మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు మార్మోగుతోంది.కూటమి నాయకుడిగా బీజేపీ మహారాష్ట్రలో పవన్ తో ఎన్నికల ప్రచారం చేయించింది. అయితే పవన్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లోనూ ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారు.
సనాతన ధర్మంపై పవన్ చేసిన వ్యాఖ్యలు మహా ఓటర్లను ఆకట్టుకున్నాయి. కూటమి అభ్యర్థుల తరపున పలుచోట్ల బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న పుణె, బల్లార్ పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్‌లలో పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. అన్ని స్థానాల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచారు.