అదానీ అంశంపై చర్చ జరపాలని వారం రోజులుగా ప్రతిపక్షాలు పార్లమెంట్ ఉభయసభల్ని స్తంభింపచేస్తున్నాయి. ఇండీ అలయెన్స్ పార్టీలసభ్యులే కాక… అందులో లెఫ్ట్ పార్టీల ఎంపీలు కూడా ఉన్నారు. అయితే విచిత్రం ఏంటంటే వాళ్లు అధికారంలో ఉన్న కేరళలోని విజింజం అంతర్జాతీయ ఓడరేవును అభివృద్ధిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అదానీ గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆ ఒప్పందం ప్రకారం మొత్తం ప్రాజెక్టు పనులన్నీ పూర్తి కావడానికి గడువు 2045 సంవత్సరం. అయితే అనుకున్న గడువు కన్నా ముందుగానే పనులు పూర్తి చేయడానికి అనుమతించే కొత్త ఒప్పందంపై అదానీ విజింజం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సంతకం చేసినట్లు ఇటీవలే సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.ఈ కొత్త ఒప్పందం వల్ల ప్రోజెక్టు17 ఏళ్లు ముందుగానే పూర్తికానుంది. అంటే తాజా ఒప్పందం ప్రకారం ఈ ఏడాది చివరినాటికే అంతర్జాతీయ సముద్ర ఓడరేవును ప్రారంభిస్తారు. అలాగే ముందుగా అనుకున్న 2045 కన్నా ముందే 2028 నాటికి అన్ని దశలను దాటుకుని ప్రాజెక్ట్ పూర్తి చేసి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అదానీ గ్రూప్ కట్టుబడి ఉన్నాయని విజయన్ ప్రకటించారు.
ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి అంతర్జాతీయ సముద్ర ఓడరేవును ప్రారంభించేందుకు అలాగే 2045 గడువు కంటే చాలా ముందుగానే అంటే 2028 నాటికి దాని అన్ని దశలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు అదానీ కట్టుబడి ఉన్నాయి అని ప్రకటించారు.
ఈ విజింజం పోర్ట్ ప్రాజెక్ట్ దేశంలోనే మొట్ట మొదటి అంతర్జాతీయ డీప్‌వాటర్ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ ఓడరేవు. ఈ ప్రాజెక్ట్ కేరళను గ్లోబల్ ట్రేడ్ మరియు మెరిటైమ్ కనెక్టివిటీకి కేంద్రంగా తయారు చేస్తుంది, రెండు, మూడో దశల్లో సామర్థ్యాన్ని విస్తరించడానికి అదనంగా మరో రూ.10,000 కోట్ల పెట్టుబడి పెడతారు.
ఈ పోర్ట్ లో జరిగే వ్యవహారాల వల్ల కస్టమ్స్ సుంకాలు మొదలగు వాటి వల్ల ఏటా ₹10,000కోట్లు వసూలు అవుతాయి. అంటే ఏటా కేంద్రానికి ₹6000కోట్లు, రాష్ట్రానికి ₹4000కోట్ల ఆదాయం పెరుగుతుంది.
ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ట్రయల్ రన్‌లో ఉంది. దీనిలో కేరళ ప్రభుత్వం నుండి 75 శాతం నిధులతో పూర్తవుతోంది. అదానీ గ్రూప్ తో కేరళ ప్రభుత్వం కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం కేరళ ప్రభుత్వ పర్యవేక్షణలో ఆదాని గ్రూప్ ఈ పోర్ట్ ను 40 సం. లు కాలం మెయింటైన్ చేస్తుంది. 2028 కి గడువు లోగా ప్రోజెక్టు పూర్తి చేస్తే మరో 5 సం. లు మెయింటైన్స్ కాంట్రాక్టు వ్యవధి పెంచుతారు.
కోవిడ్ కారణం గా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం కారణంగా రూ.219 కోట్ల జరిమానా ఆదాని గ్రూప్ పై విధించారు. కొత్త అగ్రిమెంట్ ప్రకారం అందులో రూ.43.8 కోట్లు రాష్ట్రానికి వెంటనే చెల్లించాల్సి ఉండగా, మిగిలిన మొత్తాన్ని 2028 వరకు నిలిపివేస్తారు.
ఆదాని గ్రూప్ కి పోర్ట్స్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే నైపుణ్యాల గురించి ప్రముఖ ఆర్థికవేత్త మరియు కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ సోదరుడు స్వామినాథన్ అయ్యర్ విపులంగా ఒక ఆర్టికల్ రాశారు. వీలు చేసుకుని చదవండి.
….చాడా శాస్త్రి…..