ప్రజాస్వామ్యానికి – సనాతన ధర్మానికి పొసగదు – కేరళ ముఖ్య ఆధ్యాత్మిక గురువు ‘నారాయణ గురు’కి సనాతన ధర్మానికి సంబంధంలేదు” :
కేరళ కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినారాయ్ విజయన్ గారి తాజా స్టేట్మెంట్.
ఈ ప్రకటన పై యథా ప్రకారం బిజెపి మండిపడగా, కాంగ్రెస్ లో ఎప్పుడూ ఉన్నట్లే ఎలా స్పందించాలో తెలియని గందరగోళం…
కేరళ ప్రతిపక్ష నేత , కాంగ్రెస్ సీనియర్ నేత అయిన VD సతీసన్ పినారాయ్ స్టేట్మెంటు ని గట్టిగా ఖండిస్తూ, సనాతన ధర్మం యొక్క సారాన్ని వక్రీకరించి, సమాజంలోని ఒక వర్గానికి ఆపాదించదానికి ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. “సనాతన ధర్మం అనేది ఈ దేశంలోని మొత్తం ప్రజల సంప్రదాయం ,వారసత్వం అని మనం గ్రహించాలి అని… గతంలో ఇలాగే ఉపయోగించిన ‘కాషాయీకరణ’ అనే పదమే తప్పు’ అని సతీశన్ అన్నారు.
ఈ గందరగోళాన్ని ధృవీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ కేరళ అధ్యక్షుడు మాత్రం పినారాయ్ స్టేట్మెంట్ కి మద్దత్తు ఇస్తూ, సనాతన ధర్మం అంటే మళ్లీ రాచరికం . కుల వ్యవస్థ తీసుకురావడమే అని అన్నారు.
మరోవైపు రాబర్ట్ వాద్రా బావ, కాంగ్రెస్ సానుభూతి పరుడు, టివిలో కాంగ్రెస్ వాణి వినిపించే ప్రముఖ వ్యాఖ్యాత తెహసీన్ పూనవాలా పినారాయ్ విజయన్ స్టేట్మెంటు పై ఘాటుగా స్పందించారు.
కేరళ సీఎంసనాతన ధర్మాన్నిఅవమానించారనిఅంటూ…
“భారతదేశంలో SDPI అనే కొత్త మానసిక వ్యాధి వ్యాప్తి చెందుతోంది, ఇది (బాన్ చేయబడ్డ ముస్లిం PFI-SDPI కాదు.) ఇది ‘సనాతన్ ధర్మ ఫోబియా ఇండియా’. ఈ SDPI బారిన పడిన వారిలో ఎక్కువ మంది, వామపక్ష మనస్తత్వం ఉన్నవాళ్లే. ఇదే కేరళ ముఖ్యమంత్రి హమాస్ ఉగ్రవాదిని కేరళలో ర్యాలీలో ప్రసంగించడానికి అనుమతించారు, కానీ, ఆయనే ఇప్పుడు చెపుతున్నాడు సనాతన ధర్మానికి ప్రజాస్వామ్యానికి పొంతన ఉండదు అన్నారు.అంతేకాదు…భారత ప్రజలు ఈ వామపక్ష మనస్తత్వంతో విసుగు చెందారని…అందుకేగుర్తింంపులేకుండాపోతున్నాయి…జేఎన్యూ క్యాంటీన్కే . కేరళకే పరిమితమైపోయింది…త్వరలోకేరళకూడావారినివదిలేస్తుందనీఅన్నారు.
2019 లోక్ సభ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్, వామపక్షాలు ఇతర కుల కుటుంబ పార్టీలు బీజేపీ విమర్శించడానికి ‘హిందుత్వ’ అనే పదం ఉపయోగించేవారు. హిందువుల లో గల సెక్యూలర్ హిందువులను సనాతనీయులుగా గుర్తించి, బిజెపికి మద్దత్తు ఇచ్చేవారిని హిందుత్వ వాదులుగా చూపిస్తూ హిందువులను విభజించి ఓట్లు వేయించుకుందాం అని చేసిన గట్టి దుర్మార్గపు ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో బీజేపీ తన హిందుత్వ వోట్ బాంక్ పెంచుకుని ఇంకా ఘన విజయం సాధించింది. అప్పుడు సనాత పాచిక పారకపోవడంతో…
దీంతో ఇక ఈ ‘సనాతన’ పాచిక ఉపయోగపడటం లేదు అని గుర్తించింది ఇంకో పెద్ద పార్టీఅండ్ కో…
తమ ఓట్లే తమ అస్తిత్వం అని గుర్తించని, తమ కేమీ సంబంధం లేదు అని భావించే సెక్యూలర్ మంచి హిందువులు ఎలాగూ బిజెపి కి ఓట్ వెయ్యరు అని ఆపార్టీలకుఅర్థమైంది. హిందువులకుఅవసరంలేని మద్దతుతెలిపి మైనార్టీ ఓట్లుకూడా పోగోట్టుకోవడంఎందుకూ అనుకున్నారేమో…బీజేపీయేతర అన్నిపార్టీలు 2024 ఎన్నికలకముందు నుంచి సనాతన సానుభూతి ముసుగు తీసిపక్కనపడేశాయి. అంతేకాదు సనాతన ధర్మం మీద దాడినికూడా మొదలుపెట్టాయి.
