
అమెరికాలోని వాల్డ్ ట్రేడ్ సెంటర్ లక్ష్యంగా 2001 సెప్టెంబర్ 11న ఉగ్రదాడి జరిగింది. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి అదని అందరూ అనుకుంటారు. అయితే మన దేశంలో అంతకంటే తీవ్రమైన ఘటనలు ఎన్నో జరిగాయి. వాటి ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతెందుకు అమెరికాపై దాడి తరువాత కొన్నినెలలకే 2002 ఫిబ్రవరిలో దారుణమారణ కాండ గుజరాత్ లో జరిగింది. అయితే నాటి విషాదాన్ని ఎవరూ తెరకెక్కించే ప్రయత్నం చేయలేదు.
ఫిబ్రవరి 27, 2002లో ఏకంగా 59 మంది సాధువులను ఉన్మాదమూక సజీవదహనం చేసింది. ఆ ఘటన 9/11 కంటే చాలా భయంకరమైనది. అయోధ్య నుంచి హిందూభక్తులతో వెళ్తున్న సబర్మతి ఎక్స్ ప్రెస్ కు మతోన్మాదమూక నిప్పుపెట్టింది. వర్గంపై అణువణువునా ద్వేషం. దారుణంగా చంపాలన్న కసి. అసలు సాటి మనుషులపై ఇంత ద్వేషం ఎలా? కేసులు,శిక్షలు. ఇంతకాలానికి అంటే 8,297రోజుల తరువాత నాటి వాస్తవఘటనల ఆధారంగా “ది సబర్మతి రిపోర్ట్” విడుదలైంది.ఒక చారిత్రక వాస్తవాన్ని తెరమీద చూపించడానికి 22 ఏళ్లకు కొందరికి ధైర్యం వచ్చిందన్నమాట.
మరి సబర్మతి రిపోర్ట్ ఎందుకు చూడాలి. ఎందుకంటే సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్స్ నోళ్లు మూయించడానికి వాస్తవం తెలుసుకోవడానికి చూడాలి. ఎంతసేపూ గోద్రా అనంతర అల్లర్ల గురించే మాట్లాడుతారు తప్ప సబర్మతి రైలు దహనం ఊసే ఎత్తరు వాళ్లు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదంలో మరణించిన 59 మంది ప్రయాణికుల పేర్లను తెలుసుకోవడానికి ఈ చిత్రాన్ని చూడాలి. భారతదేశ చరిత్రను గోద్రాకు ముందు- తరువాత అనే రెండు విభాగాలుగా విభజించిన సంఘటన గురించి తెలుసుకోవడానికి ఈ మూవీ చూడాల్సిందే. ముస్లిం మూక ఎలా హిందువులను, అదీ సాధువులను, రామభక్తులను టార్గెట్ చేసిందో తెలుసుకోవడానికి చూడాలి. రాడికల్ ఇస్లామిక్ భావజాలానికి నాడు సజీవదహనం అయింది 59మంది అయితే 41 మంది పేర్లుమాత్రమే బయటకువచ్చాయి. మరి మిగిలిన 18మంది ఎవరు? అది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
రైలు దహనం ఘటనను మాత్రం బయటకు రానీయకుండా జాగ్రత్తపడ్డారు సోకాల్డ్ మేధావులు. ఆ ఘటనతో రగిలిపోయి కొందరు యువకులు చేసిన అల్లర్లను మాత్రమే పదే పదే ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు. ఆ అమానవీయ ఘటనను చెరిపేసే కుట్రను తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. నాటి రైలు తగలబడుతున్న దృశ్యాలను చూడాలని ఉంటే సినిమా చూడాలి. అయితే సజీవదహనం అవుతూ…హిందూభక్తులు చేసిన ఆర్తనాదాలు మీరు తట్టుకోగలరో లేదో మరి. మతోన్మాద గుంపు రైలుబోగిని లక్ష్యంగా చేసుకుని తగులబెట్టిన దృశ్యాలు మిమ్మల్ని వెన్నాడుతూనే ఉంటాయి. తట్టుకునే శక్తి ఉందో లేదో చూసుకోండి.