• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Tuesday, July 21, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home అంతర్జాతీయం

POW పిటిషన్లపై సుప్రీం విచారణ-నాలుగువారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం

Devika by Devika
December 12, 2024
in అంతర్జాతీయం, జాతీయం, ప్రాంతీయం, రాజకీయాలు
0
POW పిటిషన్లపై సుప్రీం విచారణ-నాలుగువారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం
0
SHARES
9
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

హిందువులకు పూర్తిగా అన్యాయం చేస్తున్న Places of worship act, 1991 అదే ఆరాధనా స్థలాల చట్టంలోని పలు అంశాలను వ్యతిరేకిస్తూ 2021లో దాఖలైన పలు పిటిషన్లపై …చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ విచారణ జరిపింది. నాలుగువారాల్లోగా అఫిడవిట్ దాఖలుచేయాలని కేంద్రానికి సూచించింది. ఆలోగా… మతపరమైన ప్రార్థనాస్థలాల యాజమాన్య దావాలను తీసుకోవద్దని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దని, ఎలాంటి సర్వేలకూ ఆదేశాలు ఇవ్వవద్దని దేశవ్యాప్తంగా ఉన్నట్రయల్ కోర్టులను ఆదేశించింది.


1991 చట్టం… చట్టబద్ధతను సవాలు చేస్తూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్‌తో పలువురు పిటిషన్లు వేశారు. ఆ చట్టం హిందువులు, జైనులు, బౌద్ధులు మరియు సిక్కులు తమ ప్రార్థనా స్థలాలను క్లెయిమ్ చేయకుండా న్యాయస్థానాలను ఆశ్రయించకుండా నిషేధించిన చట్టం అని అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) మరియు జమియత్ ఉలమా-ఇ-హింద్ వంటి ముస్లిం సంస్థలు ఆవాదనను తిప్పికొడుతున్నాయి. ప్రజా ప్రయోజనవ్యాజ్యాల ముసుగులో కోర్టుకుఎక్కుతున్నారని…అదిదేశంలోని లౌకిక వాద స్ఫూర్తికి విరుద్ధమని వాదిస్తూవస్తున్నాయి. ఈ చట్టం పకడ్బందీగా అమలు చేయాలి అని, 1947 ఆగస్టు 15కి ఉన్న ఆరాధనా స్థలాల స్థితిని యధాతథంగా ఉంచాలి అని ఆర్టికల్ 32 అనగా ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టు కి వెళ్లే హక్కు ఆధారంగా ‘జమైత్ ఉలేమా ఐ హింద్’ వేసిన పిటిషన్ కూడా ఇవాళే విచారణకు వచ్చింది. ఈ చట్టం సక్రమంగా అమలు చేయకపోతే పలు మసీదులను, ముస్లిం రాజులుధ్వంసం చేసిన హిందూ దేవాలయాలపై కట్టారు అనే పిటిషన్స్ పరంపర కొనసాగి సమాజంలో అలజడి రేగుతుంది అని వారు తమ పిటిషన్ లో కోరారు.


అసలు ఈ POW ఆక్ట్ రాజ్యాంగబద్ధత ని సవాల్ చేస్తూ ‘హిందూ శ్రీ ఫౌండేషన్’ అనే సంస్థ తమని కూడా ఈ విచారణ లో భాగస్వామ్యులను చేయమని సుప్రీంకోర్టు ని కోరింది. ఈ సంస్థ నిర్లక్ష్యానికి గురైన పురాతన దేవాలయాలను, ఆధ్యాత్మిక యాత్రా స్థలాలని గుర్తించడం వాటిని మళ్ళీ పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమై ఉంది. అందువల్ల తమకు కూడా దీనిలో పాల్గొనే అర్హత ఉంది అని ఈ సంస్థ కోరింది. ఈ సంస్థే గతంలో చిదంబరం నటరాజ దేవాలయం వ్యవహారాలలో మితి మీరిన ప్రభుత్వ జోక్యం మీద కోర్టులో కేసు వేసి గెలిచారు.
ఈ సంస్థ వాదన ప్రకారం…

