• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Tuesday, July 21, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home జాతీయం

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం-జమిలికి 32 పార్టీల అంగీకారం, 15 పార్టీల వ్యతిరేకం

Devika by Devika
December 12, 2024
in జాతీయం, ప్రాంతీయం, రాజకీయాలు
0
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం-జమిలికి 32 పార్టీల అంగీకారం, 15 పార్టీల వ్యతిరేకం
0
SHARES
6
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

కేంద్ర మంత్రి మండలి జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టే అవకాశముంది. డిసెంబర్ 20 న సమావేశాలు ముగిసేలోపు ప్రవేశపెట్టి పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ జమిలి ఎన్నికలు ఎలా నిర్వహించాలన్నదానిపై కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించింది. ముందుగా పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి.. తర్వాత వంద రోజుల్లో స్థానిక సంస్థలకు నిర్వహించాలన్నది కమిటీ ప్రతిపాదన. లోక్ సభకి, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించటానికి రాజ్యాంగ సవరణ అవసరం. కానీ వీటిని రాష్ట్రాలు ఆమోదించాల్సిన పన్లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల విధానాన్ని మార్చటానికి మాత్రం సగం కంటే ఎక్కువ రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించాలి.

రాజ్యాంగంలోని 83వ ఆర్టికల్ లోక్ సభ వ్యవధి, ఆర్టికల్ 172 శాసనసభ వ్యవధి గురించి చర్చిస్తుంది. ఒక వేళ ఈ బిల్లు ఆమోదం పొందితే.. చాలా రాష్ట్రాల శాసనసభలకు మధ్యలోనే ఎన్నికలు జరుగుతాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రియాల్టీలోకి 2029లో వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వేళ ఐదు సంవత్సరాల పూర్తి కాలం గడవక ముందే మెజార్టీ కోల్పోయి లోక్ సభ లేదా శాసన సభ రద్దయితే.. కేవలం మిగిలిన కాలానికి మాత్రమే తర్వాతి ప్రభుత్వం ఏర్పడాలని కమిటీ ప్రతిపాదించింది. అయితే…2029లో జమిలి ఎన్నికలు జరపాలని చూస్తే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలు పూర్తి చేయకుండానే రద్దు చేయాల్సి వస్తుంది. ఇక లాస్ట్ ఇయర్ ఎన్నికలు నిర్వహించుకున్న హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు 2027 నాటికి ఎన్నికలు నిర్వహించాలి. అలాగే రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే ఆయా శాసన సభల్ని రద్దు చేసి లోక్ సభతో పాటు ఎన్నికలు జరిపించాల్సి ఉంటుంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ ప్రభుత్వాలు 2026లోనే ఎన్నికలకు వెళ్తాయి. కాబట్టి ఆయా ప్రభుత్వాలు మూడేళ్ల పాటు అధికారంలో ఉంటాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు లోక్ సభ ఎన్నికలు అటు ఇటుగా జరిగాయి కాబట్టి వాటికి ఇబ్బంది ఉండదు. జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికలకయ్యే ఖర్చు తగ్గే అవకాశముంది. ప్రస్తుతం లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికల్ని నిర్వహించేందుకు, ఈవీఎంలు తయారు చేసేందుకు 8 వేల కోట్లు ఖర్చు అవుతోందని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఈ ఖర్చులో స్థానిక సంస్థలకు అయ్యే వ్యయాన్ని కలపలేదు. ఇంకా ట్రాన్స్ పోర్టేషన్, గిడ్డంగులు, ఇంకా ఇతర ఖర్చుల్ని కూడా కలపకుండానే భారీ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది.

ప్రతి ఆరు నెలలకొకసారి ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు, ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి సాగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల కోసం పని చేయటం వల్ల అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఇంకా ఓటర్లు కూడా తరచు ఎన్నికల్లో పాల్గొనేందుకు దూరభారం లాంటి కారణాలతో ఆసక్తి చూపట్లేదు. ఇక ఎన్నికల కోడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరు, అభివృద్ధి పనుల్ని ప్రకటించలేకపోతున్నాయి. ఇక కోవింద్ కమిటీకి 47 పార్టీలు తమ అభిప్రాయాల్ని సమర్పించాయి. అందులో 32 పార్టీలు అంగీకరించాయి. 15 పార్టీలు మాత్రం వ్యతిరేకించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విభజించు పాలించు నినాదాన్ని పట్టుకొని దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే… జాతీయ ప్రయోజనాల వైపు ప్రజలు మొగ్గు చూపుతారని భయపడుతున్నట్టుంది.

Tags: modi on one nation one electionone nation one electionone nation one election billone nation one election in indiaone nation one election newspm modi on one nation one electionwhat is one nation one election

Related Posts

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?
అంతర్జాతీయం

పార్టీ అధ్యక్ష పదవికి ట్రూడో రాజీనామా?

January 31, 2025
బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ
జాతీయం

బీజేపీ అభ్యర్థి వివాదాస్పదవ్యాఖ్యలు-క్షమాపణ

January 6, 2025
భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం
జాతీయం

సోషల్మీడియాలో ఉండాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి-కేంద్రం కొత్త చట్టం

January 4, 2025
180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..
జాతీయం

180 కిలోమీటర్ల వేగం- ఒక్క నీటిచుక్కా కిందపడలేదు-వందేభారత్ స్లీపర్ ట్రయర్ రన్..

January 4, 2025
పినరయి స్టేట్మెంట్ వెనక ఉన్న కుట్ర ఇదే!
జాతీయం

పినరయి స్టేట్మెంట్ వెనక ఉన్న కుట్ర ఇదే!

January 4, 2025
Next Post
రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఆ వర్గం మేలే ముఖ్యం-ఆ పార్టీ నిజస్వరూపమే అది!

రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఆ వర్గం మేలే ముఖ్యం-ఆ పార్టీ నిజస్వరూపమే అది!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

భారతీయ మహిళ ధీరత్వాన్ని, వీరత్వాన్ని మరిచిపోయింది|| Devika Journalist ||

భారతీయ మహిళ ధీరత్వాన్ని, వీరత్వాన్ని మరిచిపోయింది|| Devika Journalist ||

May 27, 2025
సొంత మనిషి దగ్గరే మేం అద్దె మనుషులమైపోయినం | Devika Journalist |

సొంత మనిషి దగ్గరే మేం అద్దె మనుషులమైపోయినం | Devika Journalist |

December 26, 2025
కంచి పీఠంపై  విమర్శలెందుకు?|| Shankara Jayanthi || Devika Journalist

కంచి పీఠంపై విమర్శలెందుకు?|| Shankara Jayanthi || Devika Journalist

May 3, 2025
ఆదానీ,అంబానీల మీద పడి ఏడవడం తప్ప వాళ్లకు మరో పనేలేదు|| Devika Journalist ||

ఆదానీ,అంబానీల మీద పడి ఏడవడం తప్ప వాళ్లకు మరో పనేలేదు|| Devika Journalist ||

July 4, 2025

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • గంగైకొండ చోళపురంలో ఉన్నా | | Devika Journalist | |
  • మోదీ కూడా అంతే!Melody khao khud jaan jao || Devika Journalist ||
  • 30 April 2026
  • నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు! ||Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.