అన్ని దేశాల్లోఎన్నికల సమయాలలో ప్రజాస్వామ్యం గురించి, ప్రజల రక్షణ, ప్రతిపక్ష నాయకుల స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం గురించి 24 గంటలూ ఉపన్యాసాలు ఇచ్చే అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జరిగిన కొన్నిఘటనలు ఆశ్చర్యం కలిగించాయి కదా. అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలోఉన్నప్పుడే ఎన్నోరకాల కేసులు పెట్టి తింపారు. రెండుసార్లు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.
అసలు ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఎన్నికల ప్రచారంలో రెండుసార్లు అతనిమీద హత్యాయత్నాలు జరిగాయి. పెన్సల్వేనియాలో ప్రచారంలో ఉన్న అతనిపై జూలై 13న మొదటి దాడి జరిగింది. అప్పటినుంచి ఇండోర్ ఈవెంట్లకే ఎక్కువగా హాజరయ్యాడు ట్రంప్. తరువాత ఓర్యాలీ గన్ తో దాడి చేస్తే ట్రంప్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ మధ్య ఒక ర్యాలీలో అతనిపై గన్ షాట్లు పేలడంతో ట్రంప్ కుడి చెవికి గాయం అయింది. థామస్ మాథ్యూ క్రూక్స్ అనే షూటర్ ని భద్రతా దళాలు సంఘటనా స్థలంలోనే కాల్చి చంపేసాయి.
ఆ తర్వాత వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్‌లో ఆడుకుంటుండగా ఒక సాయుధ వ్యక్తి AK-47, గోప్రో కెమెరా, బ్యాక్‌ప్యాక్ కలిగి ఉన్న రాయన్ వెస్లీ రూత్ అనే అనుమానితుడిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరపడంతో ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు. 12గంటలుగా అతను అక్కడి పొదల్లోనే ట్రంప్ కోసం వేచిచూస్తూ ఉన్నా భద్రతా దళాలు అతన్ని కనిపెట్టలేదు. చివర్లో గుర్తించి కాల్పులు జరపబోతే నిందితుడు పారిపోయాడు. తరువాత అరెస్ట్ చేశారనుకోండి. తరువాత ట్రంప్ ర్యాలీకి సమీపంలో పేలుడు పదార్థాలతో నిండి ఉన్న కారును గుర్తించారు.అదింకో వైఫల్యం. కారును తనిఖీ చేసేందుకు ట్రంప్ సెక్యూరిటీ వెళ్తుంటే అందులో ఉన్న నిందితుడు తప్పించుకుని అడవిలోకి పారిపోయాడు.
అసలు అన్ని రకాల భద్రతా అంచెలను దాటుకుంటూ, సెక్యూరిటీ కళ్లు కప్పి ట్రంప్ దగ్గరి వరకు ఆయుధాలతో దుండగులు ఎలా వెళ్లగలిగారన్నది ఆశ్చర్యం.గొప్ప రక్షణ వ్యవస్థ అని గప్పాలు కొట్టుకునే అమెరికాలోనే మాజీ అధ్యక్షుడికి, అధ్యక్ష అభ్యర్థి పరిస్థితే ఇలా ఉంటే…
140 కోట్ల జనాభా ఉండి, ఇస్లామిక్, నక్సల్, ఖాలిస్తానీ వంటి ఉగ్రవాద శక్తులతో 24 గంటలూ తలపడుతున్న భారత భద్రతా దళాలు ఇక్కడ నాయకులను ఎన్నికలప్పుడు ఎలా రక్షిస్తున్నాయి కదా చూడండి.
విదేశీ మరియు దేశీయ ఇస్లాం ఉగ్రవాద మూకలు వారి ఆత్మహత్యాదళాల నుండి 24గంటలూ తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రధాని మోడీ ఎన్నికల సమయంలో టాప్ లెస్ వాహనాలలో నిలబడి గంటల తరబడి రోడ్ షోలు చేసిన సందర్భాలు ఈ దేశంలో ఎన్నోఉన్నై. మొన్నే మొన్నే చూశాం.
భద్రతా విషయాలలో అతి బలహీనంగా, సున్నితమైన,సమస్యాత్మక ప్రాంతంగా చెప్పే సరిహద్దు జమ్ముకశ్మీర్లో నిన్నా మొన్నేగా ఎన్నికలు జరిగింది. నాయకుల ప్రచారాలు,పార్టీల మీటింగులు. అస్సలు ఒక్కటంటే ఒక్క విధ్వంసకర ఘటన జరిగిందా..ఎంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. మరి భద్రత గురించి, ఎన్నికల నిర్వహణ గురించి, ప్రజాస్వామ్యం గురించి, ప్రతిపక్ష నేతల స్వేచ్ఛ గురించి మన దేశానికి ఉపన్యాసాలు ఇస్తారెందుకు?మన పోలీసు, భద్రతా బలగాలకు సెల్యూట్ చేయాల్సిందే కదా.