• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Friday, March 6, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home ప్రాంతీయం

ఓటీటీలో కాదు థియేటర్ కు వెళ్లిచూడాల్సిందే- నక్సలైట్లకు ఎదురు నిలిచి పోరాడిన దేశభక్తుడి కథ జితేందర్ రెడ్డి

Devika by Devika
November 9, 2024
in ప్రాంతీయం, సినిమా
0
ఓటీటీలో కాదు థియేటర్ కు వెళ్లిచూడాల్సిందే- నక్సలైట్లకు ఎదురు నిలిచి పోరాడిన దేశభక్తుడి కథ జితేందర్ రెడ్డి
0
SHARES
15
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

భూమి హక్కులు మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడడానికి అని వామపక్ష భావజాలం నుండి స్ఫూర్తి పొంది, తీవ్ర వాద భావజాలం తో 1970-80లలో నక్సల్ ఉద్యమం ఊపు అందుకుంది. భరత రాజ్యాంగం పై గౌరవం లేదు అంటూ, చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని అరణ్యప్రాంతాల్లోనూ, వాటికి దగ్గర ఉండే గ్రామీణ ప్రాంతాలలోనూ వీరు సమాంతర ప్రభుత్వాన్ని దశాబ్దాలు పాటు నడిపారు. తమ హింసా మార్గం తో సామాన్య ప్రజలను భయపెడుతూ వారిని గుప్పెట్లో పెట్టుకున్నారు.

వారికి బాగా పట్టు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వాలచే ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు వేయడం గానీ, విద్యుత్ స్తంభాలు లైన్లు వేయడం గానీ, స్కూల్స్ ఆసుపత్రులు మొదలగునవి కట్టడం వంటి పనులన్నింటిని అడ్డుకునే వారు. ఇంజినీర్లను పని వాళ్ళను అడ్డుకోవడం లేదా చెరపట్టడం, పనుల కోసం అని తెచ్చిన మిషన్లు, పరికరాలను ధ్వంసం చెయడం లేదా తగలపెట్టడం చేస్తూ వుండేవారు.

అయితే, గత మూడు దశాబ్దాలలో నక్సల్ సిద్దాంతం ఎంత గొప్పదో అది సామాన్య ప్రజలకు ఎలా మేలు చేస్తోందో, హక్కులపై ఎలా పోరాటాలు చేస్తోందో అని చూపిస్తూ వీరిని హీరోలుగా చిత్రీకరిస్తూ బోలెడు సినిమాలు చాలా భాషల్లో వచ్చాయి.ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో అయితే ఈ సబ్జెక్టు ఆధారంగా నక్సలైట్లను హీరోలుగా చిత్రీకరిస్తూ అనేక సినిమాలు వచ్చాయి.

కానీ, నాణానికి రెండో వైపు ఉన్నట్లే ఇదే నక్సల్స్ తమ మాట వినని గ్రామీణులను బెదిరించడం, కొందరిని ఇంఫార్మర్స్ గా గుర్తించి ఏ ప్రభుత్వ విచారణ లేకుండా వాళ్లే చంపేసి శిక్షలు విధించడం, వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లు ను బెదిరించి బలవంతపు చందాలు వసూలు చేయడం, ఉద్యమం లోకి వచ్చిన వారు ఆ పద్ధతులు నచ్చక తిరిగి సాధారణ జన స్రవంతి లోకి వెళ్ళిపోతాం అంటే బెదిరించి అడ్డగించడం, ఉద్యమం లోకి వచ్చిన యువతులను వేధింపులకు గురిచేయడం వంటి పలు ఆరోపణలు వారి మీద వచ్చాయి.

ముఖ్యంగా సమానత్వం, హక్కులు అంటూ 24 గంటలూ చెప్పే ఇదే నక్సల్స్ తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వ్యక్తులను భౌతికంగా అంతం చేయడం అనేది ముఖ్య కార్యక్రమంగా పెట్టుకుని కొన్ని వందల మంది దారుణ హత్యలకు కారకులుగా నిలిచారు.

