అసలు ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారు అనేది ట్విట్టర్లో చాలా మంది జాతీయ వాదులు రుజువులతో సహా షేర్ చేశారు. అన్ని క్రోడీకరించి మీ కోసం క్లుప్తంగా ఒక పోస్ట్ పెడుతున్నాను.
ఒక సారి మీకు కూడా చూడండి.
గత వారం అమెరికా బ్రూక్లిన్ కార్యాలయం, తూర్పు జిల్లా న్యూయార్క్ కోర్టు అదానీపై లంచాలు ఇచ్చారనే ఆరోపణల మీద కేసు నమోదు చేసింది.
54 పేజీల ఆ తీర్పులో పేర్కొన్న ఆరోపణల ప్రకారం, అదానీ 2021-22 మధ్యలో ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా, తమిళనాడు, ఒడిశా మరియు కాశ్మీర్ లలో ప్రాజెక్ట్‌లు సంపాదించడానికి భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చాడు అని, ఆదాని US బ్యాంకులు మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి $2 బిలియన్ల అంటే ₹16000కోట్లు రుణం తీసుకున్నప్పుడు ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడనని హామీ ఇచ్చినందువల్ల ఇప్పుడు ఈ లంచాలు వల్ల US బ్యాంకులను మోసం చేసినట్లే అని అభియోగాలు మోపబడ్డాయి.
అంటే, US కోర్టు ప్రకారం అదానీ భారతీయ రాష్ట్రాలలోని భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చాడు అంటే భారతదేశంలో నేరం జరిగింది కాబట్టి అది భారతీయ న్యాయస్థానాలచే నిర్ణయించబడుతుంది. కానీ, భారతీయ కోర్టులో అదానీపై ఎటువంటి కేసు లేదు అలాగే ఎటువంటి లంచాలు ఇచ్చినట్టు గా ఆరోపణలు కానీ ఆధారాలు కూడా లేవు.
మరి ఇటువంటి పరిస్థితి లో అమెరికా కోర్టుకు ఎందుకు అదాని మీద ఇంత అత్యుత్సాహం?
ఎందుకో చూడండి…
న్యాయవ్యవస్థ లో నియామకాలు మన దేశంలో లాగా అమెరికాలో ఉండవు. USAలోని US సెనేట్ ద్వారా న్యాయమూర్తులను నియమిస్తారు.
బ్రూక్లిన్ స్థానికుడు మరియు హార్వర్డ్ కళాశాల మరియు హార్వర్డ్ లా స్కూల్‌లో గ్రాడ్యుయేట్ మరియు న్యూయార్క్ నుండి డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు అయిన చెక్ షుమెర్ 1999 నుండి యునైటెడ్ స్టేట్స్ సెనేటర్. జనవరి 2021లో ఈ షుమెర్ సెనేట్ మెజారిటీ నాయకుడు అయ్యాడు. అంటే సెనేట్ ద్వారా US న్యాయమూర్తులను నియమించే అధికారం పొందాడు. ఈ బీడెన్-షుమెర్ రెండు సం. ల కాలంలో US కోర్టులో చాలా మంది న్యాయమూర్తులు ఈ షూమెర్ చే నియమించబడ్డారు. ఇది ఎంత ఎక్కువ ఆంటే 60సం. ల క్రిందట J. F.కెన్నాడీ అధ్యక్ష పాలనలో తరువాత ఇదే మళ్ళీ అంత ఎక్కువగా జరిగిన నియామకాలు.
ఇక నేరుగా చెప్పాలి అంటే ఈ చెక్ షూమెర్ బిడెన్ పరిపాలనలో సోరోస్ వ్యక్తి. గూగుల్ లో చెక్ చేస్తే ఈ షూమర్ గెలుపుకు సోరోస్ 6 మిలియన్ డాలర్లు విరాళం గా ఇచ్చాడు అని వార్తలు కనిపిస్తాయి. అందుకే సోరోస్ ఉదారవాద అజెండా అంశాలు వంటి స్వలింగ వివాహాలు, అదుపు లేని అక్రమ వలసలు వంటి వాటికి బయట మరియూ న్యాయవవస్థ ద్వారా మద్దతునిచ్చిన వ్యక్తి ఈ షుమెర్. ఈ సంవత్సరంలో కూడా షుమర్స్ PACకి సోరోస్ $16 మిలియన్లు విరాళంగా ఇచ్చాడు. ఒబామా, క్లింటన్, బిడెన్‌ల ముఠా కి సోరోస్ కీలక నిధుల దాత కూడా.
