• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Friday, June 5, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home అంతర్జాతీయం

మన పోలీసులు, భద్రతా బలగాలకు సెల్యూట్ చేయాల్సిందే- ఎందుకంటే!!

Devika by Devika
November 9, 2024
in అంతర్జాతీయం, జాతీయం, రాజకీయాలు
0
మన పోలీసులు, భద్రతా బలగాలకు సెల్యూట్ చేయాల్సిందే- ఎందుకంటే!!
0
SHARES
9
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

అన్ని దేశాల్లోఎన్నికల సమయాలలో ప్రజాస్వామ్యం గురించి, ప్రజల రక్షణ, ప్రతిపక్ష నాయకుల స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం గురించి 24 గంటలూ ఉపన్యాసాలు ఇచ్చే అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జరిగిన కొన్నిఘటనలు ఆశ్చర్యం కలిగించాయి కదా. అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలోఉన్నప్పుడే ఎన్నోరకాల కేసులు పెట్టి తింపారు. రెండుసార్లు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.
అసలు ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఎన్నికల ప్రచారంలో రెండుసార్లు అతనిమీద హత్యాయత్నాలు జరిగాయి. పెన్సల్వేనియాలో ప్రచారంలో ఉన్న అతనిపై జూలై 13న మొదటి దాడి జరిగింది. అప్పటినుంచి ఇండోర్ ఈవెంట్లకే ఎక్కువగా హాజరయ్యాడు ట్రంప్. తరువాత ఓర్యాలీ గన్ తో దాడి చేస్తే ట్రంప్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ మధ్య ఒక ర్యాలీలో అతనిపై గన్ షాట్లు పేలడంతో ట్రంప్ కుడి చెవికి గాయం అయింది. థామస్ మాథ్యూ క్రూక్స్ అనే షూటర్ ని భద్రతా దళాలు సంఘటనా స్థలంలోనే కాల్చి చంపేసాయి.

ఆ తర్వాత వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్‌లో ఆడుకుంటుండగా ఒక సాయుధ వ్యక్తి AK-47, గోప్రో కెమెరా, బ్యాక్‌ప్యాక్ కలిగి ఉన్న రాయన్ వెస్లీ రూత్ అనే అనుమానితుడిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరపడంతో ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు. 12గంటలుగా అతను అక్కడి పొదల్లోనే ట్రంప్ కోసం వేచిచూస్తూ ఉన్నా భద్రతా దళాలు అతన్ని కనిపెట్టలేదు. చివర్లో గుర్తించి కాల్పులు జరపబోతే నిందితుడు పారిపోయాడు. తరువాత అరెస్ట్ చేశారనుకోండి. తరువాత ట్రంప్ ర్యాలీకి సమీపంలో పేలుడు పదార్థాలతో నిండి ఉన్న కారును గుర్తించారు.అదింకో వైఫల్యం. కారును తనిఖీ చేసేందుకు ట్రంప్ సెక్యూరిటీ వెళ్తుంటే అందులో ఉన్న నిందితుడు తప్పించుకుని అడవిలోకి పారిపోయాడు.

అసలు అన్ని రకాల భద్రతా అంచెలను దాటుకుంటూ, సెక్యూరిటీ కళ్లు కప్పి ట్రంప్ దగ్గరి వరకు ఆయుధాలతో దుండగులు ఎలా వెళ్లగలిగారన్నది ఆశ్చర్యం.గొప్ప రక్షణ వ్యవస్థ అని గప్పాలు కొట్టుకునే అమెరికాలోనే మాజీ అధ్యక్షుడికి, అధ్యక్ష అభ్యర్థి పరిస్థితే ఇలా ఉంటే…
140 కోట్ల జనాభా ఉండి, ఇస్లామిక్, నక్సల్, ఖాలిస్తానీ వంటి ఉగ్రవాద శక్తులతో 24 గంటలూ తలపడుతున్న భారత భద్రతా దళాలు ఇక్కడ నాయకులను ఎన్నికలప్పుడు ఎలా రక్షిస్తున్నాయి కదా చూడండి.
విదేశీ మరియు దేశీయ ఇస్లాం ఉగ్రవాద మూకలు వారి ఆత్మహత్యాదళాల నుండి 24గంటలూ తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రధాని మోడీ ఎన్నికల సమయంలో టాప్ లెస్ వాహనాలలో నిలబడి గంటల తరబడి రోడ్ షోలు చేసిన సందర్భాలు ఈ దేశంలో ఎన్నోఉన్నై. మొన్నే మొన్నే చూశాం.

భద్రతా విషయాలలో అతి బలహీనంగా, సున్నితమైన,సమస్యాత్మక ప్రాంతంగా చెప్పే సరిహద్దు జమ్ముకశ్మీర్లో నిన్నా మొన్నేగా ఎన్నికలు జరిగింది. నాయకుల ప్రచారాలు,పార్టీల మీటింగులు. అస్సలు ఒక్కటంటే ఒక్క విధ్వంసకర ఘటన జరిగిందా..ఎంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. మరి భద్రత గురించి, ఎన్నికల నిర్వహణ గురించి, ప్రజాస్వామ్యం గురించి, ప్రతిపక్ష నేతల స్వేచ్ఛ గురించి మన దేశానికి ఉపన్యాసాలు ఇస్తారెందుకు?మన పోలీసు, భద్రతా బలగాలకు సెల్యూట్ చేయాల్సిందే కదా.

Tags: 2024 electionsamericademocracydonald trump election pollsindian police forceindian police force first lookindiansecurityforceinternational newskamala harrispresidenttrumpusa today

Related Posts

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..
అంతర్జాతీయం

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

January 17, 2025
పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?
అంతర్జాతీయం

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

January 31, 2025
బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ
జాతీయం

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

January 6, 2025
భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం
జాతీయం

సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం

January 4, 2025
180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
జాతీయం

180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..

January 4, 2025
Next Post
పదేళ్లలో 11వ స్థానం నుంచి ఐదుకు-ఏడాదిలో మూడో స్థానానికి

పదేళ్లలో 11వ స్థానం నుంచి ఐదుకు-ఏడాదిలో మూడో స్థానానికి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

అట్లుంటది మన దెబ్బ! | Pakistan will be busy in 2026 | Devika Journalist |

అట్లుంటది మన దెబ్బ! | Pakistan will be busy in 2026 | Devika Journalist |

January 2, 2026
Walk For Unity: దేశ భద్రత కోసం తొలి అడుగు – Go Back Rohingyas Movement | Devika Journalist

Walk For Unity: దేశ భద్రత కోసం తొలి అడుగు – Go Back Rohingyas Movement | Devika Journalist

August 24, 2025
మధ్య తరహా పరిశ్రమల్ని ప్రోత్సహించాలి-యువశక్తే మనకు బలం | Devika Journalist

మధ్య తరహా పరిశ్రమల్ని ప్రోత్సహించాలి-యువశక్తే మనకు బలం | Devika Journalist

August 11, 2025
కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కంటగింపు అందుకే…| Devika Journalist

కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కంటగింపు అందుకే…| Devika Journalist

April 20, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • మోదీ కూడా అంతే!Melody khao khud jaan jao || Devika Journalist ||
  • 30 April 2026
  • నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు! ||Devika Journalist ||
  • పిటిషనర్ కు కోర్టు మొట్టికాయలు! || Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.