ఇలా నక్సల్స్ సిద్ధాంతాన్ని వారి హింసా మార్గానికి వ్యతిరేకంగా గళం ఎత్తి పోరాటం చేసి ఆ మార్గం లో అసువులు బాసిన ఒక దేశ భక్త విద్యార్థి నాయకుడు “జితేందర్ రెడ్డి”

ఈ జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి హిట్ సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వంలో ఈ “జితేందర్ రెడ్డి” సినిమా ఈ రోజు థియేటర్ల లో విడుదల అయింది.

ఇంతకీ ఎవరీ జితేందర్ రెడ్డి?

పూర్వపు కరీంనగర్ జిల్లాలో జగిత్యాలలో ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఒక సాధారణ యువకుడు. వారి కుటుంబం కి మొదటి నుండి దేశ భక్తి, హిందూ ధర్మ రక్షణ ప్రేరేపించే RSS సంస్థతో చక్కటి సంబంధాలు ఉన్నాయి.

అటువంటి వాతావరణం లో పెరిగిన జితేంద్రకు విద్యార్థిగా స్కూల్ లోనూ కాలేజీలోనూ ఈ నక్సల్స్ సిద్దాంత ప్రభావం గల వాళ్ళు తారసపడటారు. భూమి హక్కులు మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడడానికి అని మొదలైన నక్సల్స్ తమ అసలు కారణం నుండి దారి తప్పుకున్నారని జితేందర్ గ్రహించి వారిని ఎదిరించడం మొదలుపెడతాడు.

నక్సలిజం వైపు వెళ్లవద్దు భవిష్యత్ పాడుచేసుకోవద్దు అంటూ విద్యార్థులను యువత ను చైతన్య పరుస్తూ ఉంటాడు.

ఈ సినిమాలో మొదటి భాగం జితేందర్ రెడ్డి బాల్యం, కాలేజీలో అప్పటికే బాగా బలంగా ఉన్న నక్సల్ ప్రభావిత PDSU విద్యార్థి యూనియన్ ను ఎదిరించి ABVP విద్యార్థి నాయకుడిగా ఎలా ఎదిగి కాలేజి ఎన్నికల్లో ఎలా గెలిచాడు వంటి అంశాలు చాలా చక్కగా చూపించారు.

రెండో భాగంలో జితేందర్ రెడ్డి వర్గం , నక్సల్స్ మధ్య తరచు ఘర్షణలు, తమ ఉద్యమ వ్యాప్తి కి అడ్డు తగులుతున్నారు అని జితేందర్ రెడ్డి వర్గ విద్యార్థుల ను వరుసగా నక్సల్స్ దారుణంగా చంపడం, జితేందర్ రెడ్డి రాజకీయ ప్రవేశం, సీనియర్ ఎన్టిఆర్ ను కలవడం, వరంగల్ లో అప్పట్లో వాజపేయి గారి సభ నిర్వహించడం వంటి పలు అంశాలు చూపించారు.

ఈ ఒక్క యువకుడు జితేందర్ రెడ్డి అంటే ఆ కాలంలో ఆ ప్రాంతంలో నక్సల్స్ ఎంత భయపడి అతని మీద ద్వేషం పెంచుకున్నారు అనేది అతని హత్య నిరూపిస్తుంది. ఒక వ్యక్తిని చంపడానికి సరిగ్గా పేలుస్తే ఒక బులెట్ సరిపోయే దానికి, మళ్లీ ఎక్కడ బ్రతికి తమకు ఏకు మేకవుతాడో అనే భయంతోనే ఏమో జితేందర్ రెడ్డి పై 72 బుల్లెట్లు వర్షం లా కురిపించి అతని శరీరాన్ని జల్లెడ చేశారు అంటే వారిలో జితేందర్ రెడ్డి ఎంత వణుకు పుట్టించాడో అర్ధం అవుతుంది.

తరచుగా వామపక్ష, ఉదారవాద భావజాలంతో నిండిపోయిన కథనాలను పెద్ద తెరపై చూసిన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా రెండో వైపు కోణం చూపించే ప్రయత్నం నిజాయితీగా చేసింది. ఇప్పటి వరకు తెలుగు సినిమా నక్సలైట్లను పాజిటివ్‌గా మాత్రమే చిత్రీకరిస్తే, నక్సలిజంలోని చీకటి వాస్తవాలను ఆవిష్కరించడంలో ఈ జితేందర్ రెడ్డి సినిమా సాహసోపేతమైన ప్రయత్నం చేసింది.

