కశ్మీర్ ఫైల్స్,కేరళస్టోరీ. తాజాగా 2002నాటి గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో వాస్తవాలతో తెరకెక్కిన “సబర్మతి రిపోర్ట్” బయటకు వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈసినిమాపై ప్రధాని మోదీ స్పందించారు. నిజం బయటకు వస్తోందని ప్రశంసించారు. కల్పిత కథనాలు ఎల్లకాలం నిలవవు అని, సామాన్యులకు అర్థమయ్యేలా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగాఉందని ఆయన అన్నారు. సినిమా ట్రయలర్ ను తనకు ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు ఆయన స్పందించారు.
మోదీ ముఖ్యమంత్రిగాఉండగా… గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా సబర్మితి రిపోర్ట్ ను నిర్మించారు. ఆ ఏడాది ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 కోచ్‌కు దుండగులు నిప్పు పెట్టారు. ఆఘటనలో అందులో ఉన్న 59మంది సజీవ దహనమయ్యారు. వారంతా కూడా అయోధ్యనుంచి తిరిగి వస్తున్న సాధువులు, హిందూభక్తులు. అనంతరం ఆఘటనకు నిరసనగా కొందరు గుజరాత్ లో అల్లర్లకు దిగారు. ఈ ఘటనల ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను రూపొందించారు. శుక్రవారం చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా, రిథి డోగ్రా ప్రధాన పాత్రలు పోషించారు. శోభా కపూర్, ఏక్తా కపూర్, అమూల్ వి.మోహన్, అన్షుల్ మోహన్ నిర్మాతలు.
2022లో కశ్మీర్లో పండితుల ఊచకోత, తరిమివేతపై వివేక్ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా దాచిపెట్టిన నిజాన్ని ఇన్నాళ్లకు సినిమా ద్వారా బయటకు తీశారని మోదీ అన్నారు. ఇక కర్నాటక ఎన్నికల సందర్భంగా కూడా ది కేరళ స్టోరీని ఆయన ప్రస్తావించారు. కేరళతో పాటు దేశవ్యాప్తంగా కుట్రప్రకారం లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిల జీవితాలను ఎలా నాశనంచేస్తున్నదీ, వాళ్లను ఎలా ఉగ్రవాదులుగా మారుస్తున్నదీ అందులో చూపించారు. ఇక 22 ఏళ్లనాటి గుజరాత్ అల్లర్లపై ది సబర్మతీ రిపోర్ట్ తెరకెక్కింది.