ట్రంప్ టీంలో మరో భారతీయఅమెరికన్ చేరారు. వెంచర్ క్యాపిటలిస్ట్అయిన శ్రీరామ కృష్ణన్ ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏఐపై పాలసీ అడ్వైసర్ గా నియమించారు ట్రంప్. ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వింగ్ లో శ్రీరామ్ పనిచేస్తారు. ఏఐ విధాన రూపకల్పనలో ప్రభుత్వంలో పనిచేస్తారని ట్రంప్ స్వయంగాతెలిపారు. శ్రీరామకృష్ణ కూడా ఎక్స్ వేదిగ్గా స్పందిస్తూ అవకాశం ఇచ్చిన ట్రంప్ కు కృతజ్ఞత తెలిపారు.
శ్రీరామకృష్ణన్ తమిళనాడుకు చెందినవాడు. కాంచీపురంలోని ఎస్ఆర్ఎం కాలేజీ ఐటీ తో ఇంజినీరింగ్ పూర్తి చేసి…2005లో అమెరికా వెళ్లారు. 2005లో మైక్రోసాఫ్ట్‌లో తన కెరీర్ మొదలైంది.
ట్విట్టర్, యాహూ!, ఫేస్‌బుక్ , స్నాప్‌లలో ప్రొడక్ట్ టీంలకు పనిచేశారు. మెటాలో మొబైల్ యాడ్ ప్రొడక్ట్స్ ను ఆయన డెవలప్ చేశారు. క్రమంగా పెట్టుబడిదారుగా, పారిశ్రామిక వేత్తగా ఎదిగారు శ్రీరామ్.మస్క్ కు అత్యంత సన్నిహితుడు. ప్రముఖ వెంచర్ కాపిటల్ సంస్థ ఆండ్రీసెన్ హోరోవిట్జ్ పార్టనర్ గా చేరి… లండన్ కార్యాలయంకేంద్రంగా పనిచేశారు… 2023లో దాన్నివీడి బయటకు వచ్చాడు..ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… ‘ది ఆర్తి అండ్ శ్రీరామ్ షో’ (గతంలో ‘ది గుడ్ టైమ్ షో’ ) దానికి హోస్ట్ … భార్యతో ఆ ప్రాజెక్ట్ చేస్తున్నారు శ్రీరామ్.