2021 మార్చిలో షుమెర్ US కోర్టులకు ముగ్గురు కొత్త న్యాయవాదులను సిఫార్సు చేశారు. వాటిలో ఒకటి బ్రయోన్ పీఎస్ ఒకరు.
న్యూయార్క్‌లోని తూర్పు జిల్లా కోర్టుకు అటార్నీగా బ్రయాన్ పీఎస్ పేరు సెప్టెంబర్ 30, 2021న వాయిస్ ఓటు ద్వారా అతని నామినేషన్ సిఫారసు చేయబడగా, అక్టోబర్ 5 న సెనేట్ వాయిస్ ఓటు ద్వారా అతని నామినేషన్‌ను ధృవీకరించబడగా, అక్టోబర్ 15, 2021న, అటార్నీగా బ్రియాన్ స్టాసీ పీస్ ప్రమాణం చేశారు. అక్టోబర్ 2021 నుండి న్యూయార్క్ తూర్పు జిల్లాకు యునైటెడ్ స్టేట్స్ అటార్నీగా ఇతను పనిచేస్తున్నారు.
ప్రపంచంలో జాతీయ వాద నాయకులను, జాతీయవాద ప్రభుత్వాలను ద్వేషించి వాటిని ఎలాగైనా పడగొట్టి తమ వారి చేతిలో ఆ దేశాల పాలన పెట్టే వ్యూహం అమలులో 2014 ఎన్నికల్లో భారత్ లో మోడీ గెలుపు తమ వ్యూహాలకు ఉహించని విధంగా ఆటంకం ఏర్పడింది అని జార్జ్ సోరోస్ 2020లో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మీటింగ్ లో బహిరంగంగా చెప్పాడు. అలాగే 2023లో జనవరి/ఫిబ్రవరి లో ఆదాని గ్రూప్ మీద హిడెన్ బర్గ్ రిపోర్ట్ రాగానే మోడీ పని అయిపోయిందని మోడీ పార్లమెంట్ కు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది అని ఈ సోరోస్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వాగాడు.
అంటే ఆదాని మీద వరుసగా దాడిచేస్తూ, భారత స్టాక్ మార్కెట్ ని పడగొట్టి, దేశాన్ని ఆర్ధికంగా బలహీనపరచి, బంగ్లాదేశ్ లో లాగా ప్రజల్లో అలజడి రేకెత్తించి మోదీని ఇరుకున పెట్టి అధికారంలో నుండి దింపేయాలి అని సోరోస్ దీర్ఘ కాలిక ప్రణాళిక.
ఆ ప్రణాళికలో..
- మొదటి అంకం జనవరి2023లో అదాని గ్రూప్ పై హిడెను బర్గ్ రిపోర్ట్. దీని వెనుక సోరోస్ ఉండబట్టే ఈ రిపోర్ట్ పై సోరోస్ నేరుగా మాట్లాడాడు. ఆ రిపోర్టు పై కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాలు హడావిడి, విపరీతమైన ప్రచారం స్టాక్ మార్కెట్ పతనం, SBI/LIC దివాలా రూమర్స్, సుప్రీంకోర్టు లో పిల్. చివరకు రిపోర్ట్ లో ఏం లేదు అని తేల్చిన సుప్రీంకోర్టు చే నియమింపబడ్డ నిపుణుల కమిటీ. భారత్ స్టాక్ మార్కెట్ ని పడగొట్టడానికి తెచ్చిన ఈ రిపోర్ట్ వెనకాల ఎవరు ఉన్నారో విచారణ చేయమని సుప్రీంకోర్టు ఆదేశం.
