అమెరికా ఎన్నికల్లో ఎన్ఐఆర్ లు మళ్లీ సత్తా చాటారు. అమెరికా ప్రతినిధుల సభకు ఈసారి ఆరుగురు ఎన్నికయ్యారు. గతంలో ఉన్న ఐదుగురికి మరొకరు తోడయ్యారు. కాలిఫోర్నియా ఆరో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డాక్టర్ అమిబెరా మరోసారి గెలిచారు. 2013 నుంచి వరుసగా ఆయన అక్కడినుంచి గెలుస్తున్నారు. ఆయనకీ గెలుపు ఏఢోది. ఇక వాషింగ్టన్ ఏడో కాంగ్రెషనల్ కౌంటీ నుంచి ప్రమీలా జయపాల్ గెలుపొందారు. 2017 నుంచి ప్రమీలా గెలుస్తూ వస్తున్నారు. ఇక భారత సంతతికే చెందిన రాజా కృష్ణమూర్తి డెమొక్రటిక్ పార్టీ తరపున ఇల్లినోయీ ఎనిమిదో కౌంటీ నుంచి గెలిచారు. వాషింగ్టన్ నుంచే 8 వ కౌంటీ నుంచి రో ఖన్నా గెలిచారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థే అయిన అనితా చెన్ పై ఆయన విజయం సాధించారు. మిషిగన్ లోని 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా దానేదార్ రెండోసారి గెలిచారు. అరిజోనా నుంచి డాక్టర్ అమిష్ షా కూడా వరసగా నాలుగోసారి గెలిచారు.