జితేందర్ రెడ్డి పాత్ర చేసిన రాకేష్ వర్రే చాలా బాగా చేసాడు. అందరూ దయచేసి థియేటర్ కి వెళ్లి చూసి ఈ సినిమాను ప్రోత్సహించండి. జాతీయభావజాలం, దేశభక్తి కల అందరికి ఈ సినిమా నచ్చుతుంది. క్లైమాక్స్ తప్పక కంటతడి తెప్పిస్తుంది.

….చాడా శాస్త్రి…

Tags: jithendar reddy moviejithender reddy moviejithender reddy movie glimpsejithender reddy movie official teaserjithender reddy movie release datejithender reddy movie reviewjithender reddy movie songsjithender reddy movie teamjithender reddy movie teaserjithender reddy movie trailerjithendhar reddy moviejithendra reddy movie release daterakesh varre new movie

Related Posts

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ
జాతీయం

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024
POW పిటిషన్లపై సుప్రీం విచారణ-నాలుగువారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం
అంతర్జాతీయం

POW పిటిషన్లపై సుప్రీం విచారణ-నాలుగువారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం

December 12, 2024
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం-జమిలికి 32 పార్టీల అంగీకారం, 15 పార్టీల వ్యతిరేకం
జాతీయం

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం-జమిలికి 32 పార్టీల అంగీకారం, 15 పార్టీల వ్యతిరేకం

December 12, 2024
క్రిస్మస్ పేరుతో 120 మిలియన్ల చెట్లు నరికివేస్తున్నారు తెలుసా?
అంతర్జాతీయం

క్రిస్మస్ పేరుతో 120 మిలియన్ల చెట్లు నరికివేస్తున్నారు తెలుసా?

December 9, 2024
కసబ్ విషయంలో భారత్ అలా,చిన్మయ్ విషయంలో బంగ్లాదేశ్ ఇలా:ప్రపంచం మొత్తం స్పందించాలి-ఎక్స్ వేదిగ్గా స్వరం పెంచిన పవన్ కల్యాణ్
అంతర్జాతీయం

కసబ్ విషయంలో భారత్ అలా,చిన్మయ్ విషయంలో బంగ్లాదేశ్ ఇలా:ప్రపంచం మొత్తం స్పందించాలి-ఎక్స్ వేదిగ్గా స్వరం పెంచిన పవన్ కల్యాణ్

December 7, 2024
Next Post
అమెరికాలో ఇంత దారుణమా..? | Democracy in America & India | Trump & Modi | Devika Journalist

అమెరికాలో ఇంత దారుణమా..? | Democracy in America & India | Trump & Modi | Devika Journalist

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

మునుపటిలా కాదు- ఇది నయాభారత్ | Devika Journalist

మునుపటిలా కాదు- ఇది నయాభారత్ | Devika Journalist

October 31, 2025
దేశ భక్తులను దేశద్రోహులుగా మార్చిన ఘనులు | DELHI SIKH RIOTS | Devika Journalist

దేశ భక్తులను దేశద్రోహులుగా మార్చిన ఘనులు | DELHI SIKH RIOTS | Devika Journalist

February 15, 2025
భయం అక్కర్లేదు-ప్రతీకారం తీర్చుకుందాం||Pahalgam Attack|| Devika Journalist

భయం అక్కర్లేదు-ప్రతీకారం తీర్చుకుందాం||Pahalgam Attack|| Devika Journalist

April 23, 2025
ఇంజినీరింగ్ అద్భుతం- ఆ మెట్రో లైన్ | Devika Journalist

ఇంజినీరింగ్ అద్భుతం- ఆ మెట్రో లైన్ | Devika Journalist

October 18, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • ఎంత కమీనే గాడు ! || Devika Journalist ||
  • జాతీయవాదులతో మావోయిస్టులు కలిసి పనిచేయాలి | | Devika Journalist | |
  • పిచ్చివేషాల మధ్య సిద్ధాంతం ముసుగేసుకుంది || Devika Journalist ||
  • ది కేరళ స్టోరీ-2 వచ్చేస్తోంది || Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.