
నిన్నామొన్నా కెనెడాలో హిందువులను, హిందూ ఆలయాలను లక్ష్యంగాచేసుకున్నఖలిస్తానీలు ఇప్పుడు అయోధ్యఆలయాన్ని టార్గెట్ చేశారు. రామమందిరంతో పాటు భారత్ లోని ఆలయాలను ధ్వంసం చేస్తామని ఖలిస్తాన్ వేర్పాటువాదనాయకుడు గురు పత్వంత్ సింగ్ పన్నూ బెదిరించాడు.ఈమేరకు సిఖ్స్ ఫర్ జస్టిస్ ఓ వీడియో సైతం రిలీజ్ చేశాసింది.నవంబర్ 16, 17 తేదీల్లో ఆలయాల్లో బాంబులు పేలుతాయని హెచ్చరించాడు.ఇటీవలే కెనడా బ్రాంప్టన్ లోని హిందూసభ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదాడులు దాడి చేసి అక్కడ ఉన్న హిందూభక్తులను ఆయుధాలతో తరిమితరిమి కొట్టిన సంగతి తెలిసిందే. అయితే భారత్ లోని ఆలయాలే తమ టార్గెట్ అంటూ పన్నూ బ్రాంప్టన్ నుంచే ఈ వీడియో రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఎయిరిండియా విమానంలో బాంబు పేలుస్తాననీ పన్నూ వీడియో రిలీజ్ చేశాడు. పన్నూ హెచ్చరికలతో భారత్ లోని హిందువులు, కెనడాలోని హిందువులూ ఆందోళన చెందుతున్నారు.