  1. ఈ చట్టం ఒక నిర్దిష్ట తేదీ నిర్ణయించి హిందువుల ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక హక్కుల అమలుకు ఆటంకం కలిగించే విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు.
  2. ఈ చట్టం గతంలో ముస్లిం రాజులచే ధ్వంసం అయిన అన్ని హిందూ దేవాలయాలపై కూడా నిరంతర యథాస్థితి కొనసాగించేటట్లు చేస్తోంది.
  3. తమకు దక్కవలసిన హక్కుల కోసం సుప్రీంకోర్టు కు పోయే ప్రాథమిక హక్కుతో సహా పలు ప్రాథమిక హక్కులను ఇచ్చిన రాజ్యాంగం లోని 14,25,26, 29(a) మరియు 32 ఆర్టికల్స్ కు ఈ POW చట్టం విరుద్ధం గా ఉంది.
  4. మారిన మత ఆస్తులపై ఉన్న తగాదాలను చర్చలు ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటు ను ఈ చట్టం లో సెక్షన్ 3 నిషేధిస్తోంది, ఇది ఆర్టికల్ 14కి వ్యతిరేకం.
  5. ఆస్తులను కలిగి ఉండడం, సంపాదించడం అనేది అందరికి ఆర్టికల్ 26 కల్పిస్తోంది. పబ్లిక్ ఆర్డర్ కోసమని చెప్పి ఈ ప్రాథమిక హక్కులను నిరంతరం అడ్డుకునే విధంగా ఉంది ఈ POW చట్టం.
  6. ఆర్టికల్ 29(1) తమ సాంస్కృతిని పదిలపరుచుకునే హక్కుని ఇస్తోంది. అంటే ఇది ప్రతికూల(నెగటివ్ రైట్) హక్కు మాత్రమే కాదు, పాజిటివ్ హక్కును కూడా ఇస్తోంది. దాని ప్రకారం ఏదైనా సాంస్కృతిక స్థలాన్ని గుర్తించి చర్చల లేదా న్యాయ పోరాటం ద్వారా దానిని పొందే హక్కు ఈ ఆర్టికల్ ఇస్తోంది. కానీ, ఈ POW చట్టం ఆ హక్కుపై నిషేధం విధించింది.
    అందువల్ల ఈ POW చట్ట రాజ్యాంగ బద్ధతను మా పిటిషన్ ద్వారా ప్రశ్నిస్తున్నాం అని సంస్థ చెప్పింది.
    అసలు 2021లోనే ఈ పిటిషన్ వేయగానే తిరస్కరించకుండా విచారణకు తీసుకోవడం పట్ల యధాప్రకారం దేశంలో ప్రతిపక్షాలు వామపక్ష మేధావులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. విచారణకు వస్తే ఈ చట్టం ద్వారా హిందువులకు జరిగిన దారుణ అన్యాయం బయటపడుతుంది అని వారి భయం?
    అసలు 1947లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి నేటి వరకు హిందువుల ఏ ఒక్క అంశం గురించి అయినా మద్దతుగా సెక్యూలర్ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ మాట్లాడారా? ముస్లిం ఆధ్యాత్మిక, సాంస్కృతిక వ్యవహారాలలో ప్రభుత్వ లేక న్యాయస్థానం జోక్యం ని పలుసార్లు వ్యతిరేకించిన ఈ సెక్యూలర్ ముఠా, అదే హిందువుల ఆధ్యాత్మిక సాంస్కృతిక హక్కుల విషయంలో కి వచ్చే సరికి సరిగ్గా దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు.
    ఈ ముఠా చేతిలో మీడియా ఉన్నన్నాళ్లు ఇటువంటి విషయాలు హిందువులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ సోషల్మీడియావిస్తృతం అయిననుంచి ఈ ముఠా ఈ ద్వంద్వ ప్రమాణాలు బయటపడుతున్నాయి. ఈ ముఠా సెక్యులరిజం పేరుతో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మెజార్టీ వర్గ ప్రాథమిక హక్కుల అమలుకు కూడా తూట్లు పొడుస్తున్నదో ఇప్పుడు ప్రతిఒక్కరూ గమనిస్తున్నారు
Tags: place of worship actplace of worship act 1991places of worship actsupreme courtsupreme court nomination processsupreme court nomination today

Related Posts

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..
అంతర్జాతీయం

బకెట్ తన్నేసిన హిండెన్ బర్గ్ సంస్థ..

January 17, 2025
పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?
అంతర్జాతీయం

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

January 31, 2025
బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ
జాతీయం

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

January 6, 2025
భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం
జాతీయం

సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం

January 4, 2025
180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
జాతీయం

180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..

January 4, 2025
Next Post
భారతయువకుడి ఘనత-18 ఏళ్లకే ప్రపంచచాంపియన్ అయిన గుకేశ్ దొమ్మరాజు

భారతయువకుడి ఘనత-18 ఏళ్లకే ప్రపంచచాంపియన్ అయిన గుకేశ్ దొమ్మరాజు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

Kunal Kamra Eknath Shinde row | Shivsena | Devika Journalist

Kunal Kamra Eknath Shinde row | Shivsena | Devika Journalist

March 24, 2025
ఈటల గురించి యువ సర్పంచ్ ఏమన్నారో తెలుసా? | Devika Journalist |

ఈటల గురించి యువ సర్పంచ్ ఏమన్నారో తెలుసా? | Devika Journalist |

December 26, 2025
Bharat Punch Power-Mission 40 I భారత్ పంచ్ పవర్-మిషన్ 40 | Devika Journalist

Bharat Punch Power-Mission 40 I భారత్ పంచ్ పవర్-మిషన్ 40 | Devika Journalist

September 1, 2025
యుద్ధ రీతి మారుతోంది || Ukraine Russia War|| Drone Strike || Devika Journalist

యుద్ధ రీతి మారుతోంది || Ukraine Russia War|| Drone Strike || Devika Journalist

June 4, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • గంగైకొండ చోళపురంలో ఉన్నా | | Devika Journalist | |
  • మోదీ కూడా అంతే!Melody khao khud jaan jao || Devika Journalist ||
  • 30 April 2026
  • నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు! ||Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.