బీద వాడిగా, లేదా అతి సామాన్యుడుగా కనిపించాలి అంటే? ఏం లేదు. బీదల కష్టాలను ఏకరువు పెడుతూ ఉపన్యాసాలుఇవ్వాలి. నాకు పదవీ వ్యామోహం లేదని…అసలు రాజకీయాల్లోకి వచ్చేఉద్దేశమే లేదని చెప్పాలి. రాజకీయాల్లోకి చేరాలి. నమ్మి ప్రజలు అధికారం ఇస్తే మొదట్లో ముఖ్యమంత్రిగా టు బెడ్రూమ్ ఇంట్లోనే ఉంటానని చెప్పాలి. ప్రభుత్వ వాహనాలు ఉపయోగించను అని చెప్పాలి. కార్యకర్తలు దానం చేసిన డొక్కు వాగన్ ఆర్ కార్లోనే తిరుగుతున్నాను అనాలి. వీఐపీ కల్చర్ కు దూరం అనాలి. రూ. 100 ఖరీదు చేసే లూజ్ బుష్ షర్ట్, మరో రూ. 100 ఖరీదు చేసే పెద్ద సైజ్ లూజ్ పేంట్ వేసుకుని తిరుగాలి.మరో రూ. 50 లేదా వంద రూపాయలుపెట్టి హవాయి స్లిప్పర్లు కొని వేసుకోవాలి. చొక్కాపై ఎప్పుడూ 10 రూపాయల రేనాల్డ్స్ పెన్ పెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తేనే కేజ్రీవాల్ లీడర్ అయ్యాడు.
2011:నేను ఏ ఎన్నికలలో పోటి చేయను.
2012: నేను ఏ రాజకీయ పదవిని తీసుకోను.
2013: నా పిల్లల మీద ప్రమాణం చేస్తున్నాను.
కాంగ్రేస్ మద్దతు ఎప్పుడూ తీసుకోను.
2013: నేను గానీ నా మంత్రులు గాని VIP కల్చర్ ఫాలో అవ్వం.
2013: నేను కానీ నా మంత్రులు కానీ ప్రభుత్వ బంగాళాలు ఉపయోగించం. ప్రభుత్వ సెక్యూరిటీ తీసుకోం. ప్రభుత్వ వాహనాలు ఉపయోగించం. కానీ … అన్నా ఈయన్ని అలా వదిలేయగానే…ఈయన తను చెప్పినవన్నీ వదిలేశాడు.
ఎన్నికల్లో పోటీ చేశాడు. ఢిల్లీలోనే కాదు వారణాశి నుంచికూడా పోటీ చేశాడు.కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన సహా మంత్రులంతా ప్రభుత్వ సెక్యూరిటీతో చక్కగా వీవీఐపీ కల్చర్ ఫాలో అవుతున్నారు. అందరూ చక్కగా ప్రభుత్వ బంగళాలు తీసుకున్నారు. ప్రభుత్వ వాహనాలు వాడుతున్నారు. పాపం అతి సామాన్య ముఖ్యమంత్రి ఆతరువాతి కాలంలో 16 ఏసీల 10 గదుల బంగాళాకు, 10 కార్ల కాన్వాయ్ కి మారాడని గిట్టనివాళ్లు ఆరోపించారు. ఇక తన బంగళాను కోట్ల రూపాయలతో రిపేర్ చేయించుకుని 16 ఏసీలు బిగించేసుకున్నాడు. 2015 లోనే ఆ ఇంటికి లక్షా 35 వేల రూపాయల కరెంట్ బిల్ వచ్చింది.
ఇక ఆ 10 గదుల బంగళా సరిపోవడం లేదని పక్కనే ఉన్న ఆఫీసర్ క్వార్టర్స్ కూడా తీసుకున్నాడు. 45 కోట్లతో దాన్ని రిన్నోవేషన్ చేయించేశాడు.అయితే ఆ బంగ్లాలో దిగిన ముహూర్తం బాగాలేదో ఏమో…లిక్కర్ స్కాం మెడకు చుట్టేసింది. చివరకు ముఖ్యమంత్రి పదవిపోయింది. దాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.
కేజ్రీవాల్ బంగ్లా ఖాళీ చేసిన తర్వాత ఢిల్లీ PWD విభాగం ఆ బంగ్లా యొక్క వస్తువుల జాబితాను విడుదల చేసింది –
దాని ప్రకారం… ఆమ్ అద్మీ గారి కోసం…
1) సుపీరియర్ క్వాలిటీ వాటర్ సప్లై పరికరాలు మరియు శానిటరీ ఇన్‌స్టాలేషన్‌లు – ₹15 కోట్లు
ఖర్చు చేశారు.
2) మేడ మెట్లు స్టీల్ రైలింగ్, వాటికి కవరింగ్ (ఇత్తడి, షవర్ ఎన్‌క్లోజర్ మొదలైనవి) – ₹1.2 కోట్లు
3) 80 విండో కర్టెన్‌లు – ₹4 కోట్ల మధ్య నుండి ₹5.6 కోట్లు. అన్నట్లు ఈ కర్టెన్లకు ‘ సెన్సార్స్ అమర్చబడి, అవి జరగడానికి మోటార్స్ పెట్టి ఉన్నాయట. ఒక్క సెన్సార్స్ మాత్రమే కాక అవసరమైతే ఆ కర్టెన్స్ రిమోట్ కంట్రోల్ తో కూడా ఆపరేట్ చేయవచ్చునట.
