ఎలన్ మస్క్ …ట్రంప్ తరువాత ఎక్కువగా వినిపిస్తున్నపేరు. ట్రంప్ ను అన్నీతానై గెలిపించినవాడు. నాలుగేళ్ల క్రితం ట్రంప్ ఓటమికికారణమైన వేదికే ఇప్పుడు అతని గెలుపుకుకారణమైంది. ఆ వేదికను సొంతం చేసుకుని మరీ ట్రంప్ ను గెలిపించాడు ఎలన్ మస్క్. రెండేళ్ల క్రితం ట్విట్టర్ ను కొన్నప్పుడు అందరూ మస్క్ ను పిచ్చోడిలా చూశారు.టెస్లా అధినేతగా అప్పటికే పేరుమోసిన బిజినెస్ మన్. 44 బిలియన్లు డాలర్లుపెట్టి ట్విట్టర్ ను కొంటున్నాడేంటీ వీడికేమన్నాపిచ్చా అన్నారు. అవును వెర్రోడినే అన్నట్టు విమర్శకులకు తగ్గట్టుగానే తనూ బదులిచ్చాడు. లెట్ ద సింక్ అంటూ సింక్ పట్టుకుని ట్విట్టర్ ఆఫీసులోకి అడుగుపెట్టాడు. నాటి విమర్శకులే ఇప్పుడు మస్క్ ను వేనోళ్ల పొగుడుతున్నారు. ఇప్పుడు మస్క్ వ్యూహం అందరికీ అర్థం అవుతోంది.
ప్రపంచ దేశాల మీద ట్రెడిషనల్ మీడియా డామినేషన్ ఎక్కువగా ఉండేది. ఇప్పటికీ ఉంది. అప్పుడు ఫేస్ బుక్ గూగుల్, ఇన్ స్టాగ్రామ్ , ట్విట్టర్ వంటి సోషల్మీడియా ప్లాట్ ఫామ్స్ అన్నీ ఒక ఎకో సిస్టంతో నడిచేవి. జార్జ్ సోరస్ వంటివారికి సపోర్టుగా పని చేసేవి. పైకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. కానీ ఆఫ్రీడమ్ కేవలం లెఫ్ట్ లిబరల్ గ్రూపులకే. ఇదేంటని ప్రశ్నించే ధైర్యంకూడా ఎవరూ చేసేవారు కాదు. చివరకు ప్రపంచదేశాల అగ్రనేతలే చూస్తూ ఊరుకుండిపోయే పరిస్థితి. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ప్రశ్నించినందుకు ట్రంప్ ను బ్యాన్ చేసింది ట్విట్టర్. ఆయన అకౌంట్ ను బ్లాక్ చేసేసింది. అంటే ఎంత పవర్ ఫుల్ గా ట్విట్టర్ ఓ గ్రూప్ కు పనిచేసిందో అర్థంచేసుకోవచ్చు. దాన్ని చేదించాడు మస్క్… 44బిలియన్ డాలర్లు అంటే 3లక్షల 74 వేల కోట్లు పెట్టికొనేశాడు. ట్విట్టర్ ను 2006లో జాక్ డోర్నే స్టార్ట్ చేశాడు. సౌదీకి చెందిన వ్యాపారవేత్తలెవరో…మరికొందరూ ఇన్వెస్టర్లుండేవారు. అన్ని బిలియన్లు డాలర్లతోట్విట్టర్ ను కొన్న పిచ్చోడు మస్క్ అన్నవాళ్లు బాప్రే బ్రిలియంట్ మైండ్ మస్క్ ది అంటున్నారిప్పుడు.
మొదట్లోఎన్నోసవాళ్లు..ఓ రెండుమూనెలలు ఇబ్బంది పడ్డాడు. హేళనచేశారు, విమర్శించారు. ఒక్కోసారి పట్టించుకుని బదులిచ్చాడు. ఒక్కోసారి ఎవర్నీ లెక్కేచేయకుండా ముందుకెళ్లాడు. ముందు ఉద్యోగులకు ఉద్వాసన పలికాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డెమొక్రాట్లకే కాదు రిపబ్లికన్లకూ ఉంటుంది…అందరికీ ఉంటుంది అనేలా ప్లాట్ ఫాంను మార్చేశాడు. మరి ఆదాయం రావాలికదా బ్లూటిక్ ను అమ్మకానికి పెట్టాడు. అంతకుముందు కోటీశ్వరులు, గుర్తింపు పొందిన సెలబ్రిటీలకు మాత్రమే ప్రత్యేక గుర్తింపుగా బ్లూటిక్ ఉండేది. ఇక భారత్ లో అయితే చెప్పక్కర్లేదు.ట్విట్టర్ ఇండియాలో అప్పుడు లెఫ్ట్ లిబరర్స్ దే హవా. ట్విట్టర్ పూర్తిగా వాళ్ల కంట్రోల్లోనే ఉండేది. నెలకింత ఇవ్వండి, తరువాత మీఇష్టం, మీ స్వేచ్ఛఅనేశాడు. వీడియోలా, ఆడియోలా మీ కంటెంట్ మీఇష్టం. రీచ్ బాగుండి వ్యూస్ వస్తే ఆ రెవెన్యూ మీకు కూడా షేర్ చేస్తా అని ఆఫర్ ఇచ్చాడు. యాడ్స్ వస్తే కంపెనీకి రెవెన్యూ, వాడుతున్న జనానికీ ఆదాయం. ఇప్పుడు ట్విట్టర్లో అందరికీ ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఉంది. అలాగే ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టే స్వేచ్ఛ అందరికీ ఇచ్చాడు మస్క్. మెయిన్ స్టీమ్ మీడియా చెప్పేదే, రాసేదే నిజం కాదు.. దాన్నిఎవరైనా ప్రశ్నించవచ్చు, సరిచేయవచ్చు అంటూ రీడర్స్ కాంటెక్స్ట్ పెట్టాడు. ఒక సమాచారం తప్పైతే దాన్నిచాలెంజ్ చేయవచ్చు.
ఇక తాజాగా అమెరికా ఎన్నికల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం డెమొక్రటిక్ పార్టీకే సపోర్ట్. కమలాకు ప్రచారం, ఒబామాను ఎత్తుకోవడం, బైడెన్ ను ఆహా ఓహో అనడం. ట్రంప్ ఏం మాట్లాడినా నెగెటివ్ గా చూపడం. అప్పుడే మస్క్ ట్విట్టర్తో ముందుకు వచ్చేశాడు. ఏం జరిగిందో అందరం చూశాం. ట్రెడిషనల్ మీడియాకు అల్టర్నేట్ గా వచ్చిన ట్విట్టర్ ఎంత పనిచేసింది కదా. మరి రెండెళ్ల క్రితం మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకోవడం వెనక పెద్దవ్యూహమే ఉంది. అమెరికాలో వ్యాపార వేత్తలు రాజకీయనాయకులు, పార్టీలకు మద్దతుగా నిలవడం, నిధులు సమకూర్చడం కొత్తేం కాదు. కానీ మస్క్ మరీ ఓపెన్ అయిపోయాడు. మనం అంటాంకదా కాలికి బలపం కట్టుకుని తిరిగాడు అని అచ్చంగా అలాగే తిరిగాడు ట్రంప్ కోసం మస్క్. ప్రతి స్టేట్ తిరిగి ప్రచారం చేశాడు.
మస్క్ పెట్టుబడిదారుమాత్రమే కాదు. సక్సెస్ ఫుల్ బిజినెస్ మన్ గా అక్కడి యూత్ కు ఇన్ స్పిరేషన్. మస్క్ ఇన్నోవేషన్ అద్భుతాలు, అమోఘం అంటారు. ఇక ఓవర్ లిబరలిజాన్ని మస్క్ వ్యతిరేకించాడు. ఆడమగా కాదు వేరే అని చెప్పండి అని డెమొక్రాట్లు చిన్న పిల్లలకూ నూరిపోస్తుంటే వాళ్లని తప్పుబట్టాడు. లింగమార్పిడి వంటివాటిని ప్రోత్సహిస్తూ అమెరికా సొసైటీని డెమొక్రాట్లు నాశనం చేస్తున్నారని విరుచుకుపడ్డాడు. వోకిజం పేరుతో పెరిగిపోతున్న విచ్చలవిడి, విపరీత ధోరణుల్ని మస్క్ ఎప్పటినుంచో ప్రశ్నిస్తూవస్తున్నాడు. దీంతో ఒక గ్రూప్ఆయనకు బాగా దగ్గరైంది, ఓన్ చేసేసుకుంది. ఇక ఇల్లీగల్ మైగ్రేషన్ నూ వ్యతిరేకించాడు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేస్తూ ట్రంప్ గోడలునిర్మిస్తే… బైడెన్ తలుపులు బార్లా తెరిచాడని..