ఆదాని గ్రూప్ లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చి ఆదాని గ్రూప్ షేర్ల ధరల భారీ పతనానికి, దాని ద్వారా భారత స్టాక్ మార్కెట్ భారీ పతనానికి కారణం అయిన షార్ట్-సెల్లింగ్ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన US పెట్టుబడి పరిశోధన సంస్థ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ అధికారికంగా మూసి వేయబడుతున్నట్లు
దాని వ్యవస్థాపకుడు నేట్ ఆండర్సన్ జనవరి 15న ప్రకటించారు.
ఆండర్సన్ ఒక ప్రకటన చేస్తూ “నేను గత సంవత్సరం చివరి నుండి అంటే (అమెరికా అధ్యక్ష ఫలితాలు వెలువడిన టైం నుండి అని గుర్తు పెట్టుకోండి) ఈ విషయం నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు మా బృంద సభ్యుల తో పంచుకున్నాను. చివరకు ‘హిండెన్‌బర్గ్ పరిశోధనన సంస్థ’ ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాను.” అని చెప్పాడు.
ప్రస్తుతం చేతిలో ఉన్న పరిశోధనాత్మక రిపోర్ట్స్ పూర్తి చేసిన తర్వాత కార్యకలాపాలను శాశ్వతంగా ముగిస్తామని ఆయన వివరించారు.
అయితే, హిండెన్‌బర్గ్ సంస్థ ఇలా అకస్మాత్తుగా మూసివేత ప్రకటించడం పట్ల రాజకీయ కారణాలు ఉండవచ్చు అని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
ఎందుకంటే, ఈ హిండెన్‌బర్గ్ సంస్థ వంటివి డీప్ స్టేట్ అంటే జార్జి సోరోస్ వంటి వారి చేతిలో కీలుబొమ్మలు. ఈ సోరోస్ కి కూడా అమెరికా డెమొక్రటిక్ పార్టీ, దానికి చెందిన అమెరికా ప్రెసిడెంట్ బీడెన్ ప్రభుత్వ ప్రత్యక్ష మద్దతు ఉంది. బీడెన్ ప్రభుత్వం ఈ మధ్యనే జార్జి సోరోస్ కి ‘మానవత్వ విలువలు కాపాడుతున్నందుకు ‘ప్రెసిడెంట్ మెడల్’ బహుకరించారు. దీనిపై అమెరికా ప్రజలు ఇతర దేశాల ప్రజలు సోషల్ మీడియాలో తీవ్ర నిరసన తెలియచేశారు.
‘X’ (అంటే పాత ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ అయితే ‘అసలు ప్రపంచ మానవాళికే జార్జి సోరోస్ ముప్పు. అతడు ప్రపంచంలో గల నాగరికతలను ధ్వంసం చేయడానికి పూనుకున్నాడు. అటువంటి వాడికి ఈ అవార్డ్ ఇవ్వడం ఏమిటీ’ అని ఘాటుగా స్పందించాడు.
బీడెన్ ప్రభుత్వం పోయి మరొక వారం రోజుల్లో ట్రంప్ మళ్లీ అధికారంలోకి రాబోతున్నాడు. ట్రంప్ కి ఈ సొరోస్ ముఠా అంటే పడదు. ఇటువంటి పరిస్థితుల్లో ‘హౌస్ జ్యుడిషియరీ కమిటీలో’ భాగమైన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు, అదానీ మరియు అతని కంపెనీలకు సంబంధించిన అన్ని పత్రాలు మరియు కమ్యూనికేషన్‌లను భద్రపరచమని న్యాయ శాఖను అభ్యర్థించాడు. ఇలా జరిగిన కొద్ది రోజుల వెంటనే అండర్సన్ తమ సంస్థ హిండెన్ బర్గ్ ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాడు. అందుకే ఈ ప్రకటన సమయం ప్రత్యేకంగా ఆశ్చర్య కరమైనది అని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
అధ్యక్షుడు బిడెన్ పదవీకాలం ముగిసి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు రాజకీయంగా సున్నితంగా ఉన్న ఈ సమయంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేయడానికి గల ఏ ఒక్క బలమైన కారణాన్ని అండర్సన్ పేర్కొనలేదు.
