ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ అల్లర్ల వెనక అసలు సూత్రధారిగా అనుమానిస్తున్న స్థానిక ఎంపీ జియాఉర్ రెహ్మాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై మరో కేసు నమోదైంది. సంభాల్ కే చెందిన గౌరవ్ పాల్ అనే వ్యక్తిని కారుతో గుద్దించి చంపారంటూ ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారంటూ రెండు రోజుల క్రితమే జియాఉర్ కు అధికారులు నోటీసులు అందజేశారు. ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్మాణం చేపట్టినందుకు భవన నిర్మాణ కార్యకలాపాల నియంత్రణ చట్టం, 1958 ప్రకారం అధికారులు ఎంపీకి నోటీసులుపంపారు. నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు 15రోజుల గడువు ఇచ్చారు. ఆతరువాత జరిమానా విధించడమో లేదా.. భవన నిర్మాణాన్ని కూల్చడమోచేస్తారు.
మరోవైపు కాంగ్రెస్ అనుకూల స్వామీజీగా పేరు పొందిన ఆచార్య ప్రమోద్ కృష్ణ సంభాల్ అల్లర్లపైకీలక వ్యాఖ్యలు చేశారు. సంభాల్ అల్లర్ల సూత్రధారి స్థానిక సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జియాఉర్ రెహ్మానే అంటూ ఆయన పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చగా… నాటి ఘటన వెనక పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హస్తం ఉందని స్వామీ ఆరోపించారు. నవంబర్ 24 నాటి అల్లర్లలో దాదాపు 10 వేలమంది పాల్గొన్నారని…వారంతా ఆ కొద్దిసమయంలోనే అక్కడ ఎలా గుమిగూడారని ఆయన అంటున్నారు. ఎంపీతో పాటు.. అఖిలేష్ కూడా అల్లర్లకు కుట్ర పన్నారని..సర్వే అధికారులు, పోలీసులపై దాడి చేసిన వాళ్లలో బయటినుంచి వచ్చిన ఆపార్టీ కార్యకర్తలున్నాయని ఆయన అంటున్నారు. గతంలో అక్కడ కల్కిధామ్ నిర్మిస్తామని తాను అన్నప్పుడు… అదేజరిగితే మత కల్లోలాలు రేపుతామని నాటి ఎంపీ సఫీకర్ రెహ్మాన్ బుర్రే తనను బెదిరించారని గుర్తుచేశారు.
ఇక సంభాల్ కే చెందిన మరో తాజావార్త. పట్టణంలో ముస్లింలు అధికంగా నివసించే ఓ పురాతన ఆలయంలో శివలింగం, హనుమంతుని విగ్రహంతో పాటు నంది విగ్రహం బయటపడ్డాయి.1978 లో ఈ ఆలయాన్ని మూసేశారు. తాజాగా స్థానిక అధికారుల చొరవతో, వారి ఆధ్వర్యంలో 30 ఏళ్ల తర్వాత ఈ ద్వారాలు తెరుచుకున్నాయి. థానా నఖాసా ప్రాంతంలోని మొహల్లా ఖగ్గు సరాయ్ ప్రాంతంలో ఈ దేవాలయం వుంది. నాడు మతపరమైన అల్లర్ల కారణంగా దేవాలయం మూసేశారు. అప్పట్లో ఈ దేవాయంలో నిత్య పూజలు, అర్చలు, భజనలు, కీర్తనలు రోజూ జరిగేవని ఇంతకాలానికి ఆలయం తెరుచుకోవడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు స్వయంగా ఆలయాన్ని తెరిచారు. పోలీసులే స్వయంగా శుభ్రం చేశారు ఆలయం,ఆ జాగా ఆక్రమణలకు గురవుతోందన్న ప్రజల ఫిర్యాదుతో అధికారులు రంగప్రవేశం చేసి, తిరిగి తెరిచారు. ఈ సమయంలో దేవతా విగ్రహాలతో పాటు ఓ పురాతన బావిని కూడా అధికారులు గుర్తించారు. దాని చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నట్టు జిల్లాఅధికారులు తెలిపారు.