వందేభారత్ స్లీపర్ ట్రైన్ కు సంబంధించి మరోసారి ట్రయల్ రన్ నిర్వహించారు. రైలు వేగాన్నిక్రమక్రమంగా పెంచుతూ పరీక్షిస్తున్నారు. ఇక ఇవాళ 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అంత వేగంలోనూ ట్రేలో నీళ్లతో నిండుగా ఉన్న గాజు గ్లాస్ నుంచి ఒక్క నీటి చుక్కా కిందపడలేదు.రాజస్థాన్లోని కోటా-లబాన్ స్టేషన్ల మధ్య సాధారణ ప్రయాణీకులతో సమానమైన బరువుతో రైలును పరీక్షించారు. ఈ వీడియోను రైల్వే మంత్రిఅశ్విని వైష్ణవ్ ఎక్స్ లో షేర్ చేశారు.జనవరి1న గంటకు 130 కిలోమీటర్ల వేగంతో రైలు నడిపారు, తరువాత క్రమంగా 140,150,160 కిలోమీటర్లకు పెంచుతూ పరీక్షలు నిర్వహించారు. తాజాగా 180 కిలోమీటర్లు నడిపారు. వచ్చేనెలలో ట్రయల్స్ కొనసాగుతాయని, త్వరలోనే వందేభారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కుతుందని భారతీయ రైల్వేప్రకటించింది.