అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. కొన్ని రోజులుగా సూచీలు పెద్దఎత్తున నష్టాల బాట పట్టగా.. ఆ పరంపర కొనసాగుతోంది. ఇక మంగళవారం దేశీమార్కెట్ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి.
ఉదయం ప్రారంభంలోనే నిఫ్టీ 23950 పాయింట్ల దిగువన ప్రారంభం కాగా సెన్సెక్స్ 260 పాయింట్లు నష్టపోయింది. తరువాత క్రమంగా కోలుకుని ట్రేడయ్యాయి. బీఎస్ఈ 1400 పాయింట్లకుపైగా పడిపోయి.. 78,300 మార్కు దిగువకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ కూడా 400 పాయింట్లకుపైగా పడిపోయి 23,900 కి పడిపోయింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ గంట వ్యవధిలో ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా పతనమైంది. రిలయెన్స్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ , టీసీఎస్, యాక్సెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ , టాటామోటార్స్ స్టాక్స్ సైతం దారుణంగా పడిపోతున్నాయి.
అసలైతే కొన్నిరోజులుగా వరుస సెషన్లలో నష్టపోతున్న సూచీలు.. నవంబర్ 1న మూరత్ ట్రేడింగ్ నాడు మాత్రం లాభాలు నమోదు చేశాయి. ఆ ఒక్కరోజే ఆ పరిస్థితి. తిరిగి మళ్లీ సోమవారం నుంచి భారీ పతనం దిశగా సాగుతున్నాయి. ట్రంప్, కమలాలో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠగానే ఉంది. ఫలితం వచ్చిన తరువాత కూడా కొన్ని రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనా. అంతర్దాతీయ రాజకీయ పరిణామాలు, యుద్ధాల వంటి మార్కెట్లో ఒడుదొడుకులకు కారణం అవుతున్నాయి. వీటికి తోడు వడ్డీరేట్లపై ఫెడ్ త్వరలో నిర్ణయం ప్రకటించనుందన్నఅంచనాలతో ముదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు.