• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Friday, March 6, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home జాతీయం

అధికారం రుచి మరిగితే అంతేనా? భవిష్యత్తులో మహా సంక్షోభం తప్పదా?

Devika by Devika
December 2, 2024
in జాతీయం, రాజకీయాలు
0
అధికారం రుచి మరిగితే అంతేనా? భవిష్యత్తులో మహా సంక్షోభం తప్పదా?
0
SHARES
6
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

ఒకసారి అధికారం రుచి చూస్తే? ఆ రుచి మనిషి రక్తం రుచిమరిగిన పులి కంటే ప్రమాద కరమైనది!మహారాష్ట్ర రాజకీయం పులి కంటే ప్రమాదకరంగా ఉంటుంది!దేశ ఆర్ధిక రాజధాని, రాష్ట్ర రాజధాని అయిన ముంబై మీద అధికారం చెలాయించిన వాళ్లకి ఆ అధికారం లేకపోతే జీవితం ఉండదు అనేంతగా విరక్తిని కలగచేస్తుంది!

ఉద్ధవ్ థాకరే, ఏకనాథ్ షిండే ల పరిస్థితి అలానే ఉంది.ఉమ్మడి శివసేనగా ఉన్నప్పుడు స్వంతంగా మెజారిటీ ఎప్పుడూ రాలేదు. విడిపోయాక ఇక ఎక్కడ వస్తుంది? కానీ అధికారం మాత్రం కావాలి.

ఏకనాథ్ షిండే ఆశ చూడండి.ఎన్నికలకి ముందు మోడీజీ, అమిత్ షా లు ఎలా చెప్తే అలా చేస్తాను అని వినయంగా విలేఖరుల ముందు చెప్పాడు!ఎన్నికలు అయిపోయి ఫలితాలు రాగానే స్వరం మారింది.షిండే నేరుగా అనకుండా తన అనుచరులతో ఒక మాట అనిపించాడు : లాడ్లి బెహనా యోజన షిండే మానస పుత్రిక. ఆ పధకం విజయవంతంగా అమలు కావడం వల్లనే మహాయుతి కూటమి గెలిచింది! అంటే ఏకనాథ్ షిండే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అనే సందేశం పరోక్షంగా బీజేపీ అగ్ర నాయకత్వానికి ఇవ్వడం అన్నమాట!

అతి వినయం ధూర్త లక్షణం!షిండే బయటికి మాట్లాడేది ఒకటి, అమిత్ షా దగ్గర వినయంగా మరొకటి మాట్లాడతాడు. రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు ఫడ్నవిస్, షిండే లు కానీ ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో ఒక స్థిరమైన అభిప్రాయానికి రాలేకపోయారు! అమిత్ షా మాటకి విలువ ఇవ్వలేదు షిండే!

బయటికి రాలేదు కానీ షిండే రెండు డిమాండ్లని అమిత్ షా ముందు పెట్టినట్లు తెలుస్తున్నది.

1.అయితే నేనే ముఖ్యమంత్రి అవ్వాలి.

2.నేను ముఖ్యమంత్రి కాలేకపొతే నా కొడుకు శ్రీకాంత్ షిండే కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి.

వాహ్! క్యా బాత్ హై!

శ్రీకాంత్ షిండే వయసు 37 ఏళ్ళు! ప్రస్తుతం కళ్యాణ్ లోక్ సభ స్థానం కి ప్రతినిధ్యం వహిస్తున్నాడు.2014 లో లోక్ సభ కి శివసేన తరుపున పోటీ చేసే సమయానికి వైద్య విద్యార్దిగా చివరి సంవత్సరం చదువుతున్నాడు. Yes. శ్రీకాంత్ షిండే ఆర్థోపెడిక్ సర్జన్!37 ఏళ్ళ వైద్యుడు అయిన శ్రీకాంత్ షిండే కి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి బీజేపీ నే కాదు ఏ పార్టీ కూడా ఒప్పుకోదు!అందుకే ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో ప్రతిష్టంబన ఏర్పడింది! Dec 3 న ప్రమాణ స్వీకారం అని మళ్ళీ dec 5 కి వాయిదా పడింది!దీని మీద ప్రజలలో ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడతాయి?

