
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా ప్రయాణం, ప్రస్థానం ముగిసింది. పదేళ్లుగా విమానయాన రంగంలో సేవలిందించిన విస్తారా ఇక ఉండదు. నేటినుంచి ఎయిరిండియాలో పూర్తిగా విలీనం అయిపోయింది. సంస్థ చివరి దేశీయ విమానం యూకే 986 రాత్రిపదిన్నరకు ముంబైనుంచి ఢిల్లీబయల్దేరగా.. అంతర్జాతీయ విమానం యూకే 115 రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ఢిల్లీనుంచి సింగపూర్ వెళ్లింది. ఇక ఇవాల్టి నుంచి విస్తారాపూర్తిగా టాటా గ్రూపు నిర్వహణలోని ఎయిరిండియాలో విలీనం అయిపోయింది. ఇక విమానం కోడ్ యూకే నుంచి ఏఐ2ఁఁఁఁ గా మారిపోయింది. పదేళ్ల క్రితం విస్తారా తొలి సర్వీస్ ఢిల్లీ -ముంబై మధ్యే నడిచింది. చివరిసర్వీసులో ప్రయాణించిన విస్తారా సిబ్బందితో పాటు ప్రయాణీకులూ ఉద్వేగం చెందారు.
ఈ రోజునుంచి విస్తారా పేరుతో కొత్త బుకింగులుండవు. అయితే ఎయిరిండియా కొంతకాలం పాటు విస్తారా రంగు విమానాలనే నడుపుతుంది. సిబ్బంది యూనిఫాం సైతం కొంతకాలం అదే ఉంటుంది. విస్తారా ఉద్యోగులు ఇకనుంచి ఎయిరిండియా ఉద్యోగులుగా మారుతారు. ఇక ఫెయిర్లలో ఎలాంటి మార్పులుండవనిసంస్థ స్పష్టం చేసింది.అంతర్జాతీయ సర్వీసులు మరింత పెంచే యోచనలో ఎయిరిండియా ఉంది.
టాటాగ్రూప్ ఎయిరిండియాలో విస్తారావిలీనం తరువాత మరో 3,195 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది సింగపూర్ ఎయిర్ లైన్స్. విస్తారాలో టాటా గ్రూప్ వాటా 51 శాతంగా, సింగపూర్ ఎయిర్ లైన్స్ వాటా 41 శాతంగా ఉంది. విలీన సంస్థలో సింగపూర్ ఎయిర్ లైన్స్ వాటా 25.1శాతం. రెండు సంస్థలవిలీన ప్రక్రియ 2022 నవంబర్ 29న ప్రారంభించగా ఈ ఏడాది నవంబర్ 11 న పూర్తికానుంది.















