చైనాలో కొత్త వైరస్ ‘హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్‌ఎంపీవీ)’ వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్తలు మరోసారి ప్రపంచాన్నికలవరపెడుతున్నాయి.అంతకంతకూ పెరుగుతున్న ఫ్లూకేసులతో జనంఆస్పత్రులకు బారులు తీరుతున్నారు. వారంతా జలుబు, దగ్గు, జ్వరం,ఇతర శ్వాసకోశవ్యాధులబారిన పడినట్టు తెలిసింది.అయితే భయపడాల్సిందేలేదంటున్నచైనాప్రభుత్వం…సీజనల్ వ్యాధేనని కొట్టిపడేస్తోంది. అయితేఅక్కడ హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైర్‌సలు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడ సోషల్మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్ని వీడియోలూ ప్రపంచమంతా వైరల్అవుతున్నాయి. హెచ్ఎంపీవీని 2001లో గుర్తించామని ఉత్తరచైనాలో ఈ సీజన్లో వ్యాధులు సహజమని ప్రభుత్వం అంటోంది.
ఇక హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లాగే ఉంటాయని…దగ్గు, జ్వరంతో శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందని నిపుణులు అంటున్నారు. వైరస్ సోకినవ్యక్తినుంచి దగ్గు, తుమ్ము తుంపర్ల ద్వారా వేరేవాళ్లకి సోకుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఈవైరస్ బారినపడితే ప్రత్యేక చికిత్స మాత్రం ఏమీ లేదు. జాగ్రత్తగా ఉండడంద్వారా వైరస్ బారిన పడకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అటు చైనాలో కొత్తవైరస్ విజృంభనతో భారతప్రభుత్వం అప్రమత్తమైంది. జాతీయ వ్యాధుల నివారణ కేంద్రం ఎన్సీడీసీ దృష్టిపెట్టింది.