సరే! చివరికి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవడానికి ఒప్పుకున్నా హోమ్, ఆర్ధిక శాఖ లు తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నాడు షిండే!ఇంత జరిగాక ఫడ్నవిస్ స్వేచ్ఛగా పాలన చేయగలుగుతాడా? ఈ సందేహం ఇలానే కొనసాగవచ్చు!వంశపారంపర్య రాజకీయాలకి బీజేపీ వ్యతిరేకం! కానీ శ్రీకాంత్ షిండే కి మంత్రిపదవి ఇవ్వక తప్పదు!వేరే మార్గం లేదా?ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తెరుచుకుంటుంది!ఉద్ధవ్ థాకరే శివసేన లో అంతర్మధనం మొదలయ్యింది!

బాల్ ఠాక్రె శివసేన అధ్యక్షుడుగా ఉన్న సమయాన్ని గుర్తు చేసుకుంటున్నారు శివసేన లో ఇంకా కొనసాగుతున్న పెద్ద తరం వారు. కాంగ్రెస్, పవార్ లతో కూడిన మహావికాస్ అఘాడి నుండి బయటికి వచ్చేయమని ఉద్ధవ్ ఠాక్రె మీద ఒత్తిడి పెరుగుతున్నది!

బాల్ ఠాక్రె శివసేన వైభవం ఎలా ఉండేది?

పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ భారత జట్టు ముంబై లో ఆడాలా వద్దా అనేది బాల్ ఠాక్రె నిర్ణయం మీద ఆధారపడి ఉండేది అప్పట్లో!BCCI పెద్దలు బాల్ ఠాక్రె అనుమతి కోసం వేచిచూసే వారు అప్పట్లో! బాల్ ఠాక్రె అనుమతి ఇవ్వకపోయినా ముంబై వాన్ఖేడే స్టేడియం లో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి సిద్ధం అయినప్పుడు శివసేన కార్యకర్తలు పిచ్ ని తవ్వేసిన రోజులు ఉన్నాయి!మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా ఎవరు ఉన్నా బాల్ ఠాక్రె ని కలవాలి తప్పనిసరిగా, అది ప్రమాణ స్వీకారం చేసే ముందు అయినా కావొచ్చు లేదా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అయినా కావొచ్చు కానీ బాల్ ఠాక్రె ని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం అన్వాయితీగా ఉండేది!

శ్రీ వాజపేయి గారు, శ్రీ లాల్ కృష్ణ అద్వాని గారు కూడా బాల్ ఠాక్రె ని కలిసేవారు!ఇక గోధ్రా రైలు దుర్ఘటన తరువాత అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీజీ ని బర్తరఫ్ చేయాలని వాజపేయి మీద తీవ్ర ఒత్తిడి వచ్చిన సమయంలో మోడీ ముంబై వచ్చి బాల్ ఠాక్రె ని కలిసి పరిస్థితి వివరించాక బాల్ ఠాక్రె అన్న మాటలు ఏమిటంటే.. చర్య కి ప్రతి చర్య ఉంటుంది అని. అసలు అయోధ్య లో కరసేవ చేసి వస్తున్న ప్రయాణీకులను సజీవ దహనం చేసిన వాళ్ళని ప్రశ్నించకుండా తిరగబడిన ప్రజల గురుంచి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు!

బాల్ ఠాక్రె ఆ రోజు అలా మాట్లాడడం వలన ప్రధాన మీడియా తన జోరు తగ్గించుకుంది! ఎందుకంటే అన్ని మీడియా లకి ముంబై లో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి!అలాంటి శివసేన వైభవం ఈ రోజున ఎలా ఉంది?కేవలం తనకి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న ఆశ వల్ల ఉద్ధవ్ ఠాక్రె తీసుకున్న నిర్ణయం ఈ రోజున ఇలా ఉన్నది!So! తన మీద ఒస్తున్న ఒత్తిడికి తలవంచి ఉద్ధవ్ ఠాక్రె ఇప్పటికిప్పుడు మహా వికాస్ అఘాడి నుండి బయటికి వచ్చినా మళ్ళీ శివసేన కి పూర్వ వైభవం రావడం కల్ల!అందుకే ఉద్ధవ్ ఠాక్రె శివసేన కి చెందిన 15 మంది బీజేపీ లో చేరడానికి సిద్ధంగా ఉన్నామని సాంకేతాలు ఇస్తున్నారు!