- రెండో అంకం ఆగస్ట్ 2023లో OCCRP (ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్)
అనే NGO ద్వారా ఆదాని-సెబీ కుమ్మక్కు అంటూ మరో రిపోర్ట్. మళ్ళీ ఈ రిపోర్ట్ పై ప్రతిపక్షాలు హడావిడి, మోదీ వ్యతిరేకులచే మళ్ళీ ఈ రిపోర్ట్ కు భారీ ప్రచారం, స్టాక్ మార్కెట్ లో సంచలనం. ఈ OCCRP భారీగా నిధులు ఇచ్చేది మళ్ళి ఇదే జార్జి సొరోస్ కి చెంది OSF. పర్యావరణానికి హాని చేస్తోందని తమిళనాడు లో వేదాంత గ్రూప్ స్టీరిలైట్ రాగి పరిశ్రమ మూయించి మన దేశ అవసరాలకు రాగి దిగుమతి చేసుకునే పరిస్థితి కల్పించింది ఇదే OCCRP NGO. - ఇప్పుడు మళ్ళీ ఆ తరువాత మూడవ అంకమే మొన్న అమెరికా కోర్టులో ఆదానిపై అవినీతి ఆరోపణలు. ఈ నేరారోపణల వెనుక ఉన్నది ఎవరు? గొలుసు చూడండి.
జార్జి సోరోస్ ఫండింగ్ తో సేనేట్ యొక్క మెజార్టీ నాయకుడు గా ఎన్నిక కాబడ్డ షుమెర్ చే నియమించబడ్డ … బ్రయాన్ పీఎస్ అనే అటార్నీ చేత ….ఆదాని పై అమెరికా కోర్టులో అభియోగాలు మోపబడ్డాయి. అంటే సోరోస్-షూమెర్-బ్రయాన్ పీఎస్ ముఠా నేరుగా ఆదాని పై అభియోగాలు నమోదు చేయించింది.
ట్రంప్ ఎన్నికల్లో గెలిచినా ఇంకా జనవరి 20 వరకు అధికారం చేపట్టలేడు. అందుకని ట్రంప్ అధికారంలోకి వచ్చినా న్యాయవ్యవస్థ తమ గుప్పెట్లో ఉండేలాగా ఈ షూమర్ న్యాయవ్యవస్థ లో నియామకాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.
న్యూయార్క్‌లోని తూర్పు జిల్లా కోర్టు ఇంకో న్యాయమూర్తి అయిన నికోలస్ గరౌఫీస్ కూడా డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకి. అతను క్లింటన్ చే నియమించబడ్డాడు మరియు 2016-20 సమయంలో, అతను ట్రంప్ యొక్క అనేక నిర్ణయాలను రద్దు చేశాడు.
మరియు వాటిలో ఒకటి వలసదారుల కోసం గేట్లు తెరవడానికి అని DACAని పునరుద్ధరించడం. ఈ ఆటార్నీ లు జార్జి సోరోస్ అజెండా లోని అంశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు.
బిలియన్స్ వ్యాపారం చేస్తున్న వందల వ్యాపార సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఉండగా, భారత దేశంలో ఉన్న ఒక్క ఆదాని గ్రూప్ మీద మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఈ వరుస దాడులు ఎందుకు జరుగుతున్నాయి? దానికి మన ప్రతిపక్షాలు ఎందుకు మద్దత్తు ఇస్తున్నాయి?
అన్నట్లు ప్రస్తుత కెన్యా అధ్యక్షుడు ఎవరైతే గత వారం ఆదాని కాంట్రాక్టు లు రద్దు చేసి చైనా కంపెనీ కి కట్టబెట్టాడో అతను జార్జి సోరోస్ కొడుకు అలెక్స్ సోరోస్ తో తరుచుగా టచ్ లో ఉంటాడు.(క్రింద ఫోటో చూడండి)
ఈ ఆదాని మీద దాడి అనేది పేరుకే, కానీ, అసలు ఈ సోరోస్ ముఠా అసలు టార్గెట్ మోడీ.
హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు సోరోస్ ముఠాకు పుండు మీద కారం జల్లినట్లు ఉంటుంది. అందుకని రాబోయే రోజుల్లో ట్రంప్ పదవి చేపట్టే లోగా దేశంలో ఏదో ఒక పేరుతో ఆందోళనలకు, వీధి పోరాటాలు జరిగే అవకాశం ఉంది.
….చాడా శాస్త్రి…