సనాతన ధర్మం మీద నేరుగా ఈ దాడి దేనికోసం? ఇంకెందుకు? గంప గుత్తగా మైనార్టీ ఓట్లు కొల్లగొట్టుకోడానికి.
దానిలో భాగంగానే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సనాతన ధర్మం మీద మొదట దాడి మొదలుపెట్టాడు. కర్ణాటకలో ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ మళ్ళీ బిజెపి గెలిస్తే సనాతన ధర్మం బలపడుతుంది. RSS బలపడుతుంది. మీ ఉనికి కి ప్రమాదం. తస్మాత్ జాగ్రత్త అని తమ ఓటు బాంక్ ని హెచ్చరించాడు.
దానిని మరి కొంచం ముందుకు తీసుకు వెళ్తూ రాహుల్ ‘హిందూ ధర్మం లో ‘శక్తి’ అనే పదం ఉంది. దానిపైనే నా పోరాటం అని.ముంబై లో ఒక సభలో అన్నాడు. సనాతన ధర్మం పై అసభ్యకర భాష ఉపయోగించాడు అనే ఆరోపణలు పై తమిళనాడు లో అరెస్ట్ అయిన కేథలిక్ ప్రీస్ట్ జార్జి పొన్నయ్యని భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కలసి
క్రిస్టియనిటీ-సనాతన ధర్మం పై చర్చించిన విడియో రిలీజ్ చేశారు. దాన్లో రాహుల్ జీసస్ దేవుడు అంటే ఆ జార్జి కాదు, జీసస్ మాత్రమే మానవ ఆకారంలో వచ్చిన నిజ దేవుడు. హిందూ ధర్మంలో ఉన్న శక్తి దేవత లాగా కాదు అని రాహుల్ కి పాఠం చెప్పాడు.
ఆపై ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మాన్ని కొన్ని భయంకరమైన జబ్బులతో పోలిస్తే వాడి చుట్టం దయానిధి మారన్ మరికొన్ని జబ్బులతో పోల్చాడు. అలాగే యుపి లో సమాజావాదీ పార్టీ నాయకులు కూడా సనాతన ధర్మం మీద పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు తాజాగా కేరళ కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినారాయ్ విజయన్ సనాతన ధర్మం పై దాడి మొదలు పెట్టారు.
కేరళలో ఇప్పుడు దేనికి ఈ వివాదం లేపారు అంటే నారాయణ గురు భక్తులైన ఎజ్వా కులం వారి ఓట్లు కేరళలో గణనీయంగా ఉన్నాయి. నారాయణ గురు హిందూ ధర్మం లో సంస్కరణలు కోసం పోరాడారు. వీరు సిపిఎం పార్టీ మద్దతుదారులు. కానీ, కమ్యూనిస్టు లు మైనార్టీల కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వీళ్ళలో ఒక వర్గం భావించి 2024 లోక్ సభ ఎన్నికల్లో సిపిఎం ని కాదు అని బీజేపీ ఓట్లు వేశారు. ఇన్నాళ్ళు సనాతన ధర్మానికి/హిందూ ధర్మానికి నారాయణ గురుకి సంబంధం లేదు అని ఏజ్వా కమ్యూనిటీ ని బిజెపి కి దూరంగా ఉంచిన కమ్యూనిస్టు లకు వీరు కూడా బిజెపి వైపు వెళ్లిపోతారేమో భయం పట్టుకుంది. అందులో మొన్న లోక్ సభ ఎన్నికల్లో సిపిఎం కి కేరళ లో ఒక్క ఎంపీ సీట్ కూడాఇవ్వలేదు.దీంతో సీపీఎం ఇప్పుడు నారాయణగురు పేరును తీసుకువచ్చి వివాదాస్పదం చేస్తోంది.ఎజ్వా కమ్యూనిటీ ని బిజెపి కి దూరం చేసి హిందూ ఓట్లు కన్సాలిడేట్ కాకుండా చేసే ప్రయత్నం లో భాగమే కేరళ సీఎం తాజా వివాదాస్పద ప్రకటన.