అజిత్ పవార్ మాటేమిటి?

నాలుగురోజుల క్రితం శరద్ పవార్ తో సన్నిహితంగా ఉండే వ్యక్తితో అజిత్ పవార్ రహస్యంగా భేటీ అయిన సంగతి ఇంటెలిజెన్స్ పసిగట్టి విషయాన్ని అమిత్ షా కి తెలిపారు. అఫ్కోర్స్! ముంబై నుండి వెలువడే కొన్ని టాబ్లాయిడ్స్ కూడా ఈ విషయం మీద ఊహగానాలు చేస్తూ కధనాలు వండి వార్చాయి!

ఉద్ధవ్ ఠాక్రె కి ఆదిత్య ఠాక్రె…ఏకనాథ్ షిండే కి శ్రీకాంత్ షిండే! సన్ స్ట్రోక్ తప్పదు!ప్రస్తుతానికి మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అంటూ ఏమీ లేకపోయినా భవిష్యత్ లో ఉండబోదు అనే గ్యారంటీ లేదు.

-పార్థసారధి పోట్లూరి

Tags: ajit pawar meet cm eknath shinde devendra fadnaviscm eknath shindedevendra fadnaviseknath shindeeknath shinde devendra fadnaviseknath shinde meets pm modishinde fadnavis meetingshinde fadnavis newsshinde vs fadnavis

Related Posts

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?
అంతర్జాతీయం

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

January 31, 2025
బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ
జాతీయం

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

January 6, 2025
భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం
జాతీయం

సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం

January 4, 2025
180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
జాతీయం

180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..

January 4, 2025
పినరయి స్టేట్మెంట్ వెనక ఉన్న కుట్ర ఇదే!
జాతీయం

పినరయి స్టేట్మెంట్ వెనక ఉన్న కుట్ర ఇదే!

January 4, 2025
Next Post
జనాభా పెరుగుదలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ అసలేమన్నారు?

జనాభా పెరుగుదలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ అసలేమన్నారు?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

Jammu Kashmir Results: విజయపుర నుంచి గంగాజీ విన్: Special Chit Chat with GangaJi | Devika Journalist

Jammu Kashmir Results: విజయపుర నుంచి గంగాజీ విన్: Special Chit Chat with GangaJi | Devika Journalist

October 8, 2024
రూ. 400 కోట్లు చెల్లించిన రామజన్మభూమి ట్రస్ట్  | |Temple trust paid Rs 400 Crores| Devika Journalist

రూ. 400 కోట్లు చెల్లించిన రామజన్మభూమి ట్రస్ట్ | |Temple trust paid Rs 400 Crores| Devika Journalist

March 17, 2025
దిగ్విజయ్ సింగ్ అయితే పుస్తకమే రాయించాడు|| Mumbai Attacks|| Tahawwur Rana| Devika Journalist

దిగ్విజయ్ సింగ్ అయితే పుస్తకమే రాయించాడు|| Mumbai Attacks|| Tahawwur Rana| Devika Journalist

April 13, 2025
రెండు కాళ్లు నరికినా…ఆయన నడక ఆగలేదు|| Sadanandan master story|| Devika Journalist ||

రెండు కాళ్లు నరికినా…ఆయన నడక ఆగలేదు|| Sadanandan master story|| Devika Journalist ||

July 15, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • ఎంత కమీనే గాడు ! || Devika Journalist ||
  • జాతీయవాదులతో మావోయిస్టులు కలిసి పనిచేయాలి | | Devika Journalist | |
  • పిచ్చివేషాల మధ్య సిద్ధాంతం ముసుగేసుకుంది || Devika Journalist ||
  • ది కేరళ స్టోరీ-2 వచ్చేస్తోంది || Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.