ఈ ధోరణి భవిష్యత్ అమెరికాకు ప్రమాదకరమని ట్విట్టర్ వేదిగ్గా హెచ్చరించాడు. ఎంతో యాక్టివ్ గా ప్రచారంలో పాల్గొన్న మస్క్.. స్వింగ్ స్టేట్స్ పై ఓ కన్నేశాడు. గతంలో అక్కడ పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగిన ఆరోపణలున్నాయి. అలాంటి స్వింగ్ స్టేట్స్ ను ట్రంప్ స్వీప్ చేయడం వెనక మస్క్, ట్విట్టర్ పాత్ర ఎవరూ కాదనలేనిది. ఎప్పటికప్పుడు ట్విట్టర్లో అవేర్ చేస్తూ పోలింగ్ అక్రమాలను అడ్డుకుంది మస్క్ అండ్ టీం. విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం గురించి అడిగితే అది అసలు చర్చనీయాంశమే కాదని కమలా హ్యారిస్ అంటే ఏకిపడేశాడు మస్క్ వరుస పోస్టులతో. అసలైతే మొదటిసారి ట్రంప్ పోటీచేసినప్పుడు వ్యాపారవేత్తలు పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మాత్రం చాలామంది అమెరికన్ బిలియనీర్లు మద్దతుగా నిలిచారు. తను ప్రెసిడెంట్ కాగానే బిజినెస్ మన్ లకు టాక్స్ తగ్గించాడు. వ్యాపారవేత్తలమీద విపరీతమైన ట్యాక్సులు వేసే తీరేమో డెమొక్రాట్లది.
ట్రంప్ కూడా వోకిజానికి వ్యతిరేకం. అలా కూడా ఇద్దరూ కలిశారని చెప్పవచ్చు. అంతే కాదు ఇద్దరూ ఒకేరంగంలో సుదీర్ఘకాలం ఉన్నవాళ్లు. టెస్లా అధినేతగా వ్యాపారంలోకి మస్క్ అడుగుపడితే… రియల్ ఎస్టేట్ రంగాన్ని శాసించినవాడు ట్రంప్. డెమొక్రాట్ల తీరను, లెఫ్ట్ లిబరల్స్ విధానాల్ని ఎక్కడిక్కడ తప్పుపడుతూ ఎండగట్టారు ఇద్దరూకలిసి. విజయంసాధించారు కూడా.
ఇక్కడ ఇంకో విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కిందటి ఎన్నికల్లో అమెరికా మీడియా మొత్తం ట్రంప్ ను టార్గెట్ చేసింది. సోషల్మీడియా సైతం డెమొక్రట్లకే మూకుమ్మడి మద్దతు. కానీ ఈసారి ఎలన్ మస్క్ మద్దతుతో, అండాదండతో ట్రంప్ తనపై దాడిని తిప్పికొట్టాడు. సోషల్మీడియా సపోర్ట్ ఉంటే…సంప్రదాయమీడియా అవసరమే లేదని..దాని పనైపోయందనే విషయాన్ని చెప్పగలిగాడు. అచ్చంగా అలాగే మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే 2012 నుంచే జాతీయ మీడియా మొత్తం ఆయన్ని టార్గెట్ చేసింది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలకు రోజూ ఆయనను తిట్టడమే పని. ఆ సమయంలోనే ఆల్టర్నేట్ గా సోషల్మీడియాను ఎంచుకున్నారు మోదీ. టెక్నాలజీ, సోషల్మీడియా అప్పుడప్పుడే విస్తరిస్తున్న సమయంలో అప్పట్లోమోదీ వాడుకున్నంత ఎవరూ వాడుకోలేదని చెప్పవచ్చు. ఆయన్నిప్రధాని అభ్యర్థిగాభారతీయ జనతాపార్టీ ప్రకటించిన తరువాత మీడియా మరింతదాడి పెంచింది. సోషల్మీడియా ద్వారా ఆ దాడిని తిప్పికొట్టింది మోదీఅండ్ టీం. ఆ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకుని భారత ప్రధాని అయ్యారు మోదీ. ఇప్పుడు అమెరికాలో జరిగిందే పది పన్నెండేళ్ల క్రితంభారత్ లో జరిగిందన్నమాట.