4) వాయిస్ కంట్రోల్డ్- అల్ట్రా స్లిమ్ స్మార్ట్ 4K TVలు ₹64 లక్షలు పెట్టి 16 టీవీలు కొన్నారుట.
5) స్మార్ట్ LED లైట్లు – ₹19.5 లక్షలు
6) ఫ్రీస్టాండింగ్ లుమినరీలు – ₹9.2 లక్షలు
7) OSADA కంపనీ ఫుల్ బాడీ మసాజ్ చైర్- ₹4 లక్షలు
8) మోటరైజ్డ్ రిక్లైనర్ సోఫాలు 8: ₹10 లక్షలు
9) బోస్ లౌడ్ స్పీకర్ సిస్టం – ₹4.5 లక్షలు
10) ఇన్ బిల్ట్ TV & AI గల విజన్ స్క్రీన్‌తో 2 స్మార్ట్ రిఫ్రిజిరేటర్లు – ₹9 లక్షల
11) 73-లీటర్ సైజ్ ఒక స్టీమ్ ఓవెన్ – ₹9 లక్షలు
12) 50-లీటర్స్ సైజ్ మైక్రోవేవ్ ఓవెన్ – ₹6లక్షలు
13) 2 మౌంటెడ్ హుడ్స్ 140 సెం.మీ స్టెయిన్‌లెస్ స్టీల్ చిమ్నీలు కిచెన్ లో – ₹6 లక్షలు
14) BOSCH 8 సిరీస్ అల్ట్రా మోడెర్న్ బిల్ట్-ఇన్ కాఫీ మెషిన్ – ₹2.5 లక్షలు
15) 3 హాట్ వాటర్ జనరేటర్లు (ఎయిర్ టు వాటర్ హీట్ పంప్) – ₹22.5 లక్షలు
16) LG 12 కేజీ ఫ్రంట్ లోడ్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ + డ్రైయర్ – ₹2.1 లక్షలు
17) 20 గ్రాండ్ ఏజ్డ్ బ్రాస్ ఎంట్రన్స్ స్కోన్స్ అవుట్‌డోర్ లైట్లు – ₹10 లక్షలు
18) ఆటోమేటిక్ స్లైడింగ్ సెన్సార్‌లతో వుడెన్ & గ్లాస్ డోర్స్ – ₹70 లక్షలు
19) 24 అలంకార స్తంభాలు: ₹36 లక్షలు
అన్నిటి కంటే అందరూ ముక్కు మీద వేలు వేసుకుంటోంది ఏంటీ అంటే…. అక్కడ బాత్ రూమ్ లో ఏర్పాటు చేసిన ఆటో మేటిక్ రిమోట్ కంట్రోల్డ్ ‘టాయిలెట్ కమోడ్స్’. ఆ రిమోట్ తో కమోడ్ కవర్ తీసుకోవడం, వేసుకోవడం, సీట్ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడం, ఫ్లష్ ఉపయోగించడం. ఇక మలబద్దకం అనిపిస్తే కింద మసాజ్ చేయడం వంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయట. ఆమ్ ఆద్మీని చెప్పుకునే కేజ్రీవాల్ విలాసాలే ఇలా ఉంటే..సాధారణ రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటేనో. పాత గృహానికి మరమ్మతులకు,ఇండీరియర్ కోసం ఢిల్లీ ప్రభుత్వం 45 కోట్లు ఖర్చు చేసింది. దాని మీద ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు.
ఇదిలా ఉంటే…. ఢిల్లీ కి చెందిన రచిత్ కౌశిక్ అనే ఒక యు ట్యూబర్ కేజ్రీవాల్ ఇంటిమీద వీడియో చేశాడు. తన నూతన అధికార నివాసంలో ఉపయోగించేందుకు నాలుగు థ్రెడ్ మిల్స్ అద్దెకు తీసుకున్నాడు కేజ్రీవాల్. ఈ థ్రెడ్ మిల్స్ క్వాలిటీ బట్టి మార్కెట్ లో 15 వేలనుంచి గరిష్టంగా 15 లక్షల వరకు ఉంటుంది.అయితే వాటినికొనకుండా…నెలకు ఒక్కోదానికి రెండున్నరలక్షల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారట. అంటే నాలు థ్రెడ్ మిల్స్ కు నెలకు 10 లక్షల అద్దె ఓ కంపెనీకి చెల్లిస్తున్నాడన్నమాట.అయితే ఆ కంపెనీ కేజ్రీవాల్ కొడుకు పులకిత్ కేజ్రీవాల్ ది అని ఆ యూట్యూబర్ ఆరోపించారు.
అయితే ఆశ్చర్యంగా మీరట్లో పెళ్లికి వెళ్లిన రుచిత్ కౌశిక్ ను పంజాబ్ పోలీసులు సివిల్ డ్రెస్సులో వెళ్లి అరెస్ట్ చేశారు.అతను నో కన్వర్షన్ అనే ట్విట్టర్ హేండిల్ తో క్రిస్టియన్స్ కి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు షేర్ చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయంట. దీంతో లూధియానా కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా వీడియో చేయడం వల్లేతనను అరెస్ట్ చేశారని రుచిత్ ఆరోపిస్తున్నాడు.