ఇక నుంచి 18 ఏళ్ల లోపుపిల్లలు సోషల్మీడియా అకౌంట్లు యాక్సెస్ చేయాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.ఇందుకోసం డిజిటల్ పర్సనల్ డేటాప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకురాబోతోంది కేంద్రం , ఈమేరకు కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ DPDP- 2023 కోసం నియమనిబంధనలతో డ్రాఫ్ట్ ను నోటిఫై చేసింది. ఈఏడాది ఫిబ్రవరి 18 వరకు ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. పాఠశాలవిద్యార్థులను సోషల్మీడియానుంచి దూరంగా ఉంచే ఉద్దేశంతోఈ యాక్ట్ తీసుకువస్తున్నారు. కొత్త రూల్స్ ప్రకారం పిల్లలు సోషల్మీడియా వేదికల్లోకి రావాలంటే…తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. తల్లిదండ్రులు ముందు డేటా ఫిడ్యూషియరీ డీఎఫ్ ని రిజిస్టర్ చేసుకోవాల్సిఉంటుంది.పిల్లల డేటానుప్రాసెస్ చేయడానికి డీఎఫ్ తప్పనిసరి. డిజిటల్ లాకర్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారాపిల్లల వయసుని నిర్థారించాల్సిఉంటుంది. అయితే ఈడీపీడీపీ చట్టంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి. 18ఏళ్లనుంచి 14 ఏళ్ల వయసుకు కుదించాలని గూగుల్, మెటావంటి సంస్థలతో పాటు కొందరు అభ్యర్థించాయి. దీంతో పౌరసమాజం అభిప్రాయాన్ని కోరుతోంది కేంద్రం. దాన్ని బట్టి మినహాయింపులుండే అవకాశంఉంటుంది. ఇటీవలే ఆస్ట్రేలియాప్రభుత్వం…సోషల్మీడియా యాక్సెస్ కు కనీసవయసును16 ఏళ్లుగానిర్ణయించి చట్టంతీసుకువచ్చింది.