అంతర్జాతీయ రాజకీయ కారణాలతో ఆదాని కి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ కి మోడీ ద్వేషులు విపరీతమైన ప్రచారం కల్పించి మన స్టాక్ మార్కెట్ మదుపుదారులకు భారీ నష్టం కలుగచేశారు.
అమెరికా లో ఇప్పుడు ప్రభుత్వం మారుతున్న సమయంలోనే హిండెన్ బర్గ్ సంస్థ మూసివేస్తున్నట్లు ప్రకటించడం అంటే ఆదాని పై రిపోర్ట్ రాజకీయ ప్రేరేపితం అని నిర్ధారణ అయింది.
మోదీని అధికారంలో నుండి దింపే అంతర్జాతీయ రాజకీయ కుట్రలో భాగంగా, భారత్ లో కాంగ్రెస్ రాహుల్ గాంధీ సహకారంతో 2024 లోక్ సభ ఎన్నికల ముందు భారత్ స్టాక్ మార్కెట్ పతనం తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ ను దెబ్బతీయడానికి, భారత్ స్టాక్ మార్కెట్ లో భారీ విలువ ఉన్న ఆదాని గ్రూప్ పై హిండెన్ బర్గ్ రిపోర్ట్ ద్వారా దాడి చేశారు. ఈ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుండి మేం అంతా ఈ అనుమానమే వ్యక్తపరుస్తూ వస్తున్నాం.
ఈ రిపోర్ట్ 2023 జనవరి 24 అర్ధరాత్రి బయటకు రాగానే కొన్ని నిమిషాలు వ్యవధిలో కాంగ్రెస్ సోషల్ మీడియా మరియు దాని అనుబంధ సభ్యులు, మోడీ ద్వేషులుగా ఉన్న పలువురు మీడియా వాళ్ళు ట్విట్టర్ లోనూ ఇతర సామాజిక మధ్యమాల లోనూ ఒక పద్ధతి ప్రకారం హిండెన్ బర్గ్ రిపోర్ట్ లో విషయాలు విపరీతంగా వైరల్ చేశారు. ఆదాని గ్రూప్ ఆర్ధికంగా బాగా బలంగా ఉంది కాబట్టి ఆ గ్రూప్ విశ్వసనీయత పై భారీ ఎత్తున దాడి జరిగినా, ఆ గ్రూప్ లో మదుపు చేసిన ఇన్వెస్టర్లు ఈ గ్రూప్ షేర్ల పై తమ నమ్మకం కోల్పోలేదు. అందుకే అతి త్వరలో ఆ గ్రూప్ షేర్ల ధరలు భారీగా పుంజుకున్నాయి.
అందుకే పెద్దలు ‘చెరపకురా చెడేవు’ అని అంటారు. మోడీ ని ఆదాని ద్వారా దెబ్బకొట్టడానికి సోరోస్-రాహుల్-హిండెన్ బర్గ్ ప్రయత్నిస్తే…ఆ ప్రయత్నాలు నీరు కారడమే కాకుండా మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చి రాహుల్ కి చావు దెబ్బ కొట్టాడు. ఆదాని గ్రూప్ షేర్లు బాగా పుంజుకుని ఆదాని తిరిగి బలంగా నిలబడ్డాడు. మరో వైపు సోరోస్ ఫ్రెండ్ బీడెన్ అమెరికా అధ్యక్ష పదవి నుండి దిగిపోతూ, సోరోస్ శత్రువు అయిన ట్రంప్ అధ్యక్షుడు కాబోతున్నాడు.
ఇక చివరగా, 2023 జనవరి 24 న ఆదానికి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ రిపోర్ట్ బయట పెట్టింది. ఇంకా 2సం.లు పూర్తి కాక ముందే అదే జనవరి నెలలో హిండెన్ బర్గ్ సంస్థ తనంత తానుగా బకెట్ తన్నేసుకుంది.
హిండెన్ బర్గ్ సంస్థ మూసివేతవార్త తో ఈ రోజు స్టాక్ మార్కెట్ లో భారీగా లాభ పడ్డ అదాని గ్రూప్ షేర్లు.
అదే కర్మ ఫలం.
మోడీ కూడా సాధారణ రాజకీయ నాయకుడే, పాత తరహా కుట్రలతో అతనితో తలపడదాం అనుకునే వారికి ఏం జరుగుతుందో తెలియచెప్పే మరో ఉదాహరణ ఈ హిండెన్ బర్గ్ వ్యవహారం.