ అయ్యాయి. ఉబ్జెకిస్థాన్, తజకిస్థాన్, ఖజకిస్థాన్ రిపబ్లిక్కులు ముస్లిం మెజారిటీ ప్రాంతాలు సోవియట్ యూనియన్ లో!
బాల్కనైజేషన్ అనే పదం ఒక దేశాన్ని ముక్కలు చేయడానికి పర్యాయపదంగా వాడతారు! మన దేశం యుగొస్లావియా కి భిన్నంగా ఉందా?