ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం కేవలం దశాబ్దంలో అంటే పదేళ్లలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకిందని మీకు తెలుసా? 2025 నాటికి అంటే మరో ఏడాదికి జర్మనీ, జపాన్ ఆర్థిక వ్యవస్థలను కూడా దాటుకుని అమెరికా, చైనా తరువాత 3వ స్థానానికి భారత్ చేరనుందట. అన్ని ప్రపంచ ఆర్థిక సంస్థల అంచనా ఇది.
IMF యొక్క వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ డేటా ప్రకారం 2013 నుండి 2023 వరకు గత 10 సంవత్సరాలలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 90% పైగా వృద్ధి చెందింది. గత పదేళ్లలో ప్రపంచంలోని అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలోనూ ఇదే అత్యధిక వృద్ధి!
గత పదేళ్లలో ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల నామమాత్రపు జీడీపీవృద్ధి రేటును చూద్దాం.
- అమెరికా : ప్రపంచంలో నే నెంబర్ వన్ ఆర్ధిక వ్యవస్థ అమెరికాది. 2013లో16,881 బిలియన్ డాలర్ల జిడిపి ఉంటే 2023 కి 27,358 బిలియన్ డాలర్లు అయింది. అంటే సుమారు 60% జీడీపీ పెరుగుదల నమోదు చేసుకుంది.
- చైనా ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ. 2013లో జిడిపి 9625 బిలియన్ డాలర్లు ఉంటే 2023 కి 17,662 బిలియన్ డాలర్లు అయింది. అంటే 83.50% వృద్ధి నమోదు చేసింది.
- జర్మనీ ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. 2013లో జిడిపి 3734బి. డాలర్లు ఉంటే, 2023కి 4,457 బి.డాలర్లు అయి 19.38%వృద్ధి నమోదు చేసుకుంది.
- జపాన్ ప్రస్తుతం ప్రపంచంలో 4వ ఆర్ధిక వ్యవస్థ. అయితే, దురదృష్టం ఏమిటంటే 2013లో 5212 బిలియన్ డాలర్ల తో ఇది 3వ ఆర్ధిక వ్యవస్థ గా ఉండగా జిడిపి 19%తగ్గి ఇప్పుడు 4213 బిలియన్స్ కి పడిపోయి 4వ స్థానానికి దిగిపోయింది.
- భారత్ ప్రస్తుతం ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. 2013లో 1857 బిలియన్ డాలర్ల తో ప్రపంచంలో 11వ ఆర్ధిక వ్యవస్థ గా ఉంటే, 2023 కి అంటే పదేళ్లలో 92.38% పెరుగుదలతో 3572 బిలియన్ డాలర్ల కు చేరి 5వ స్థానానికి చేరింది.
ప్రపంచంలో గత పదేళ్లలో పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 90%పైగా అభివృద్ధి నమోదు చేసుకున్న దేశం భారత్ ఒక్కటే. - బ్రిటన్ లేక యూకే ఇప్పుడు 6 వ స్థానం. 2013లో 2787 బి.డాలర్ల ఉండగా 10సం. లలో అది 20%మాత్రమే పెరిగి 2023 సం. కి 3345 బి.డాలర్ల కు చేరింది.
- ఫ్రాన్స్ ఇప్పుడు7వ స్థానం. 2013లో జీడీపీ 2812 బి.డాలర్లు ఉండగా 10సం. లలో కేవలం 7.81% వృద్ది నమోదు చేసుకుని 2023 సం. కి 3032 బి.డాలర్ల కు చేరింది.
- ఇటలీ ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. 2013లో 2143 బి.డాలర్ల జిడిపి ఉండగా 10 సం. లలో కేవలం 5.3% వృద్ది తో 2023కి 2256 బి.డాలర్లు కు చేరింది.
- బ్రెజిల్ ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది. 2013లో
2472 బి.డాలర్ల జిడిపి తో 7వ స్థానంలో ఉండేది. అయితే, ఈ 10 సం. లలో జిడిపి 12% తగ్గుదల నమోదు చేసుకుని 2174 బి.డాలర్ల కు పడిపోయి 9వ స్థానానికి దిగజారింది. - కెనడా ప్రస్తుతం 10వ స్థానంలో ఉంది. 2013లో 1847 బి.డాలర్ల జిడిపి ఉండగా అది ఈ 10 సం.లలో 15.89 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుని 2140 బి.డాలర్ల కు చేరింది.
2013-23మధ్య మోదీ కాలంలో 10 సం.లలో భారత్ సుమారు 92% జిడిపి వృద్ధి చూపించింది. ఇది మిగతా అన్ని దేశాలు కంటే ఎక్కువ. 2014 తర్వాత ప్రపంచంలో దేశ ఆర్ధిక వ్యవస్థ లు అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా కోవిడ్ దెబ్బ నుండి ఆర్ధిక వ్యవస్థ లు ఇంకా కొలుకోలేదు. ఈలోగానే రష్యా-ఉక్రేనియన్ యుద్ధం రావడం తో ప్రపంచంలో చాలా దేశాలు కనీస ఆర్ధిక వృద్ధి రేటుని కూడా సాధించలేకపోయాయి. అందుకే 2013 ముందు బాగా పటిష్టం గా ఉన్న జపాన్ బ్రెజిల్ వంటి దేశాలు 2014 తర్వాత వృద్ధి రేటు పెరగకపోగా తగ్గుదల కనిపించింది.
అంతర్జాతీయంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థ లు ఇంత క్లిష్టంగా ఉన్న సమయంలో భారత్ గత పదేళ్లుగా స్థిరమైన వృద్ది రేట్ సాధిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లలో 6 స్థానాలు మెరుగుపరుచుకుని 5వ స్థానానికి చేరింది.