
నందిని బ్రాండ్ పేరుతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. ఈ నందిని బ్రాండ్ ఒక్కటే బెంగుళూరువాసుల పాల అవసరాలలో 70% వరకు తీరుస్తోంది. ఈ సంస్థ నెయ్యి నాణ్యత చాలా బాగుంటోంది అని తిరుమల దేవస్థానం కూడా కొనుగోలు చేస్తోంది.
గతేడాది కర్ణాటక లో బిజెపి ప్రభుత్వం ఉన్న కాలంలో గుజరాత్ మిల్క్ ఫెడరేషన్ కి చెందిన అమూల్ బ్రాండ్ కర్ణాటకలో తమ పాలు, పెరుగు ఉత్పత్తులు అమ్ముదామని ప్రయత్నించింది.అయితే అమూల్ బ్రాండ్ కర్ణాటక రాష్ట్రంలో కి వస్తే కర్ణాటక సొంత బ్రాండ్ అయిన నందిని సేల్స్ పడిపోతాయని కర్ణాటక రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రతిపక్ష నేతలు రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున గొడవ చేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ అమూల్ సమస్య మూలన పడింది.
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎంకే జగదీష్ పనిచేస్తున్నారు. ఈయన వచ్చిన తర్వాత T20 క్రికెట్ మ్యాచ్ లు, కబడ్డీ మ్యాచ్ లు వంటి స్పాన్సర్ చేసి నందిని బ్రాండ్ ని బాగా పాపులర్ చేశారు. దీన్ని ఢిల్లీ దుబాయ్ వరకు తీసుకెళ్లారు. జగదీష్ బాగా పనిచేస్తూ నందిని బ్రాండ్ అమ్మకాలు పెంచారని ప్రశంసలు కూడా అందుకున్నారు. మొన్న డిసెంబర్ మొదటి వారంలో ఈ జగదీష్ ను అకస్మాత్తుగా మిల్క్ ఫెడరేషన్ మేనేజర్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు.

ఇంత బాగా పని చేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ ను ఎందుకు తొలగించవలసి వచ్చింది అంటే దాని వెనక వేరే కథనం వినిపిస్తోంది. ఆ కథనం ప్రకారం జగదీష్ గారు నందిని బ్రాండ్ అమ్మకాలు పెంచడానికి అని చెప్పి నందిని బ్రాండ్ పేరు మీద రెడీమేడ్ ఇడ్లీ దోశ పిండి అమ్ముదామని ఆలోచన చేసి చేసి జనవరి నుంచి దాని అమ్మకాలు ప్రారంభిద్దాం అని అనుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ, ఇలా చేయడం ఫెడరేషన్ చైర్మన్, ముఖ్యమంత్రి సన్నిహితుడు అయిన భీమా నాయక్ కి నచ్చలేదు. తాను చైర్మన్ గా ఉన్న KMF అమ్మకాలు లాభాలు పెంచే ఈ రెడీ మేడ్ ఇడ్లి దోస పిండి అమ్మకాలను ఎందుకు వ్యతిరేకించారు భీమా నాయక్? ఎందుకంటే!
ప్రస్తుతం ఐడి బ్రాండ్ అనే పేరుతో ఇదే కర్ణాటక కు చెందిన పి.సి. ముస్తఫా కి చెందిన ID ఫ్రెష్ ఫుడ్స్ అనే కంపెనీ రెడీమేడ్ ఇడ్లీ దోశ పిండి అమ్మకాలలో 50% వరకు అమ్మకాలు చేజిక్కించుకుంది. బాగా పేరున్న, మంచి నెట్ వర్క్ ఉన్న నందిని బ్రాండ్ పేరు తో ఇడ్లి దోశ రెడీమేడ్ పిండి అమ్మకాలు ప్రారంభిస్తే తమ వ్యాపారం దెబ్బతింటుంది అని ఈ ముస్తాఫా కాంగ్రెస్ నాయకుల మీద వత్తిడి తెచ్చి జగదీష్ ని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుండి తీయించి వేసాడు అని కర్ణాటకలో వార్తలు హల్ చెల్ చేస్తున్నాయి.
ఎందుకు ఈ వార్తలకు బలం చేకూరుతోంది అంటే ఫెడరేషన్ చైర్మన్ భీమా నాయక్ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ని తొలగించడమే కాకుండా రెడీ మేడ్ ఇడ్లి దోస పిండి తయారీ అమ్మకం ప్రయత్నాలను శాశ్వతంగా నిలిపివేయమని ఆదేశాలు ఇచ్చారట.
అంటే, గుజరాత్ రాష్ట్ర రైతుల కోపరేటివ్ ఫెడరేషన్ కి చెందిన అమూల్ కర్ణాటక లో వ్యాపారం చేస్తే కర్ణాటక ఫెడరేషన్ కి నష్టం వస్తుంది అని గోల చేసిన అదే కాంగ్రెస్ ఒక ప్రైవేట్ సంస్థ లాభం కోసమో లేదా ఆ సంస్థ మైనారిటీ వర్గానికి చెందింది కాబట్టి వాళ్ళ ఓట్ల కోసమో కర్ణాటక పాల ఉత్పత్తి దారుల ఫెడరేషన్ అభివృద్ధి కి తూట్లు పొడిచింది అన్నమాట.
ఇదీ కాంగ్రెస్ అసలు స్వరూపం.
…చాడా శాస్త్రి…
















